nitya deva-- 3



కలలోకేశ్వరీ ర్వశుభంకరీ
ర్వేశ్వరీమాదు శంభురాణి
నకదుర్గవుమాత కామేశ్వరీఉమా
రుణతోమమ్మేలుమలనేత్రి
లితాపరాశక్తి లావణ్యవరగాత్రి
లాలిత్యమేనీవు లననీవు
శుభములనొసగేటి శోభనాంగివితల్లి
శూలపాణివినీవుసురసుపూజ్య


ద్రకాళివమ్మ బంధవిమోచనీ
ముక్తినొసగునాకుముదముతోడ
నీరజాక్షివమ్మనిన్నునమ్మితితల్లి
యగగాంచుమమ్మల్లిఎపుడు


తీరికదొరికిన, దానిని

జారవిడవకుమనసా అజాగురుకుతలో

కోరికలవలన్వడకుము 

ఆరంగనిపదము మ్రొక్కు ఆనందముగన్ 

మూలాధారమువిఘ్ననాయకునిఆమోదమ్ముసేయుండిలన్
కాలాతీతుడుకష్ఠనాశకుడు శ్రీకైవల్యనాధుండు పూ
మాలాలంకృతమూర్తి సంపదలుసామాన్యమ్ముభక్తాళికిన్
లంబోదరుకీరనల్సకల సౌభాగ్యమ్ములిచ్చున్సదా


అంబాదయామయీ ఆనంద సాగరీ

కరుణాకృపాబ్దివి కమలనేత్రి

విశ్వజననినీవు విశ్వంభరవునీవు

సర్వేశ్వరీనీవె శరణు మాత

శాంభవీభార్ఘవీ శంభుప్రియాగౌరి

దివ్యకళాసేవ్యదేవదేవి

మంగళకారిణీమమపుణ్యసంప్రాప్త

సర్వార్ధసాధికా శర్వురాణి


సర్వలోకభక్తశక్తిసంవర్ధనీ

సకలహితముగూర్చు శాంకరినువు

నీదుచరణములను నిత్యము సేవింతు

నిన్నునమ్మియుంటినీరజాక్షి


విఘ్నరాజానమో విఘ్నహర్తానమో

మంగళకర్తానమామి స్వామి

దేహత్ర యాతీత దివ్యతేజానమో
సంకట నాశనా రణు శరణు
లంబోదరానమోశంభుసుతానమో
రమదయాకరా పాహిపాహి
పార్వతీనందనాతితపావనపదా
శ్రీకరాగణపతీ శ్రీప్రదాత


శ్రీగణాధిపా విశేషశక్తిప్రదా
కలశుభములొసగు శాంతమూర్తి
మోదకప్రియానమో నమోమూషిక
వాహనా నమామిరదమూర్తి





కాసులు రూకలు నకమ్ము కానుకల్

కానబడుసిరులు క్షణికమిలన
నిషిమనసులోని మత మానవతాది
ద్గుణ సంపదల్ త్యమిలన
న్యాస మొక వైపు త్యపధమునందు
సంసారమొకవైపు సాధనందు
ర్మముదప్పక యనువీడకనుండి
యెడల మార్గమ్ము నాకమగును

గురుపదమునుపొంది గురినిగల్గిధరన
త్యముదశలోన సాగవలెను
డుదిడుకులుకావు టమిసూచన
ముందుకునడువదగుముక్తిదిశన


అగ్నికి రూపమై మనను ఆగ్రహ మెప్పుడు గాల్చివేయు ఈ
అగ్నిని చేతబట్టిపర మార్ధముదూరముసేయరాదిలన్ 
అగ్నికి రూపమౌ తపమునార్యులు లెస్సగ నేర్పినారుగా 
అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్



కుటిల నీతి రగిలి కోరికలు కదిలి
అగ్నివోలె మనను ఆరగించు
తగుల బడుక గాచు దయగ తపోఅగ్ని:
అగ్ని నార్పవచ్చు నగ్నితోడ


ఉన్నరుగాస్వామి ఉన్నతోత్తమముగా
కైలాసగిరిపైన కరుణ తోడ
హరుడుతానేవచ్చె హరియింపనజ్ఞాన
తిమిరమ్మునిత్యజ్యోతిగనుధరకు
రండోయివెడలేమురయ్యనుచునువేగ
దర్శనమ్ముమననుదరికిజేర్చు
నిత్యనిత్యేశునినిత్యసత్సంగమ్ము
మంచిద్రోవనుచాటుమంత్రమిలన

వేయిమాటలేల వేదవేదాంగమౌ
నిగమ సత్య మిలన నిత్యమిలన
విడచి యితర వ్యర్ధ వితరణలిలలోన
కొలుచుముగురుపదముకొరతలేక


కల్యాణసుందరా కైవల్యకారకా
విశ్వేశ్వరాహరా విశ్వరక్ష
సర్వశుభకరుడా సర్వేశ్వరునిగాను
నీదుదర్శనముల నీయిమాకు
లోకరక్షకుడివి లోభనాశకుడివి
నీకు మ్రొక్కెదనేను నీలకంఠ
దుక్కాంతకావిభో దురితనివారకా
నీరక్షమాకీయి నెమ్మితోడ

ఆర్త పోషకుడివి ఆదిదేవా ప్రభో
అంబ తోడ నీవు ఆదు కొనుము
అర్చనలనుసేతు ఆనంద దాయకా
అండనీయిమాకు అగ్రగణ్య

శ్యామసుందరహరీ క్షేమప్రదాయకా
శ్రీరంజనాస్వామిశ్రీనికేత
వైకుంఠపురవాసవరదమూర్తీవిభో
లక్ష్మీపతీసకలశుభవర్ష
శంఖుచక్రధరుడాసత్యనారాయణా
సాదుపూజితపాదశాంతరూప
సామగానప్రియసాధనానందకా
శ్రీకరా అభయదా శేషశయన

పాపనాశకుడివి పతితపావనుడివి
పరమశుభకరుడివి పద్మ నాభ
పద్యపుష్పములివి పరమపవిత్రుడా
పాహి పరమ పూజ్య పాహిపాహి 

ఆశలనంతముధరలో
లేశముగామొదలగునవిలేకిగమారున్
నాశనముగాకమునుపే
పాశములను ద్రుంచుకొనుము పలుపలు విధమున్


శివశివాహరహరాసేవింతునీపాద
పంకజములనేనుపాశహస్త
సర్వలోకేశ్వరాసకలభూతాధిపా
నమములునీకోయినాగభూష
ఫాలనేత్రావరాపశుపతీజయములు
భస్మధూలితదేహభయవిదూర
పార్వతీవల్లభాపశుపాశమోచనా
పాలించుమోఈశపతితమోచ



పరమశుభకరునికిపరమాత్మకునమము
పరమశివవిభునకుప్రణతులివియె
అండనీవుస్వామి అర్ధనారీశ్వరా
ఆదుకొనుమునీవుఆర్తరక్ష

నీలకంఠాయ అనిమిషాయహరహరా
మృత్యుంజయాయ అమృతకరాయ
అతులితగుణసీమ అగణితవరదాత
శ్రీఉమావల్లభా శ్రితజనేశ
ఆనందనటరాజ అభయవరదమూర్తి
పరమేశ్వరా ప్రభోపాపనాశ
ఆపన్నరక్షాయ ఆధారభూతాయ
నన్నుపాలించుమానందివాహ

శాంభవీసఖునివి సాధుసంసేవ్యుడా
శ్రద్ధతోడగొల్తుసరళహృదయ
సామగానలోల సాధనాశోధకా
సాక్షిభూతమునువుసౌమ్యశీల

వసుదేవ పుత్రుడా వరవేల్పు నీవయ్య
కంసచాణూరాంత కరముజోడ్తు
దేవకీ నందనా దివ్యపుష్పార్చితా
హారనూపురధరా అగ్రపూజ్య
రత్నకంకణహస్త రాకేందు తేజసా
రాధామనోహరా రాసలోల
పద్మనేత్రాహరీ పాదనమము స్వామి
యాదవ భూషణా ఆదుకొనుము

రుక్మిణీపతీనిరుపమానకూరిమీ
శంఖుచక్రదేవ సారసాక్ష
గోపజనులపాలి కొంగుబంగారమా
శరణువేడుచుంటిసన్నుతాంగ



భస్మవిలేపనా భవభయహారీ అ
భయమునొసంగుమా భక్తపాల
ఆపదుద్దారకా ఆపన్న రక్షకా
అండనీవేస్వామి ఆప్తబందొ
సాదుకృపాలా సు సంపన్నఫలదాయి
సౌశీల్యసౌరభా శంభునాధ
శ్రీఉమేశా శివా శ్రేయోభి వర్ధనా
శేషభూషణహరా శ్రీప్రదాత

నీకరుణనుమాకు నిండుగానీయుమా
నీలకంఠదేవనిర్మలాంగ
నీవుగాకనెవెరు నిజముగా కాపాడు
నీవెదిక్కునాకు నిత్యపూజ్య

శ్రీరామాశరణువిభో
శ్రీరంజనునికివినతులు శ్రీరమణీశా
శ్రీరాఘవాప్రణామము
క్రూరాంతాబాపునువ్వుఘోరకలియిలన్

నిత్యదేవాయ వినిమిళిత నేత్రాయ
నిజభక్తపోషాయ నిర్మలాయ
శ్రీఉమా తిలకాయ శ్రితపారిజాతాయ
గంగాధరాయ నిమనుతాయ
గ్నిహోత్రాయ అగ్రాయపశుపతాయ
జ్వాలాగ్నిహస్తాయవందితాయ
తాండవ నృత్యాయ తాప హరాయ ఆ
నందప్రదా యాయ నాయకాయ

















నిత్యదేవాయ వినిమిళిత నేత్రాయ
నిజభక్తపోషాయ నిర్మలాయ
శ్రీఉమా తిలకాయ శ్రితపారిజాతాయ
గంగాధరాయ నిగమనుతాయ
ఆగ్నిహోత్రాయ అగ్రాయపశుపతాయ
జ్వాలాగ్నిహస్తాయవందితాయ
తాండవ నృత్యాయ తాప హరాయ ఆ
నందప్రదాయాయ నాయకాయ


శూల టంక పాశ శోకనాశా ఈశ
మమ్ము బ్రోవు మయ్యమంగళాంగ
క్లేశదోషవార కీర్తిసంవర్ధనా
సర్వలోకనాధ శక్తిరూప

శక్తిని సంధించి సాధనే తోడుగా
మార్పుపొందగవచ్చుమంచిదిశగ
బుద్ధితెలియజేయు పోగొట్టలేనట్టి
విషయవాస్తవముల న్విధిగమనకు
స్వప్నమీజీవిక సర్వముమార్చినా 
యుక్తి ఈ వచనము యోగులార
కూసంత కూరిమి కొండంత దేవుని
కొరకిదియేగదాగొప్పభక్తి

భక్తియుక్తిశక్తి బాగుగాకలగల్పి
బుద్ధితోడుగానుభువనమందు
ముక్తి నొందవచ్చ్గు, మోక్షసూక్షమిదియె
మనుదుమిటులమనము మనుజులార 


Love heals 5 types of restlessness
1. Based on circumstances
2. Physical
3. Mental
4. Emotional
5. Spiritual

From living enlightenment book Gospel of Bhagawan Sri Nithyananda Paramashivam



ప్రేమయే తొలగించు ప్రేరణే తానయ్యి
వ్యాకులతను వేగ వరముగాను
నిశ్చలమ్మగుమది నిశ్చయమ్ముగతాను
చవిజూపికూరిమి చల్లగాను
క్లిష్థసమయమందు లేసమంతచెలిమి
దివ్యతేజమ్ముగా దిశనుమార్చు
మనసుచల్లబడును మమతనేపంచగా
హృదయభారముదీర్చు త్రోవ ప్రేమ


దేహబాధదీర్చ దివ్యౌషధము ప్రేమ
నిన్నునీకుజూపు నిజము ప్రేమ
ఖర్చుయుండునేమి కరుణగాతలబోవ
మోక్షతత్వమిదియెముక్తి యిదియె


నాదునాయకాకరుణనునాకునీయి
వేదవిదితాతలతునిన్నువిధిగరామ
సర్వరంజనానను బ్రోవు శాంతరూప
నాదునందమామరువకునన్నురామ

చిన్నిమువ్వలుతాముచిత్తమేదోచేను
మంజీరరవముతోమంజులముగ
జగములనాడించుజానకీనాధుండు
పసిబాలుడైతానుపదముకదుప
దశరధుండుమురిసెదాశరధిపెరుగ
ముద్దుమురిపెములమూటగాను
కౌసల్యతరియించెగాంచిరామునిలీల
మాతృత్వపుమధురిమలనడుమన

రామచంద్రునిశోభలురమ్యమిలన
నీలమేఘశ్యామునిలీలనిత్యమిలన
శ్రీరఘువరునిగాధలుశ్రీకరములు
ఆలకించినభాగ్యమేఅందుమనకు


గోవిందనామమ్ముకోటిజన్మలపుణ్య
ఫలమునొసగుముక్తిపధమునందు
గోవిందనామమ్ముగోటితోపోగొట్టు
కష్టనష్టములన్నిఖండితముగ
గోవిందనామమ్ముగూర్చుయశోతేజ
బలవికాసమ్మునుభళిగతాను
గోవిందనామమ్ముగోవిందనామమ్ము
తరియింపజేయునుతధ్యముగను

భవదరినిజేరుటకిలనభవ్యముగను
ఎన్నిపదములుగావలెనెవరికైన
ఒక్కవేంకటేశునినామముసరిబోవు
యిదియెసత్యమిలనసదా ఎన్నటికిని


శ్రీరామనామస్మరణము
శ్రీరామునిపాదసేవ శ్రీకరమిలలో
శ్రీరామకధామృతమే
శ్రీరంజనముమనుజునికిశ్రేయంబదియే

సీతమ్మతల్లికివనతి
సీతారామునికినమము శ్రేయోదాతా
పాతకములబాపువిభో
నీతిపధమ్ముననడుపుమునీరజనాభా 

పరమశివాశుభా పరమేశ్వరాహరా
గంగాధరాభవా గరళకంఠ
పాహిమాంగౌరీశ పాలించుమావిభో
పశుపతీభవభక్త పాపనాశ
గావుమోజగదీశ గజముఖానుగ్రహా
పరమపావనమూర్తి పరమశాంతి
నన్నుబ్రోవుముతండ్రి నాగభూషణధారి
అంబాపతీసదా ఆదరముగ


ఆదిదేవాదయాకరా ఆనతీయి
అగ్రపూజ్యామొరాలించి అండనీయి
నర్తనాగ్రేసరాబ్రోవునన్ను స్వామి
అర్ధనారీశ్వరాప్రభోఆదుకొనుము



శ్రీకరా శుభకరా శ్రీవరదానమో
విఘ్నవినాయకా వినతులయ్య
పార్వతీనందనా పరిపరి విధములా
నిన్నుసేవింతుమోనిత్యదేవ
ప్రధమపూజలనందు ప్రార్ధనాసారమా
నీరజదళనేత్రనిగమవినుత
మూషికవాహనామోదమ్ముమాకీయి
నాగోపవీతా అనంతకరుణ

ప్రమధనాయకాప్రణతినీపాదములకు
కార్తికేయునిసోదరాకరముజోడ్తు
వరశివసుతాకరివదనావందనములు
విజయగణపతీ అందుమా వినతినాది

Love is the root of all
religion
Love brings great
courage
Love is really a
success of the
heart that every
individual should
experience

అందించుకూరిమి ఆదరమ్ముగనీవు
వెతికినతర్కమువెలితియేను
షరతులేనిప్రేమసత్యముచూపేను
సత్తువకలిగించుసారమిదియె
నిజమైన ప్రేమయేనిగమాదిసూక్ష్మము
సర్వధర్మమ్ములసత్వబోధ
స్వార్ధరహితచిత్తసాధనేసాధన
మానవతేమూలమంత్రమిలన

నెయ్యమెపుడుసేయినెపములనెంచక
చెలిమితోడమనషిసేదదీరు
ప్రేమకన్నమిన్న ప్రేరణే లేదుగా
కూరిమిలనపంచుకొరతలేక


పరమశివుడు స్వామిపరులెవ్వరుతనకు
అందరూతనవారె అవనిలోన
పరమశివుడు స్వామివరములువితరించు
కరుణగాగాంచేటికల్పతరువు
పరమశివుడు స్వామిపరమశక్తినిగూడి
భక్తులగాచేటిభవతరియిల
పరమశివుడు స్వామిపావనచరితుండు
పంచకోశాధిపప్రణవమూర్తి

సుగుణసుందరవరగాత్రసుమనసుండు
సకలశక్తివరప్రదశంభుడిలన
సర్వసుఖసంపదలనిచ్చుశంకరుండు
సన్నిధియెపెన్నిధిమనకుసత్యముగను

చాతుర తేతనై నిలచి చంద్రునిదాల్చెనునీలకంఠుడై
నాతికి నర్ధభాగమిడి నాట్యము లాస్యము సేయునీశుడై
తురతాంతకుండిలన ద్యుడువైద్యుడు, అట్టి అంధకా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్

వులకుచేదుగాతగులుకాదిదిసత్యమునూరుశాతమున్
చెవులకువిందుగాదగనిచీదరగొల్పెడిపిచ్చివాక్యముల్
రణసేయుమీ! యిటుల స్వప్నమునందునగూడగాదిలన్
ప్రరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్

చిన్నెలుచూడుమీధరనచీకటి ప్రాకునుయర్ధభాగమున్
మిన్నునచంద్రుడాదిశనమిత్రునితేజముకారణమ్ముగా
తెన్నులు చంద్రకాంతికిల తెచ్చును తీరుగ సూర్యుడేసదా
వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్

ఆరామముధర్మమునకు
నీరాజనమొందెనతనినీతినియమముల్
కారణములేనివాక్యము: 
శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్

కాలాంతమ్ముసమీపమైనతలపే; కారుణ్యధాముండు మా
శ్రీక్ష్మీపతి; రాముడున్; నిరతి, నిష్ఠేప్రాణమైమెట్టె గా
లోచించినపాపమే అగుసుమీర్ధమ్ములేదిందుగా
స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్
 
అజ్ఞాన మోచనా ఆనందకీర్తనా
ఆదుకొనెడివిభో ఆప్తబంధొ
తత్వమునేర్పేవు దారినిజూపేవు
అద్దరి జేర్చెవు ఆదరముగ
శరణాగతినిదెల్పు సాధనా గమ్యమా
అద్వైతమునుగూర్చుఆదిదేవ
ఆధ్యాత్మికతచాటు అద్భుతచరితుడా
శివభక్తితత్పరాశీఘ్రఫలద


నిన్నునమ్మువారినిజపారిజాతమా
సర్వసాక్షిభూతసర్వశ్రేష్ఠ
పరమగురువుగానుపరమసత్యముదెల్పి
పరమపదముజేర్చుపరమపూజ్య


కైలాసనాథుడు కైవల్యమొసగంగ
కారుణ్యసింధువై కధము త్రొక్కె
నవనాగరికితకు నాందిని పలికేను
కొత్తచరిత్రకు కొలువుతాను
సాధకులకు స్వామి సర్వేశ్వరుండిల
హిందువులకుసర్వహితముతాను 
మనుజులకునువచ్చెమంచిదినమ్ములు
శివుడుతాతెచ్చెనుశివపురమ్ము

భువికిశివుడుయిచ్చెభూరిగాకలిమిని
కలతలన్నిబోయికాంతినిండు
కష్టములనుతోలుకైలాసదేశము
సర్వశుభకరముగశాంతిపంచు



ఆనందవర్షిణీఅమితకృపాప్ద్బివి
ఆత్మానుసంధానఆదిశక్తి
సాధనాగమ్యమౌశార్వాణివిఉమవు
శాంభవీభైరవీశరణుజనని
అంబాదయాబ్దివిఆర్తినిబాపేవు
పార్వతీమాంపాహిపాహితల్లి
శాంకరీభార్గవీసర్వేశ్వరివినీవు
అభయంకరీనీదు అండనీయి

ఆదుకొనుమమ్మజగదంబ అన్నిటనువు
పాహియంటినిపరమేష్ఠిపాపనాశి
భువనములనుగాచేవు అద్భుతముగాను
నన్ను బ్రోవుమమ్మసదా అనన్యకరుణ



నిత్యవేంకటపతీనిత్యేశ్వరాస్వామి
కేశవార్ధవుతండ్రిక్లేశనాశ
నీపాదములుగొల్తునిత్యనాదప్రియా
నాదుపాపవిమోచనారమేశ
నిత్యవందితుడవునీరజాక్షాహరీ
నిన్నునమ్మితివిభోనిత్యదేవ
పద్మనాభానమోపంకజాక్షానమో
పారిజాతానమో పతితమోచ 

వేంకటేశ్వరునికి వేవేల ప్రణతులు
నిత్యనిర్మలునికి నియతులివియె
శ్రీపతికి నమములు శ్రీకరానమములు
శిరసు వంచి నమము శేషతల్ప


జయ కృష్ణగోపాల జయగోకులోత్తమా
జయము గోవిందావిజయము తండ్రి
జయ ముకుందాహరీ జయ మాధవా ప్రభో
జయము కారుణ్యమా జయము జయము
జయదయాసింధువా జయ కృష్ణ మురహరీ
జయ మదనాంతకా జయమురారి
జయము లక్ష్మీకాంత జయరుక్మిణీ పతీ
జయ మధు సూదనా జయము కృష్ణ


శరణు శ్రీహరీ విషయవాంచమోచనా
శరణు వరదమూర్తి శరణు శ్రీద
శరణు రాక్షసాంత శరణు క్లేశవిదూర
శరణు మోక్షదాత శరణు శరణు


అమ్మాత్రయంబికా ఆనంద ఈశ్వరీ
అఖిలాండనాయకీఅంబుజాక్షి
నిత్యేశ్వరీ నీవు నిండుగా నవ్వేవు
నవరాగమాలికా నయము మీర
కావ్య నాయికవీవు కరుణాంతరంగమా
కాదంబరీదేవి కమలనేత్రి
నీఅండ మాకీయి నిత్యము శివసఖీ
నీపాదములకడనీడనీయి

లసించకనను వధరింపుముతల్లి
దరించుమునువు మ్మరీతి
వనిలోననీవు మృతవల్లివితల్లి
ణువణువునయున్నదిశక్తి


Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5