nithyadeva5
కాంతిని పంచినిత్యమిల కర్మల త్రుంచెడి ఈశ్వరా నమో
శాంతినిపెంచి కాయమును సాత్విక ధర్మమునందునిల్పుమా
భ్రాంతుల పారదోలు తలి బైరవిపాదములండనీయుమా
అంతముసేయుమా మనిషి అంతరమందునమాయ శాంభవా
పుస్తకధారిణీ ప్రణతి పుష్పములవ్వగ పద్యమాలికల్
మస్తకమున్ హృదిన్ కదుపు మానస తంత్రివి నీవుతల్లి, నా
హస్తము వ్రాయగా మధుర హాసము లంకురిపింపజేయుమా
వాస్తవమున్నువేతెలుపువాక్కుగమారితరింపజేయుచూ
జ్ఞానముపెంచుచూ మనక ఖండితశిక్షణ గూర్చుతానిలన్
ధ్యానమునేర్పుచూమననిదానముగూర్చిపరిశ్రమవ్వుతా
దానముగోరులోనగలదైన్యము దాగిన దుఖములంగదా
ఆనతివేడెదన్ అమిత ఆదరమూర్తినినాదుదైవమున్
పరమశివుడునాదుగురువు
పరమాద్వైతమ్మునిచ్చుపరశంకరుడున్
పరమశివోహం యనునా
గురువాక్కిలనిడునుముక్తిగురిదప్పక్కన్
పరమశివుడణువణున తా
నరయునుయను నిజమునమ్మి నామది తానే
పరవశమొంది తరించెను
వరమిదిగురుకృపయిది యికవగపునిలవదున్
భక్తవశంకరా నమము భావవినిర్ణయహేతువా నమో
ముక్తి ప్రసాదముల్సరళ మోహవినాశకపర్వమవ్వగా
రక్తిని కల్గజేయి మది రాజిలసత్యము గోచరింపుమా
యుక్తినిమేల్గొపించినువు యోగము ప్రాప్తము సేయుమా ప్రభూ
యోగమిదియేనుమనసా
యోగియు యాగముయు తానె యోగేశ్వరుడున్
భోగియు భోగము అగునా
భోగేశ్వరుడున్సకలముభువనేశ్వరుడే
పరులెవ్వరు గారు మనకు
పరమశివుని సృష్ఠి మనము పాడిగను ధరన్
పరమాత్మరూపు మనము అ
పరిమిత శక్తి యగు ఫలము ప్రార్ధన చేతన్
పరమాద్వైతము వీడుచు
ఒరులకు దుఃఖముల నిచ్చి ఓడకు మనసా
పరమశివుని ధ్యానమునద
మరచుట యే పాపమూలమవ్వును ధరలో
ఆనందరూపదేవా
గానముసేసిననునీదుఘననామమ్ముల్
మీనాక్షికడుదయగగను
మేనుకుగల్గునుకుశలత మేరునివాసా
భగవంతుడునాకిచ్చెను
నగవునుకూరిమిగతానునాగేశ్వరుడై
సగభాగమైనతల్లియె
భగభగమనిపించెనాదుభవభయ ములనిలన్
నాబిడ్డకునిచ్చెనుతా
నాభగవంతుడు తనదు నందము వాక్కున్
ఆభూరికృపకు దయకును
ఈభూతలమందులేదు ఎట్టికొలతతా
భూలోకముకావలెగా
ఆకైలాసముగ; జనులు ఆనందముగన్
నీకైప్రార్ధింపవలెను
ఓకైలాసగిరినాధ; యిదిమన్నింపుం
Chapter 2
మరచితిమిసంస్కృతమ్మును
విరచితిరిలసంస్కృతినిగవివిధవిధులలో
గురువుకదిపెనాకలమును
గురుకృపగతెలుగునపద్య గుళికలు వ్రాయన్
భవరోగమునుహరించును
నవనాడులనుంచి అవియె నయగారముగన్
సవరించును జీవి దశను
అవతరణలక్ష్యముదెలిపి ఆనందదిశన్
గురువు మనన్సదా నడుపు కూరిమి తోడను సత్యసారమై
వరములు వెల్లువై కురువ వ్యాకులతల్నిలువంగలేవికన్
సరళము జీవితంబగును శాశ్వత శాంతిని మెండుగా నిడున్
కరములు జోడ్తునా సకల కల్మషనాశకుపాదముల్దరిన్
పరమశివనిలయమయ్యెను
గురువాక్కుమహిమ గనాదు గృహము నేడున్
వరముగవాగ్దేవిబలికె
కరమయ్యెనుపరమశివునికరదీపికగన్
మాటలముత్యాలొలుకగ
ఆటలనానందమువడి ఆరోగ్యముగా
నాటకముబిడ్డడునడుపు
బూటకవ్యాధులవిబోవ భువనేశుకృపన్
ధృక్పధము నాకు మారెను
వాక్పతిదయ సేతనింక వ్యాకులతేలన్
దిక్పాలురుకావగతి
ర్యక్పుడ్రంబును జగద్గురానతిగధరన్
అదనుగ పరుగులు వెట్టక
కుదురుగను మెదిలెను బిడ్డ , కూరిమి సూపెన్
మృదువుగ భగవద్స్తుతి సే
సె దిగులుబడు నామనసది సేదను బొందెన్
నాగురువు దెలిపి ననుమేల్గొపెదయగ
సత్యమెరిగినేను శాంతినొంద
ఊరఢిల్లె మనసు ఉత్సాహముబెరిగె
వ్యాధికాదనుశుభ వార్తదెలిసె
కానుక నాబిడ్డ కైవల్య పధమందు
కనుగొంటి నేనిది కనులు దెరచి
పరమశివుడుతానె పసిబాలుడైనాడు
నాముంగిళినడుమనడువతానె
పుణ్యమేమిసేసి పుడమిలో బుట్టెనో
గురువుకరుణగగని కూర్మినిచ్చె
రామరామయనుచు రాజిల్లునాబిడ్ద
బాధబడుటయేల భయము యేల
Chapter 3
పరమశివుడెచటకలడని
తరచితరచివెతకుటేల తలపున శివుడిన్
మరువకసేయుము ప్రతిపని
నెరయుచు శివతత్వమునిల నేర్పుగ మనసా
పరుగులు పెట్టక బయటికి
మరువక పట్టు నువు లోని మాధవు పదముల్
హరి వెలిసెను ప్రతి అణువున
కరివరదుని కరుణనడుపు కాయములనిలన్
మన శ్వాస యిలన తంత్రము
మనపలుకులు మంత్రములవు మంచితనముచే
మనతలపు భగవదర్పిత
ఘన జ్ఞాన ప్రదీపకయగు గాంచిన దయగన్
వేకువజామునయోగా
చేకూర్చుసకలశుభములు చింతలు బోవున్
ఆకైలాసపతికి పూ
జల్కైమోడ్పులివినీయు సంవృద్ధినిలన్
రామా కరుణాంతర్గతా రాకేందు వదనా
శ్రీరామా పద్మనేత్రా అనంతకృపాసదనా
సీతామనోవిహారా శ్రితజనపారిజాతా
సౌమిత్రిసంసేవ్య ఆంజనేయార్చితా
సకలశుభప్రదా లోకసంరక్షకా
సౌజన్య సంతోష కల్యాణకారకా
భక్తజన పరిపోష భవభయ భంజనా
త్రైలోకపూజ్య అసురనికంజనా
శ్రీనివాసావిభో శ్రితపారిజాతా న
మామి మంగళరూప మహిమ నీదె
మమతాపవారకా మాంపాహి శ్రీధరా
పాపవినాశకా పద్మనాభ
పతితమోచనపాద పన్నగశయనా అ
సురకులభంజనా శ్రుతివిభూష
వేవేలనామాల వేడుకొందుమునిను
ఆపన్నరక్షకా ఆదిదేవ
నమములివి నీపదములకు నందనంద
శరణమును ఈయి శ్రీనివాసాదయగను
వందనములునీకువరదా వాసుదేవ
వేంకటాచలనిలయాసవినయముగను
యిష్టములు అయిష్టమ్ములు
కష్టసుఖమ్ములుమనోవికల్పిత మాయల్
నిష్టగనీశునిగొలచిన
నిష్టూరముచెందిమదిని నిజముగ వీడున్
మాయానదిపైపయనము
ఖాయముగదయగగనుమనకాశీపతితా
నాయకుడాతడెనావకు
ధ్యేయము అద్దరి సులువుగ దేహిని జేర్చున్
రక్షవునీవయ్య రాక్షసగణనాశ
దైవమునీవయ్య దయవునీవు
దిక్కువునీవయ్య దీనపాలునివయ్య
భక్తజనోద్దరా భవభయహర
త్రాహిత్రయంబకా తాపత్రయాంతకా
శక్తిసంద్రమునీవు సాక్షిభూత
భోళాప్రభోనమోభోగప్రదాతా అ
ఖండశుభవరదా గరళకంఠ
ఆదిదైవమునువు ఆనందపరిసేవ్య
అఖిలలోకపూజ్య అమరవంద్య
రాగ ద్వేష రహిత లలితకళారాధ్య
శరణువేడితినిను సాంబ సదయ
జీవిపయనమిది జీవనగమన సా
రమిది ఆస్వాదింపుమీ రమ్యరసము
సీ
నదిపైపడవపాట నారాయణునియాట
నానాటి నాటకానందమిదియె
నిత్యసత్యమిదియె నిగమతత్వమిదియె
నరునితాకదనిత్య నాశనమ్ము
నవనిధులవియేమి నట్టేట మునకేమి
నయగారమదియేమి నాకమైన
నేమి కాలమ్మైన నేమి దేహమ్మైన
నేమి యెట్టి అవస్త నీది కాదు
ఆ
నేతి నేతి యనుచు నిజమును శోధింపు
నిన్న నేడు రేపు నీవి గావు
నియమమిది : సమయము నిజ స్వప్న నౌకయే !
నిజమునెరిగిమనుము నిర్భయముగ
రాజీవలోచనా రఘువంశతిలకా న
మామి నారాయణా మందహాస
సీతాపతీనమో శేషాద్రి నాయకా
దానవంతక హరీ దైత్యదమన
గోకులోత్తమదేవఘోరకల్మషనాశ
గోపాలక కృష్ణ కుండలధర
భక్తఛూడామణీ భవభయ భంజనా
విశ్వనిర్దేశకా వేదవాస
సకలశుభనిధాన సర్వలోకేశ్వరా
సత్వగుణవివర్ధ శాంతమూర్తి
సామగానలోల సందేహ నిర్మూల
శరణు శ్రీహరీ విషయవిదూర
ప్రణమామి శారదా ప్రణవస్వరూపిణీ
పాలయమాంసదా పాపనాశి
మమతాప వారిణీ మనసా నమామిత్వం
దుఖవిధ్వంసినీ దోషవారి
విద్యాప్రదాయినీ విజ్ఞాన దాయినీ
ప్రజ్ఞాన దీపికా పరమ కరుణ
సజ్జనోద్దారినీ సన్మార్గ బోధినీ
సత్వసంతోషిణీ శాంతితత్వ
సరసిజదళనేత్రి సకలశుభప్రదా
భగవతీనమో అభయవరకరి
దేహిమాంసరస్వతీ సద్బుద్ధివరదా
అక్షరములనీయి అక్ష్యయముగ
యిష్టములు అయిష్టమ్ములు
కష్టసుఖమ్ములుమనోవికల్పిత మాయల్
నిష్టగనీశునిగొలచిన
నిష్టూరముచెందిమదిని నిజముగ వీడున్
మాయానదిపైపయనము
ఖాయముగదయగగనుమనకాశీపతితా
నాయకుడాతడెనావకు
ధ్యేయము అద్దరి సులువుగ దేహిని జేర్చున్
ప్రణమామి రాఘవా పరమార్ధ దాయకా
సాధనా గమ్యమా సారసాక్ష
పాహిమాం పావనా పాహి లక్ష్మీపతీ
పన్నగ శయనా అపార కరుణ
మాంపాహి మాధవా మమతాప వారకా
పాప వినాశకా పద్మనేత్ర
పరిజన పోషకా పతిత విమోచనా
తాపస మందార దయగ గనుము
భక్త హృదయవాస భవభయ భంజనా
నిర్మలాంతరంగ నిగమపూజ్య
సత్వతత్వనిలయ సచ్చిదానందా స్వ
యంప్రకాశకా ప్రయత్న ఫలద
శ్రీరామ రఘురామ శ్రీరామ రణభీమ
శ్రీరంగ నాధా విశేష కరుణ
శ్రీపురంధర నాధ శ్రీపాండురంగా న
మామిభక్తవరదా మందహాస
కారుణ్య సంద్రమా కైవల్యఫలదాత
దోషనివారకా దుష్ఠదమన
ధీరగంభీరా అధిష్టాన దైవమా
శాంతమూర్తీనమో సత్యసంధ
ధర్మపాలకా అధర్మవినాశకా
సత్యనియమశీల సార్వభౌమ
సుగుణసంపదాది సకలశుభప్రదా
మోహముద్గరా అమూల్యకరుణ
సౌఖ్యమునొందుమునెరవుచు
సఖ్యతసంసారమందు శాంతము తోడన్
సంఖ్యలకందనిశుభములు
ప్రఖ్యాతులుమీవవగనుపరమాత్మదయన్
శ్రీరామ రఘురామ శ్రీరామ రణభీమ
శ్రీరంగ నాధా విశేష కరుణ
శ్రీపురంధర నాధ శ్రీపాండురంగా న
మామిభక్తవరదా మందహాస
కారుణ్య సంద్రమా కైవల్యఫలదాత
ధృడగాత్రవరదాయి దుష్ఠదమన
ధీరగంభీరా అధిష్టాన దైవమా
శాంతమూర్తీనమో సత్యసంధ
జానకీవల్లభా జపతపధ్యానాది
సేవితా శ్రీహరీ శ్రీశుభకర
అభయప్రదాయకా ఆధార హేతువా
ఆనంద గంధమౌ ఆత్మబందు
రావణాంతకదేవ రాక్షసాంతక విభో
కరుణాసముద్భవా కమలనేత్ర
దేవదేవా నమో దీనపాలా నమో
జననమరణజరా సంకటహర
అఖిలలోకనాధ ఆత్మసంజ్యోతకా
ఆత్మగురువుగాను ఆననీయి
అంధకారదూర ఆనందపరిసేవ్య
అండనీవుతండ్రి అమితకరుణ
సాంబశివా నమో సకల శుభవరదా
సర్వలోకేశ్వరా చంద్రమౌళి
రాగ ద్వేష రహితా రాజరాజేశ్వరా
రుద్రా త్రయంబకా రుగ్మహర్త
గంగాధరాపాహి గరళకంఠా త్రాహి
గజముఖానుగ్రహా ఘనతనీయి
మన్మధాంతకహరా మాయావినిర్మేత
మమపాపపరిహర్త మంగళకర
స్వాంతనమ్మునీవు సాక్షితత్వమునీవు
సర్వమునువుస్వామి శంభునాధ
భూరికృపవునీవు భోళా శివా నీవె
రక్షవెప్పుడును సురమునివంద్య
సిద్ధివినాయకా శిరసానమామి త్వం
ప్రమధగణాధిపా ప్రణతి స్వామి
లంబోదరా నమో లక్ష్యవిఘ్నహరాయ
పార్వతీపుత్రాయ పాహిపాహి
మూషికవాహనా మోక్షప్రదాతా శ
రణు వక్రతుండాయ రక్షరక్ష
ఏకదంతా త్రాహి ఈశ్వర వరసుతా
ఆశ్రితోద్దారకా అండనీయి
ఆర్తిబాపుమయ్య ఆనందదాయకా
మోదకప్రియా ; విమోచనమ్ము
నీదుకీర్తనమ్ము ;నీకుమోకరిలెద
శుభకరా ;నమామి శూర్పకర్ణ
సాంబశివా నమో సకల శుభవరదా
సర్వలోకేశ్వరా చంద్రమౌళి
రాగ ద్వేష రహితా రాజరాజేశ్వరా
రుద్రా త్రయంబకా రుగ్మహర్త
గంగాధరాపాహి గరళకంఠా త్రాహి
గజముఖానుగ్రహా ఘనతనీయి
మన్మధాంతకహరా మాయావినిర్మేత
మమపాపపరిహర్త మంగళకర
స్వాంతనమ్మునీవు సాక్షితత్వమునీవు
సర్వమునువుస్వామి శంభునాధ
భూరికృపవునీవు భోళా శివా నీవె
రక్షవెప్పుడును సురమునివంద్య
గనుమామహాలక్ష్మికనికరముగమము
ఐశ్వర్యదాయినీ అభయమూర్తి
గావుమా కనకాంగి కారుణ్యవర్షిణీ
శాంతతత్వప్రదా సకలశుభద
బ్రోవుమా హరిరాణి భోగప్రదాయినీ
భజియింతుమోయమ్మ భవభయతరి
రావమ్మ వరలక్ష్మి రావమ్మ వడిగాను
దీవించి మాకీయి దివ్యపధము
మహిమ నీదె నమ్మ మహిలోన మహలక్ష్మి
మాయ కూల దోసి మమ్ము నిల్పు
మాహృదయముననిలు మాతప్పులను గాయి
మాధవీరమా సుమనసవంద్య
మురళీధరా మనమోహనా శరణము
మురహరీ భవహరీ మోక్షదాయి
నీలమేఘశ్యామ నిజభక్త బాంధవా
నీరజదళనేత్ర నిగమవంద్య
పరిపూర్ణ కృపజూపు పరమాత్మ తేజమా
ప్రాణేశ్వరా పాహి ప్రణవనాద
భగవద్స్వరూపమా భక్తాభయప్రదా
భవ్యభావసుపూజ్య భక్త పాల
శరణుశేషశయన శాంతమూర్తీ నమో
పాహిధర్మరక్ష పాహివరద
శరణుశుద్దతత్వ శరణుసుదర్శనా
శరణముశిఖిపింఛ శరణుదేవ
గోపకిషోరా సుగుణపరిపోషకా
గోపీజనార్చితా కుణ్డలధర
భక్తహృదయవాస భవపాశమోచకా
యోగసంభవదేవ యాగభోక్త
శ్రీకృష్ణపరమాత్మ శ్రీశుభోపేతా అ
భయవర వితరణా భక్తపాల
అగణిత శుభకరా ఆశ్రిత రక్షకా
అసురాంతకావిభో అమరపూజ్య
దాసదోషవార ధనధాన్యదాయకా
శ్రీహరీనమో విశేష కరుణ
శరణమువనమాలి శాశ్వతానందదా
శరణుశరణుదేవ చక్రధారి
వేణు గోపాలా వివేక సంవర్ధనా
వినతినీకువరదా వేడ్కమీర
కాళీయమర్ధనా కైవల్యవరదాయి
కారుణ్యమందార కమలనయన
ప్రణతిగీతాచార్య ప్రణమామి గోవింద
ప్రియగోప పరిపాల ప్రేమమూర్తి
సామగానానంద సజ్జన రక్షకా
సంసారతారకా సారసాక్ష
శరణుశరణుస్వామి శంఖుచక్రాయుధా
వేడుచుంటితండ్రి వేదవినుత
మాధవాశరణు నమామి రాధాసఖా
గావుమమ్మువేగ గరుడగామి
ప్రణమామిపరమేష్ఠి పార్వతీ శాంకరీ
ప్రణమామి భగవతీ ప్రణతి ప్రణతి
శక్తిప్రదాయినీ సర్వేశ్వరీ ఉమా
సకలాగమనిలయా సన్నుతింతు
కాలకాలేశ్వరీ కామేశ్వరీ నమో
శూళినీదుర్గా ప్రసూన హస్త
కీర్తనా వైభవా క్లేశనాశీ హైమ
కీర్తిప్రకాశినీ క్షేమకారి
అమ్మవమ్మనీవు అఖిలాండనాయకీ
వేడుదుమనసార విజయదుర్గ
భక్తజనులుగొల్చు భార్ఘవీ భైరవీ
భవతిమిరమునీవు బాపుజనని
శరణు శ్రీకృష్ణా ప్రశాంతమూర్తీ నమో
శరణుభక్తత్రాణ శరణు స్వామి
వేణు గోపాలా నివేదనములు తండ్రి
మురళీమనోహరా ముక్తిదాత
రాధికా ప్రియసఖా రాగవిదూరా అ
ఖిలజన బాంధవా క్లేశనాశ
కరుణాంతరంగా సకలశుభగుణధామ
పరమశాంతా నమో పావనాంగ
ఆగమాదివినుత ఆనందదాయకా
సర్వలోకరక్ష సౌమ్యశీల
నీదునామజపము నిత్యము మాకీయి
నీవెరక్షమాకు నియమపాల
వీరాంజనేయా సవినయప్రణతి స్వామి
భక్తపాలక దేవ భావగమ్య
శిరసానమామి త్వం శ్రీరామదూతా స
కలమంగళప్రదా కలవిదారి
సింధూరలేపనా శ్రితమనోల్లాసా అ
ఖండజపవినిమగ్నా నమములు
రామసేవాతత్పరా వ్యాకులాంతకా
ఆనందదాయకా ఆర్తబంధు
శరణు రాక్షసాంత సాధకజనపోష
రామబంటువునువు రక్షనీవు
సర్వలోకపూజ్య స్వామికార్యావ్రతా
పాదపూజనీకు పాపనాశ
చందనార్చితహరీ చంచలనేత్రా స
కలశాస్త్రవినుతా సకలశుభగుణ
శ్రీకృష్ణమూర్తీ విశేషకృపాకరా
వంశీధరా భగవత్స్వరూప
శ్రీవత్సలావిభో శ్రీశేషశయనా అ
పరిమితా భక్తతాపత్రయహర
నవనీతచోరా అనంతదయావరా
దామోదరా నమో ధర్మతేజ
జయ పరంధామ జయజయ సత్యతత్వ
జయ పరమపురుషా నమో శాంత మూర్తి
జయము నంద కిషోరా విజయము నీకు
షోడస కళానిధీ మమ్ము జూడు కృపగ
జయముసద్గురుదేవ జయమునిత్యానంద
జయపరమాద్వైత సత్యసంధ
పరమ తత్వము నేర్పు పరమనిష్టాగ్రేస
కలిమిగూర్చెడిమాదు కల్పతరువు
అవగాహనమునిచ్చి ఆనందమునుపంచి
ఆత్మీయతనుచాటు అగ్రపూజ్య
నిత్యయోగక్రియ నిత్య ఆరోగ్యము
నిత్యము మాకిచ్చు నిత్యదేవ
జయము కైలాస నాధా విజయము తండ్రి
భక్త జనబాంధవా నమో భవవిదూర
ధ్యాన జ్ఞానవిజ్ఞానప్రదా శరణము
శరణు కైవల్య వితరణా శరణు శరణు
శిరసానమామి విశేషకృపావరా
అగణిత శుభగుణా అగ్రపూజ్య
ఓంకార రూపమా ఉజ్వల తేజమా
శ్రీగురు తత్వమా శ్రీప్రదాత
ఆనంద నర్తనా అఖిలాండ నాయకా
అపరిమితకరుణా ఆదిదేవ
కళ్యాణవరధామ కైవల్య వితరణా
శ్రీదయా సింధూర శ్రీనివాస
శ్రీ తిరుమలేశ శ్రీహరీ శేషశయన
భక్త హృద్నివాసా విభో భయవిదూర
సర్వ జనహిత కారకా శాంతమూర్తి
నిత్య మంగళ దాయకా నిర్మలాంగ
గుడిలోన ఉండేటి గురుమూర్తి ప్రతిమను
గురువాక్కు మహిమను గురుతెరుగుము
ధరలోని నడిచేటి దైవమే గురువను
సత్యమున్మరువక సాగవలెయు
భగవంతుడుకలడు భవజలదొక భ్రాంతి
భయమువీడుటయేను భక్తి అసలు
పరమేశ్వరుడరయు ప్రతిజీవియందున
నాత్మదీపికగాను నందముగను
ప్రేమతోడమసలు ప్రీతినొందుహరుడు
గురువు బోధ నిదియె మరచు టేల?
కాస్తమంచితనము కాస్తకరుణగల్గి
మనదగునుమనమిల మమత తోడ
పలుకవలదుపరుషముగను
పలువురితోడంచెలగుముపద్దతి గానున్
పలుకుముమృదువుగనయముగ
కలిగించుముహాయినీవుకల్మష రహితన్
పరమ శాంతా నమో పరమేశ్వ రానమో
రాక్షసాంతకహరా రక్షరక్ష
భుక్తిముక్తిప్రదా భువనేశ్వరా నమో
భవభయ భంజనాభక్తి వశ్య
విశ్వనిర్ణేతా పవిత్రా పరమపితా
పాహిమాం ఈశ్వరా పాపనాశ
కైవల్య వితరణా కైలాసపరివేశ
కాలకాలానమో కాశివాస
నాగభూషణా అనంతకృపావరా
భస్మలేపదేహ భాగ్యదాత
నాది నేను యనుచు నందము వీడేము
ఆదుకొనుముమమ్ము ఆదిదేవ
అపరిమిత కరుణా ఆత్మనికేతనా
ఆనంద యోగినీ ఆర్త త్రాణ
ఈశ్వరీ భార్ఘవీ ఈప్సిత ఫలదాయి
అంబా ఉమాహైమ శంభురాణి
పరమకృపామయీ పరమేశ్వరీపాహి
భవరోగ నాశినీ భావగమ్య
అఖిలాండ నాయకీ ఆదిపరాశక్తి
అన్నపూర్ణా మమ్ము ఆదుకొనుము
దురితనాశివమ్మ దుర్గా అముదవల్లి
సంతసమ్మునీయి శర్వురాణి
సకల శాస్త్ర వినుత సర్వశుభప్రదా
దుష్ట దమన నీవు దోషవార
ఒరులాకలి అనునప్పుడు
పరుషముగనుతిట్టి, కసరి పంపిన వాడున్,
పరమశివపదములువదలి
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్
జీవింపుముసౌఖ్యముగను
భావింపుముపరమశివునిభక్తిగనెపుడున్
సేవింపుముగురుపదములు
గావింపుముమంచిపనులుకరుణగ మనసా
మంచిగమనుమామనసా
కొంచముజూపునువుజాలి కొద్దిగ కరుణన్
సంచీలకొద్దిడబ్బులు
ముంచుకువచ్చేఘడియల ముంపును ఆపా?
శక్తిస్వరూపిణీ శాంకరీ భైరవీ
సర్వేశ్వరీఉమా శరణుజనని
అఖిలాండ నాయకీ అర్ధనారీశ్వరీ
అంబాకృపావల్లి అన్నపూర్ణ
ఆర్తినిబాపేవు ఆనంద మూర్తివై
అద్భుతమ్మువునీవు అమిత కరుణ
భువనేశ్వరీ హైమ భూరికృపవుతల్లి
కాలకాలేశ్వరీ కనకదుర్గ
శైలజా నిను గొల్తును శంభురాణి
త్రిపుర సుందరీ పాహిమాం త్రిదశ వంద్య
ఆద్యవమ్మా అమరపూజ్య అభయవరద
పద్య ప్రాసూనములు నీకు పద్మ నేత్రి
గీతాప్రబోధకా గిరిధరా మాధవా
కేశవా మోహనా క్లేశనాశ
గోకులవర్ధనా గోక్షీర అభిషిక్త
దేవకీ నందనా దివ్యతేజ
వేణుగోపాలకా వేదవిజ్ఞానమా
ద్వారకాధీశుడా వాసుదేవ
బృందావనవిహారి బ్రోవుమా శ్రీకృష్ణ
భక్తపరిత్రాణ భయవిదూర
గోపబాలకాపాహిమాం క్రోధనాశ
కంస మర్ధనా శరణమ్ము కమల నేత్ర
ప్రణతి కరుణామయాహరీ పాండురంగ
గరుడ గామీవిభోసదా గావుమమ్ము
నేరములెంచకజూపుము
కూరిమినలువురికినిలన కూసంతైనన్
సారమిది, ధర్మపధమిది
కారణమువెతుకుటమాని కరుణగ గనుమా
ఏమిచ్చునీజగమనకు
మీమేలుకొనవలెకూరిమినిపంచవలెన్
కామమ్ముయనినకోరుట
ప్రేమయనినయిచ్చుటయిది ప్రేరణ మనకున్
మనసుకవసరము కూరిమి
మనుగడ కొరకు ధరలోన; మానకు ప్రేమన్
అనుమానమేఘమేలా?
మనుమా ప్రేమగను నీవు మంచికు దివ్వై
మనలోని శివుని కొలచిన
మనలోని శివుని తలచిన మనకది మేలున్
మనలోని శివుడి నందరి
మనసుల యందున గనవలె మరువక మనసా
పరమశివుడు కలడంతట
పరమశివుడు కలడు హృదయ ఫలకములందున్
నరులందరికిన్ ఘనమో
పరమాద్వైతమిదియేను పరవశమునకున్
తప్పకుమిచ్చిన మాటల
నెప్పుడు ; మోక్షపధమిదియె నిజముగ ధరలో
గొప్పగ పరమాద్వైతము
నప్పుడు పొందుదుము మనము నందముతోడన్
జయము కృష్ణా హరీ జయ గోప బాలకా
నంద కిషోరా అనంత కరుణ
గోవర్ధనోద్దార గోపకులోత్తమ
యాదవ భూషణా యాగరక్ష
రుక్మిణీ వల్లభా లోక శోక వినాశ
రాధికా ప్రాణేశ రసవిహారి
కాళీయమర్ధనా కంసవిధ్వంసకా
మాధవా శ్రీధామ మందహాస
సప్తగిరీశ్వరాస్వామీతిరుమలేశ
స్వాంతననీవేనుశాంతమూర్తి
సర్వజీవేశ్వరాసర్వరక్షాకరా
ఆప్తబంధువునీవు ఆదిదేవ
నిఖిలలోకేశ్వరానిజభక్తపాలకా
నీరజదళనేత్రనియమపాల
అండనీయుముతండ్రి అఖిలాండనాయకా
ఆపన్నరక్షకా ఆర్త త్రాణ
మోక్షపధమునిమ్ము మురహరీ మోహనా
వేణు గోప బాల వేదవినుత
వరవితరణశీల వనవిహారీవిభో
పద్మనయననాదు పాపనాశ
గావుమా మాయమ్మ కైవల్య దాయినీ
కరుణించుమాతల్లి కనక దుర్గ
పదహారువన్నెలా పరమేశ్వరునిరాణి
చంద్రకళాధరీ శరణు జనని
నీయండ మాకీయి నీరజ దళనేత్రి
మమ్ముర క్షింపుమా మందగమని
పాడిపంటలనిచ్చు పద్మాక్షి నీవమ్మ
పసిడిజిలుగునీది బందమోచ
ఆలకింపుమమ్మ అలివేణిగానీవు
ఆర్తిబాపుమమ్మ అన్నపూర్ణ
శక్తినీయితల్లి శాంకరీ శార్వాణి
ముక్తినీదుపదము మోహనాంగి
వందనములుతల్లి వరదాయినీ ఉమా
సవినయమ్ముగనీకు శర్వురాణి
నీపాదసేవయే నిజమైన భాగ్యము
నిన్నుగొల్చుటమేలు నిర్మలాంగి
లోకేశ్వరీహైమ లోపాలనెంచకూ
భువనేశ్వరీదేవి భూరి కరుణ
శ్రీకరీ శ్రీప్రదా శీఘ్రఫలప్రదా
శార్వనీ శాంభవీ శరణ మమ్మ
శివశివా ఈశ్వరా సేవింతు నీపాద
కమలమ్ములనునేను కాశివాస
నమ్మితినినునేను నందివాహనదేవ
నాగభూషణహరా నమముతండ్రి
పరమేశ్వరా వరా పశుపాశ మోచనా
ఫాలలోచనుడవు పాపనాశ
చంద్రచూఢాధరా సాంబసదాశివా
శరణు శరణు స్వామిసన్నుతాంగ
అంతటావెలసిన ఆత్మతత్వమునీవు
అండనీవునాకు ఆదిదేవ
అష్టసిద్దిదాత అన్నపూర్ణేశ్వరా
లోకశోకనాశ రుగ్మహర్త
సప్తగిరీశుడా శరణు సర్వచరాచర రక్షకా నమో
ప్రాప్తము జేయుమా సకల ప్రాణుల కున్శుభ సంపదల్సదా
ఆప్తుడవందురందరును ఆద్యుడవౌ పర మాత్మరూపుడా
దీప్తి నొసంగుమాకిలన దివ్యముగాతిరు వేంక టేశుడా
మాఘ స్నానము రామనామము మంచితన్నముధర్మమౌ
రాఘవుండిల సార్వభౌముడురాముడున్మనదేవుడున్
మేఘవర్ణశుభాంగుడున్ అనిమేషుడున్సురపూజ్యుడున్
ఆ ఘనుండవతార శ్రేష్ఠుడు అండగానిలుచున్సదా
కలడు శివుడు కలడంతట
వలదపనమ్మకము, చింత వలదే నాడున్;
కలుగును సకల శుభమ్ములు
యిలలో మనిషికి నిరతము ఈశుని కృపచే
పరమేశ్వరాపరా పాపనాశకహరా
భక్తసులభుడవు భవవిదారి
నీలకంఠాపాహి నిర్మలాంగాపాహి
గంగాధరాపాహి గరళకంఠ
కైవల్యదాయకా కైలాసనాధుడా
అభయప్రదాతవై అండనీయి
సాంబసదాశివాశక్తిసంద్రమునీవు
శరణుశరణుస్వామి సకలశుభద
దివ్యతేజమునువుదేవదేవ
సత్యతత్వమునువుసత్వస్వరూపమా
సాంబసదాశివా సకలలోకేశ్వరా
జీవరక్షాకరా శేషభూష
దేవదేవశ్వరా దివ్యతేజోరూప
భస్మలేపా విభో భవవిదూర
త్రిపురాంతకా హరా త్రినయనా పాహిమాం
త్రైలోక వందితా ధవళవర్ణ
కళ్యాణకారకా కైలాసనాధా స
కల ధర్మ సంస్థాపకా శరణము
పార్వతీపతీ అపరిమితమౌ కృపా
సర్వలోకరక్ష శక్తిరూప
భుక్తి ముక్తి భక్తి భూరిగానొసగేటి
పరమపావనునికి ప్రణతులివియె
శ్రీరామజయరామ సీతామనోహరా
శ్రీరామరఘురామ శ్రీప్రదాత
శ్రీరామగుణధామ శ్రీశుభంకర శ్యామ
శ్రీరామరణభీమ శేషశయన
కళ్యాణకారకా కరుణాదయావర్ష
సకలశుభప్రదా శాంతమూర్తి
ఆంజనేయార్చితా ఆత్మప్రదీపకా
పరమాత్మరూపమా పరమసత్య
అన్నిటావెలసిన ఆదినారాయణా
అండనీవుతండ్రి అవనిలోన
ఆదుకొనుముమమ్ము ఆపన్న రక్షకా
శరణు శరణు స్వామి సన్నుతాంగ
సేయుము యోగా నిత్యము
వేయుము పదములు పరముకు విధిగా పూజన్
ఖాయముగ పంచు మంచిని
కాయమునకు మేలు గూర్చు కారణములివే
ఆగమాదివినుతా అఖిలలోకేశ్వరా
భవహరా శివవరా భక్తపాల
ఆర్తపరాయణా అభయవరదకరా
ఆశ్రితవత్సలా అగణితగుణ
విశ్వకర్తాఘనా విశ్వేశ్వరా స్వామి
విశ్వనాథా శుభా విశ్వరూప
కాలకాలాహరా కైలాసవాసా ని
రంతరా పాహిమాం రాజరాజ
సామగానలోలా నమో సాంబదేవ
ఫాల నేత్రా త్రయంబకా పాహిపాహి
దేవదేవా నమో నమో దివ్యతేజ
శరణము శశాంక మోళి ఈశాన దేవ
అరుణాచలేశ్వరా అఖిలాండ నాయకా
ఆప్తబందో విభో ఆదిదేవ
ఆద్యంతరహితా నిరామయా త్రినయనా
ఆర్తజనార్దనా ఆదుకొనుము
కేదార ఈశ్వరా కీర్తిప్రదాశివా
నాదాత్మకాప్రభో నందివాహ
గౌరీప్రియాసఖా కాశీపతీదేవ
భక్తహృదయవాస భావగమ్య
త్యాగ రాజేశ బ్రోవుమో తాపసేంద్ర
నాగ భూషణా గావుమా నన్ను అభవ
రాగ ద్వేషాది రహితా సురముని వంద్య
ఆగమ వినుతా అఖిలేశ అగ్రపూజ్య
శ్రీకరాశశిధరా శివశివా శంకరా
కరుణామయాహరా గరళకంఠ
సాంబశివాదేవ సకలజీవేశ్వరా
సార్వభౌమాస్వామి సర్వపూజ్య
పరమశివాపాహి పరమేశ్వరాపాహి
తత్వప్రియాపాహి దైత్యదమన
త్రిపురాంతకాత్రాహి త్రిగుణాంతకాత్రాహి
భక్తవశ్యాత్రాహి భక్తపాల
నిఖిలలోకరక్షాకరా నిర్వికల్ప
ప్రార్ధనలునీకు ఈశ్వరా ప్రాణనాధ
నిర్మలాంగా త్రయంబకా నిత్య సేవ్య
తాపసవరదాశరణమ్ము తాపహారి
జయమంగళముశివాజయమంగళముహరా
జయమంగళముదేవజయముజయము
శరణమ్ముసర్వేశశరణమ్ముజగదీశ
శరణమ్ముపశుపతీశరణుశరణు
కరుణించుమువిభోసకలచరాచరవాస
సర్వశక్తికరావిషయవిదూర
పంచాననాఘనాపరమపవిత్రా అ
పర్ణాకళత్రాప్రపంచపాల
పరమశుభఫలదాతవుపరమపురుష
నన్నుగావుమునిత్యమునాదుదేవ
పారదోలుమునాదైన్యపంకిలమును
దేవదేవా శివాహరాదీననాధ
పశుపాశమోచనాపాపవినాశనా
పన్నగభూషణాప్రమధనాధ
పార్వతీరమణా అపరిమితాపరమేశ
పాహిశంభోశివాపరమకరుణ
పతితపావనపాదఫాలలోచనదేవ
పరిపూర్ణఫలదాతపంచవక్త్ర
పరమకృపాకరా ప్రకటితభవహరా
పరశివ శంకరా ప్రణతినీకు
మోకరిల్లుదునుప్రభోమోహనాశ
మోదమీయితండ్రిపరమ ముక్తిదాత
ఆదుకొనుముసదాశివాఆదిదేవ
అర్ధనారీశ్వరాభవా అగ్రపూజ్య
శరణమ్ము శాంభవీ శరణమ్ము సావిత్రి
శరణమ్ము జగధాత్రి శరణు శరణు
వినతికాత్యాయణీవినుముతల్లీగౌరి
విధివిధానమునీదివేదవల్లి
వందనములుతల్లి వరవేల్పు నీవమ్మ
భక్తజ నులపాలి భయవిదూరి
మోక్షప్రదాయినీమోహనాశీ ఉమా
భైరవీ భార్ఘవీ భద్రకాళి
అర్ధనారీశ్వరీశివా ఆదుకొనుము
ఆత్మశక్తిగానిల్వడు అంబనాకు
కార్యదక్షతనీయుమాగాంచినన్ను
సర్వశుభఫలదాయినీసర్వరక్ష
పన్నగభూషణాపశుపతీభవహరా
భక్తపోషకశివాభస్మలేప
ఈశ్వరాశంకరా ఈప్సితార్ధప్రదా
శరణుశంభోనీవెశరణుతండ్రి
సర్వలోకేశ్వరాసాంబశివాపరా
పర్వతీనాధుడాపాపవనాశ
ఓంకారరూపమౌఉగ్రతేజమునీది
కార్తీకదీపమౌకరుణనీవు
నీలకంధరానిఖిలేశనిన్నుగొల్తు
ఫాలలోచనాశివశివాపాహిపాహి
తాపసవరదా త్రినయనా త్రాహిత్రాహి
గరళకంఠాఉమాపతీకరముజోడ్తు
కరుణించుమాదేవికైవల్యదాయినీ
మమ్మేలుమాతల్లిమహిమతోడ
కారణంబేనీవుకార్యమేనీవమ్మ
కర్తవూనీవేనుకనకదుర్గ
కనికరించుముతల్లికల్మషనాశినీ
పుణ్యప్రదాయినీబ్రోవుమమ్మ
లావణ్యగుణసీమలలితకళాసేవ్య
ఆగమపూజితా అండనీయి
సత్యపధమునీవుశాంభవీపార్వతీ
తత్వసారమీవుదక్షపుత్రి
భక్తితత్పరతలుభగవతీనీకృపే
శరణమీయితల్లిశర్వురాణి
శ్రీమహారాజ్ఞ్నితాశ్రీయంత్రముననిల్చి
శూలినీదుర్గగాశుభములిచ్చు
కైలాసగిరిపైనకైవల్యదాయినీ
నటరాజునీడయైనటనమాడు
చంద్రశేఖరురాణిజైత్రయాత్రలుసేయు
భక్తజనాళికైభైరవిగను
నవతత్వములతోడనళినదళాక్షియై
పరిఢరిల్లినుతల్లిపార్వతిగను
జయమునీకుజననిజయమువిజయదుర్గ
అభయమొసగుమమ్మ అంబనీవు
శరణమమ్మశరణు శ్యామలా శరణము
శక్తినీయితల్లి శాంతితోడ
శ్రీరామ నామమ్ము శ్రితపారిజాతమ్ము
శ్రీరామ ధ్యానమ్ము సిరులుగూర్చు
శ్రీరామ చరితమ్ము శీలమ్ము నిర్మించు
శ్రీరామ చరణమే శ్రేయమిలన
కోదండ రామయ్య కోర్కెలు దీర్చేను
సీతమ్మ తల్లితా సేదదీర్చు
లక్ష్మణుడుమనను లక్ష్యమ్ము జేర్చేను
ఆంజనేయుని కృపేఅండమనకు
శ్రీరఘువరునికినమము శిరసువంచి
జానకీదేవికియెసుమాంజలులు నావి
లక్ష్మణునికినానిరతులు లలితముగను
ఆంజనేయునికివినతి ఆర్తితోడ
శరణమ్ముశాంభవీశరణమ్ముపార్వతీ
శరణమ్ముగిరిపుత్రిశరణుశరణు
వినతికాత్యాయనీవినుముతల్లీగౌరి
విధివిధానమునీదివేదవల్లి
వందనములుతల్లివరవేల్పునీవమ్మ
భక్తజనులపాలిభవవిదూరి
మోక్షప్రదాయినీమోహనాశీఉమా
భైరవీభార్ఘవీభద్రకాళి
అర్ధనారీశ్వరీకళా ఆండనీవు
ఆత్మశక్తిప్రసాదించు అంబనాకు
కార్యదక్షతనీయుమాగాంచినన్ను
సర్వశుభఫలవితరణీసర్వరక్ష
చంద్రుడువెన్నెలచిలుకగ
మంద్రముగసగరపుటలలు ,మల్లెల వలపై
చింద్రముసేసెనుచింతలు
సంద్రపుతెమ్మెరలుతెచ్చెసంతోషమ్మున్
Comments
Post a Comment