Mattakokila

35.


34.

ఆదుకొందువు అన్నివేళల ఆదిశక్తిగ భక్తులన్

సాదుపుంగవ సేవితా భవ సాగరమ్మును దాటగా

నీదుసన్నిధిచేరగా శివ నిర్మలా నిను వేడుదున్

నాదుజీవన గమ్యమా శరణమ్ము సార్దక దాయకీ

33.

శ్రీసరస్వతి శారదా తవ శ్రీపదమ్ములు గొల్తు నే

శ్రీసుధామయి భారతీ శుభ శ్రీప్రదా నిను వేడెదన్

శ్రీసురాగమ రంజితా మమ శ్రీసుఖాభివివర్ధినీ

శ్రీసుమార్చితరాగపూజిత శ్రీశుభంకరి పాహిమాం


32.

ఆదిశక్తివి తల్లి నీవెగ ఆర్తబాంధవి వేడుదున్

నీదు బిడ్డలమమ్మ నువ్విల నీడయై మము బ్రోవుమా

ఆదుకొందువు అన్నివేళల ఆత్మకారకశక్తివై

శ్రీదయామయి సన్నుతాంగి అశేషభక్తసుపూజిత


31.

శ్రీద శ్రీవరదా ఘనా వర శ్రీగణేశ్వర పాహిమాం

శ్రీదయాకర  శూర్పకర్ణ విశేష బుద్ధిబలప్రదా

నాదబిందుకళాధరా గణ నాయకా ప్రణమామిత్వం

మోదకప్రియ సిద్దివర్ధక మోక్షదాయక రక్షమాం



30.

శ్రీమహామహిమాన్వితా శుభ శ్రీప్రభాకరదీపికా

వామదేవ శివా శుభంకర భక్త పూజిత శ్రీపదా

కామితార్ధ ఫలప్రదా మమ కర్మ సంకట వారణా

ఓమునీశ్వర సేవితా బహు ఉన్నతోన్నత న్యాయమా

29.

నిన్నునమ్మితినాగభూషణ నిత్యపూజిత ఈశ్వరా

ఉన్నతోన్నతదైవమా నువు ఊహకందని తేజమా

సన్నుతింతుననంతతత్వ అసాధ్యసాధకహేతువా

సన్నిధిన్ ననుచేరనిమ్ము శశాంకశేఖరమూర్తివై

28.

భక్తిగా నిను సన్నుతించెద భార్ఘవీ భవతారిణీ

ముక్తినీపద సేవనమ్మని మోకరిల్లుదు పార్వతీ

భుక్తి బుద్ధి బలమ్ములన్ నువు భూరిగా నొసగేవు ఓ

భక్త పోషక శక్తిరూపిణి బాంధవీ భయవారిణీ

27.

శ్రీధరా శుభదా నమామి వశీకరా ప్రణమామిత్వం 

మాధవా మధుసూదనా మమ మానసమ్మున నిల్వుమా

శ్రీధనా సకలాగమాది విశేషపూజిత దైవమా  

సాధనాపధమార్గదర్శివి సంతసాది స్వరూపమా

26.

ఆదిపూజిత పాదసేవిత ఆగమాది సుసన్నుతా

శ్రీదయాపరిపాలకా శశి శేఖరా భవ నాశకా

నాదుపుణ్యము నాదుపాపము నాగభూషణ నీవెగా

నీదయన్ యిల నీకృపన్ శుభ నిర్మలా నను గ్రోలనీ


25.

శంకరా భవతాపహారి శశాంకశేఖర ఈశ్వరా

సంకటాదివిషమ్ములన్ శుభ శాశ్వతా నువు గ్రోలగా

జంకువీడుజగమ్ములే శివ జంగమాది జనేశ్వరా

అంకురించు అనన్యభక్తియె ఆలకించిన నీకధల్

24.

వాయుపుత్రుని కంజలుల్శుభ వందనమ్ములుభక్తిగన్

ఖాయమౌ విజయమ్ములున్ హితకారణమ్మది నీవెగా

కాయమున్ నువు పెంచినావట కాలమవ్వగ లంకకున్

న్యాయమున్ నువు నిల్పువాడవు నాయకా నిను మ్రొక్కెదన్


23.

వేంకటేశ్వర నీవు పెన్నిధి వేదమూర్తివి దైవమా

అంకురించును భక్తినీయెడ ఆదిలక్ష్మికటాక్షమున్

అంకపీఠమునం ధ్రువుండట ఆర్త త్రాణ పరాయణా

సంకటమ్ములు దూరమౌనుగ శంఖుచక్రగధాధరా

22.

శ్రీభవానికి అంజలుల్ శుభ శ్రీకరీ నువు బ్రోవుమా

ఈభవాబ్దిని దాటగా నను ఈశ్వరీ కరుణించుమా 

ఏభయమ్ములు చేరవున్ నువు యిచ్చినన్ శరణంబునున్

లోభనాశిని శ్రీఉమా  నువె లోకమాతగ గావునన్


21.

నీలకంధర భస్మలేపన నిర్గుణాత్మక పాహిమాం

ఫాలలోచన భక్తసేవిత పాపమోచన రక్షమాం

కాలకాల చరాచరాస్థిత కాలభైరవ బ్రోవుమా

ఏలరా నను సర్వమై నువు ఈశ్వరా సతతమ్మిలన్


20.

వంద వందనముల్ ప్రభో తవ పాదపద్మములొద్దయున్

బందమోచన దాయకా నువు బంధమైనను బ్రోవుమా

చందనాది సుపూజితా యిల చంద్రశేఖరమూర్తివిన్

అందలమ్మది నీ కటాక్షము అందుమానువుదైవమా

19.

రాఘవా శిరసానమామి క్షిరాబ్దివాస దయామయా 

శ్రీఘనా వరదా నమామి అశేషభక్తసుసేవితా

మేఘవర్ణ సదాశుభంకర మేధినీపతి రక్షమాం

ఆఘమేఘములన్సదానువు ఆదుకొందువువేడినన్


18.

రామచంద్రుడురాఘవుండు విరాగరాజ్యమహీపతీ

రామభద్రుడుజానకీపతి రంగనాధుడుతానెగా

రామనామమురామబాణము రాజ్యభారముమోయుగా

రాముడేతనుదేవుడైధర రంజిలెన్మనకోసమై


17.


ఈదినమ్మతిశోభనమ్ముగ ఈశ్వరుండుతనేఅమర్

చేదయాబ్ది స్వరూపమై , యిక, చింతయేమదివీడుగా

శ్రీదయావరపాదముల్శుభ శ్రీప్రదమ్ములుశాశ్వతా

మోదదాయకసాధనమ్ములు మోక్షకారకగమ్యముల్


16.

నారదాదిమునీశ్వరుల్సుర నాగయక్షగణేశ్వరుల్

పారమార్దమునొందుదుర్తవ పాదపూజచె ఈశ్వరా

క్రూరతత్వము బాపుమా నువు క్రోధనాశక దైవమై

ఘోరపాపనిఖండనా ఘన ఘూడపుణ్యవివర్ధనా


15.

ఈపదార్ద ప్రపంచమందున ఈశ్వరానినుగొల్వగా

పాపముల్గడిగేవుసాంబశివాకటాక్షమెనీవుగా

ఓపరాత్పరవేదసన్నుత ఉన్నతోన్నతదైవమా

నీపదాంబుజసేవనే యిల నిర్మలోదయ ముక్తియౌ


14.

వేగ రా కరుణాబ్ది సాంబశివేశ్వరా పరమేశ్వరా

శ్రీగణేశ్వరసేవితా శుభ శ్రీకరా సుర పూజితా

నాగభూషణ నీలకంఠ అనాది నీవు నిరంతరా

ఆగమాదినుతా హరా నిజ ఆత్మసంభవ నిర్మలా

13.

గాన రా నువు వేంకటేశ్వర కన్నతండ్రిగ గావ రా

ఆనతీయుము అంతరాత్మకు ఆదిదైవము గా నువే

నేనునా అన బోకనిన్ ధరణీధరా నువు వేగనే

సానబెట్టుము భావమున్ తవ సారమే హృది గమ్యమై


12.

ధ్యేయమౌ పదసన్నిధానము దివ్యమంగళకీర్తనన్

కాయమే తను కానుకౌ నిను గాంచినం ధరణీపతీ

ఖాయమౌనుగ ముక్తితాను అఖండభక్తిగ నిల్చినన్

మాయ తానుగ వీడగా నను మాధవా నువు చేరవా


11.

దేవరా నిను గొల్వగా ధర దివ్యసీమగ మారుగా

ధీవరా నిను దల్వగా మది దీనతత్వత వీడుగా

పావనాకృతి చూపునాకిల పాపనాశక శాంభవా

దేవదేవ అపారమౌ కృప దేవదేవ దయామయా


10.

గావ రా కరుణావరా నువు కామితార్దము దీర్చ రా

బ్రోవ రా నను ఈశ్వరా భవ రోగవారక మూర్తివై

దైవమా నువు ఏలుమా నను దక్షతై సకలాముగన్

సావధానము గాను గావు అసాధ్యసాధక హేతువా

9.

పూవులం బహు ఓర్పుగా నిడి పూజ సేయుము శ్రద్దగా
కోలెం గల దైవమే మన కోర్కెలం తను దీర్చుగా
శ్రీరా నువు గావలే యని శ్రీపదమ్మును కోరుమా
రమ్ములు గావలెన్ యిల శుడేతను దక్కినన్


మ్రొక్కెదనీకయ్య మోక్షప్రదాయకా

దీనసం రక్షకా దేవదేవ

నీవెదిక్కువుతండ్రి నిజభక్త బాంధవా

అన్నిసమయములన్ ఆదుకొనుము

దానవాంతకహరీ దారిద్ర్యనాశకా

దయగగాంచుముతండ్రి తత్వనిలయ

సమ్మోహనాకార సహనగుణప్రదా

సర్వలోకేశ్వరా సత్య తత్వ


ఆదిమధ్యరహిత అంతరాత్మానమో

ప్రణతినీకుతండ్రిప్రాణనాధ

శరణముశరణము అసంఖ్యాక శుభగుణా

ఆశ్రితహితవరద అండనీవు


8.

నామదిన్నువునిండగా ననునందమేతనువీడదున్

ఆమనేబహుహాయిగాతను ఆడుగా, ధరపొంగుగా

ఈమనోధరహాసమైతను ఈశుడేనను బ్రోవగా

శ్రీ, మహత్తులు మెండుగా యిల శ్రేయమైననునింపెగా


7.

అమ్మవోలెనుమీరుగాతురు అయ్యవోలెనురక్ష ఔ

నమ్మకమ్మునుపెంచుదుర్ యిల నందివాహనుమూర్తియై

చెమ్మగిల్లునుకన్నులే తము చెంతనిల్చినమీరుగా

సమ్మతింతురుమంచిగామముసమ్మతింధరనిల్పగా

6.

శ్రీదయాసగరా నమామి అశేషభక్తజనోద్దరా 

శ్రీద శ్రీశుభదా నమామి విశేషకీర్తివరప్రదా

నాదమావరధామమాసుగుణాభి శ్రీకర రామమా

పాదముల్కడస్థానమున్నువుప్రాప్తముంకలిగించుమా

5.

కోపతాపములన్ని నీపదకోవెలం కడ వీడెదన్

తాపసిన్ననుసేయుమానువు దానవాంతక శ్రీహరీ

నీపదాబ్జములందుభక్తిని నిశ్చయమ్ముగనీయుమా

ఈ పదార్ధ ప్రపంచమందున ఈశ్వరానువు కానరా

1.

మంద్ర స్థాయినహాయిగా హృది మందహాసముసేయగా

చంద్రశేకర చింతనమ్మతి శ్రద్దతో నను నింపగా

ఇంద్రియమ్ములు తాముదాల్చెను ఈశ్వరాకృతినిండుగా

సంద్రమున్నడిసంద్రమున్నడి శాంతమేనను బ్రోచెగా  

2.

బాలుడుంపసిబాలుడున్ననుపాలముంచగవచ్చెనో

కాలకాలుడుతానునాకిలకామితమ్ముగనిచ్చెనో

మేలుకోలుపునాకిదేననిమేధినీపతిదెల్పెగా

ఆలమందలకాపరేతను అండగానిలనిల్చెగా

3.

వందనమ్ములునావి ఈశ్వర పాదముల్కడభక్తిగా

చందనార్చితదేహముంగల సర్వసాక్షికి మ్రొక్కెదన్

బందువాతడు ప్రాణకోటికి బంధమోచనుడుంతనే

సుందరమ్మతిసుందరమ్మతి శోభనమ్మిలదైవమే

4.

భుక్తిదాయకక్షేమకారకభోగవర్షకదైవమా

భక్తచందనభావ స్పందన భక్తరక్షక నేమమా

శక్తిచాలక సత్యబోధక సత్వతత్వవివర్ధనా

ముక్తిదాయక మోదకారణ మోక్షదాయక మార్గమా



4.


Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3