Nithya Deva 6
100 నూరుపద్యములను నుడివితి భక్తిగ చదువువారికీయ చలువ శ్రద్ద దయగనీవుగాంచి తామసమునడచి శుభమునీయితండ్రి శోభనాంగ 99 చరణ వందనములు చంద్రశేఖరునికి పదసుమాంజలులివి పాదములకు నయనదీపకునికి నమములు అజ్ఞాన ధ్వంసునికి పదసుమదళములివియె 98 నిత్యదర్శనమ్మునిజముగ నాకిచ్చె నాదుగురువుతానునందముగను దర్శనమ్ముసర్వదారిద్ర్య దుఃఖహ రణముసర్వభవహ రణము వరము 97 యిష్టములనుకష్ట నిష్ఠూరములను నే నర్పనమునుసేతు నాగభూషు పదములకడ ; శివుని పదపద్మములు సర్వ తాపహరణములవి దయకుపేరు 96 కష్టములనుగూల్చ కాలభైరవుడుండు నష్టములనుపూడ్చ నందివాహు నిజమిదనిమరచుచు నిష్ఠూర బడనేను మనసునందునెపుడు మదనవడను 95 నమమునీకుతండ్రి నాదుహృదయనాద అనితర కృప కరుణ ఆత్మనిలయ వందనమ్ము ప్రాణ వల్లభా శరణము శాంత మూర్తి శరణు సాంబ సదయ 94 నిస్సహాయతలను నిజకోపతాపము అర్పనమునుసేతు అభవునికడ దుర్బలతను అన్ని దుర్బుద్ధులనునేను అర్పనమునుసేతు అభవునికడ 94 లోనిశత్రువులను లోభమాత్సర్యము లనుదునమవలెనిల అనుదినమ్ము యుద్దములనుసేయు యోగికావలెనేను విజయమొంద ధరన వినయముగను 92 చూడ దగును శివుని చోద్యము వడకుండ ప్రతి అణువున మరియు ప్రతి క్షణమున సర్వ కాల స్థితుడు సర్వేశ్వరుడు తానె సర్వ కర్త భోక్త సత్...