nithyadeva5
కాంతిని పంచినిత్యమిల కర్మల త్రుంచెడి ఈశ్వరా నమో శాంతినిపెంచి కాయమును సాత్విక ధర్మమునందునిల్పుమా భ్రాంతుల పారదోలు తలి బైరవిపాదములండనీయుమా అంతముసేయుమా మనిషి అంతరమందునమాయ శాంభవా పుస్తకధారిణీ ప్రణతి పుష్పములవ్వగ పద్యమాలికల్ మస్తకమున్ హృదిన్ కదుపు మానస తంత్రివి నీవుతల్లి, నా హస్తము వ్రాయగా మధుర హాసము లంకురిపింపజేయుమా వాస్తవమున్నువేతెలుపువాక్కుగమారితరింపజేయుచూ జ్ఞానముపెంచుచూ మనక ఖండితశిక్షణ గూర్చుతానిలన్ ధ్యానమునేర్పుచూమననిదానముగూర్చిపరిశ్రమవ్వుతా దానముగోరులోనగలదైన్యము దాగిన దుఖములంగదా ఆనతివేడెదన్ అమిత ఆదరమూర్తినినాదుదైవమున్ పరమశివుడునాదుగురువు పరమాద్వైతమ్మునిచ్చుపరశంకరుడున్ పరమశివోహం యనునా గురువాక్కిలనిడునుముక్తిగురిదప్పక్కన్ పరమశివుడణువణున తా నరయునుయను నిజమునమ్మి నామది తానే పరవశమొంది తరించెను వరమిదిగురుకృపయిది యికవగపునిలవదున్ భక్తవశంకరా నమము భావవినిర్ణయహేతువా నమో ముక్తి ప్రసాదముల్సరళ మోహవినాశకపర్వమవ్వగా రక్తిని కల్గజేయి మది రాజిలసత్యము గోచరింపుమా యుక్తినిమేల్గొపించినువు యోగము ప్రాప్తము సేయుమా ప్రభూ యోగమిదియేనుమనసా యోగియు యాగముయు తానె యోగేశ్వరుడున్ భోగియు భోగము ...