nityadeva

song 54 

శిరసానమామి ఆశీర్వదప్రియశివా

మనసానమామి ఉమామహేశ

ఆనందకళ్యాణ అద్భుతానుగ్రహా

సౌమ్యసౌశీల్య అసాధ్యసాధ్య

భువనేశనిఖిలేశ భూరికృపాశీల

నన్ను బ్రోవుముతండ్రి నాగహార

నిత్యనిత్యేశుడానిర్మలాంగాహరా

నిలుచుమామదిలోననిత్యమునువు


సకలశుభములొసగుసాంబశివాశుభా

శాంతినీయితండ్రిసారసాక్ష

సుగుణసంపదలనుసకలవేళలయందు

నీవునాకునీయినిత్యదేవ

song 55

మాధవామోహనా దనాంతకా హరీ
ధుసూధనా వరా మ్ము బ్రోవు
మురళీమనోహరాముక్తిమార్గమునీవు
మ్మేలుమోనిత్యమంగళాంగ
రణీధరావిభోర్మప్రకాశకా
దురితనివారకాదుష్ఠదమన
దామోదరాదరిద్రాంతకాశ్రీకృష్ణ
యనీయితండ్రిహృయములోన


వేణుగానలోల వేదవైఙ్ఞానికా
వినుతిజేసెదనిని విధిగనెపుడు
వందనములుదేవ వాసుదేవాఘనా
వేడుచుంటినిన్ను వేగరమ్ము

song 56

శ్రీరామనామమ్ము శ్రీపదమ్ముమనసా

మరువకమదినీవుమాయలోన

పరుగులిడుదువుగా పరవశమ్ముగనీవు

కరివదనునికృపాకరుణసేత

కదులలేనిఘడియ కాలుడేఇచ్చుగా

దేహాంతమవును సందేహమేమి

కదలినాఆగినా కారణమతడేను

భయమేలమనకిలా భారమేల


ప్రాణమున్నవేళలయందు ప్రార్థనలిడు

కదలికలులేనిసమయము కడకుమిగులు

అపుడురాముడేకృపతోడ ఆదుకొనును

ఎవరురారనుభావనలేలమనకు


song 57

శిఖిపింఛమౌళీశ శేఖరాశ్రీహరీ

శ్రీకృష్ణమురహరీ శ్రీశుభకర

నిత్యనరేశా అనితరకృపాశీల

నయనమనోహరా నాదవినుత

ముగ్దమనోహరాముక్తీశ త్యాగీశ

ఘనమేఘ శ్యామా అగణితసుగుణ

కాళీయమర్దనా కాలాంతకా నమో

ప్రణమిల్లెదనుతండ్రి ప్రతిదినమ్ము


దిదేవసకల గమ ప్రార్ధితా
క్త హృదయ వాస యవిదూర
ఖిలభూతనాధ పన్నరక్షకా
రణుశరణు తండ్రి శ్యామలాంగ






song 58

రాధామనోహరా రాసలోలానమో
వాసుదేవానీకువందనమ్ము
భాగవతోత్తమా క్తవశ్యానమో
ప్రహ్లాదసేవితాప్రార్ధనయ్య
రములుజోడింతు కైవల్యదాయకా
గీతాప్రబోధకాకీర్తనమ్ము
శ్రీకృష్ణదేవరాశ్రీరమాకాంతుడా
పాదసేవలునీకుపాపనాశ









శరణముశరణమ్ముశంఖుచక్రధరుడా

రక్షనీవుతండ్రిరాక్షసాంత

దయకునీవురూపుధరణీధరాహరీ

శుభమునీయిమాకుశోభనాంగ


song59

సిద్ధివినాయకాస్మితమంజులవదనా

ఆశ్రితపోషకా ఆర్తబందు

అభిషేకమునుసేతు ఆదిపూజ్యానీకు

గజముఖానుగ్రహా గరిమనీయి

శూర్పకర్ణాసదాశుభవరదాయకా

గణపతీనినుగొల్తుఘనముగాను

సాంబశివతనయాసంసారసాగర

దరివైనిలువునాదుతలపులందు


విఘ్ననాధునికినివేదనములునావి

కరివదనుకినేనుకరముమోడ్తు

వక్త్రతుండునికినివందవందనములు

పరమశివసుతునికిప్రణతులివియె

song60

.సీ

ఏడుకొండలసామి ఎలుగెత్తిపొగిడేము

నీదుకీర్తినిమేము నిగమవినుత

నీదుకనికరమ్ము నీకృపాకరుణయే

మాధవాఅన్నిటా మాకురక్ష

నీతోడుమాకీయి నిర్మలాంతర్గతా

నీసన్నిధియెమేలు నిక్కమదియె

పాదధూళులుమాదు పాపములుగడుగు

నామసంకీర్తన నాకమిడును


వేయినామములకు వేలరూపములకు
నెలవునీవుతండ్రినీవెవెలుగు
న్నివేళలందు ఖిలాండనాయకా
నిలచిగాచువేల్పునీవుతండ్రి







విజ్ఞవినాయకావేంచేయుమానీవు
లంబోదరునిగానులితతత్వ
మృతవర్షా సదా నందదాయకా
రుణామయహృదయా మలనేత్ర
మాయాదురంధరాహిమాన్వితానీకు
మోకరిల్లెదనేనుముదముతోడ
మూషికవాహనామోక్షప్రదాయకా
శ్రీగణేశునిగాను శ్రేయమిడుము

నినుమరచుతునేనునీచమైయుంటిని
నీవెగాచునన్నునెమ్మితోడ
నన్నుమరువబోకునాగోపవీతుడా
నన్నుకనికరించునాదుతండ్రి


శ్రీవేంకటేశ్వరా శ్రితజనపాలకా
శ్రీవత్ససా నిత్య శ్రీనికేత
నిత్యగోవిందా అనీషారఘుకులేశ
శ్రీభక్తవల్లభా శ్రీరమేశ
శ్రితమందహాస ఆశ్రితవరదానిత్య
శ్రీకళాపోషకా శేషశయన
రాజశేఖరుడా సురాసురసంసేవ్య
చక్రవర్తీ చరాచరనివాస

ఖిలహృదయనాధనందతాండవా
కలదేవరూపసాక్షిభూత
నిత్యసత్యచరితనిత్యపూజితపాద
పంకజాక్షనిత్యద్మనాభ



డబ్బుకొరకువెతకుతబ్బిబగుచునేను
లక్కునాకుదక్కలక్ష్మిగాను
నియమపాలనందునిక్కచిలేదుగా
భక్తిలేనినేనుముక్తికోరు
రాధామనోహరారమ్యమునీలీల
రుక్మిణీవల్లభాబ్రోవుమమ్ము
వనవిహారీహరీవసుదేవనందనా
దానవాంతకఘనాదశరథసుత
సీతామనోఙ్ఞావిశిష్టనిష్టాప్రియా
శబరిఫలాదత్తసత్వతత్వ
దక్షతనీరూపుదామోదరాస్వామి
సద్బుద్ధినీయుమాశాంతమూర్తి

ధర్మస్థాపనమువిధాతవైసేసేవు
విష్ణుమహిమలిలనవిదితమవ్వ
అవధరణములన్నిఆనందముకొరకు
భక్తహృదయనాధభక్తపాల



గోపకిషోరుడాగోవర్ధనోద్ధార
గోకులవర్ధనాగోపబాల
గావవయ్యానన్నుగాడాంధకారాంత
ఙ్ఞానప్రదాత వి ఙ్ఞానవేత్త
వెన్నమీగడ గ్రోలువేణుగోపాలుడా
భాగవతోత్తమాక్తపాల
నందగోపాలకావనీతచోరుడా
నీదుపాదములకునాదు ప్రణ
తి

శివదనమునీదిశంఖుచక్రధరుడా
కలముభరియించుసారసాక్ష
సాంఖ్యశాస్త్రకారకలాగమవినుతా
నాకుశాంతినీయినందనంద                        







గంగాధరాహరాగౌరీవరప్రియా
కరుణించుమోనీలకంఠదేవ
హేమాద్రినిలయా అహేతుకకరుణాబ్ది
మహిమాన్వితానీవుమమ్ముగావు
నిర్వికల్పసమాధినిజదాసులకునిచ్చు
యోగకారణకారయోగిశ్రేష్ఠ
జపతపములుసేయుచంద్రశేఖరునివి
నిన్నుదలచువారినెమ్మినీవు

భస్మధూళితాంగపాపకల్మషనాశ
సకలదేవపూజ్యసన్నుతాంగ
పరమశాంతమూర్తిపతితపావనశివా
మొక్కుచుంటినీకుమోక్షవరద

సాంబసదాశివా శాంతస్వరూపమా
సకలాగమవినుతా సాక్షిభూత
నిఖిలసంచారుడా నిగమాగమ ప్రణిత
నీలకంధరదేవ నిత్యపూజ్య
ఆదిదేవానమో ఆత్మతేజానమో
ఆదిశంకరహరా అందుమునువు
మమ్మేలుమాస్వామి మందాకినీప్రియా
మాతప్పులనుగాయు మాదుతండ్రి

సాధనావిధినువు స్వాధ్యాయమేనీవు
సాధుసంతుగాచు స్వామినీవు
శాంభవీ పతీ అశాంతిని గూల్చుమా
సత్వతత్వమునిడు. సౌమ్యశీల


ఎరుగలేమోదేవ ఈశ్వరానిన్నేను
ఎరిగితి నిన్నను వేత్తలేరి?
నిన్నెరుగగలమానిఖిలలోకస్థితా
అన్నిగుణములునీవయ్యశివుడ
నీవులేకొకతావునీవికాకమనెడి
లోకములుకలవేలోకపాల
సమయమునీవేనుసందిగ్దతయునీవు
అన్నినీవేనుఓఅఖిలభూత

నిన్నెరుగుదుమనుచునిజమునువిడిచేము
మైమరచిమనియెడిమనుజులమిల
సత్యమెరుగలేనిసామాన్యులము స్వామి
నీవెదిక్కుమాకునీలకంఠ



శివశివా పరమేశ శేషుభూషణధార
భస్మలేపితదేహభయవిదూర
హరహరా అఖిలేశ హాలహలధరుడా
శ్రీశైల మల్లీశ శ్రీఉమేశ
మురహరా భవహరా మోక్షప్రదాయకా
తిమిరాంతకాదేవ దివ్య తేజ
శరణమోసాంబేశ శరణమో త్రిపురారి 
పరమపవిత్రుడా పరమ శివుడ

శివుడవు అభవుడవు శ్రేయంకరుండవు 
శుభశశిధరుడవు అశుభదమనువు
మన్మదాంతహరుడవద్బుతచరితుడా
పాదదర్శనీయి పాపనాశ


మదన మోహన హరీ మద్భాగ్య ప్రహరణా
సుందర నందనా శోభనాంగ
తులసీదళప్రియా దురితనివారకా
దామోదరా ధనధాన్యవర్ధ
ధన్వంతరీనమో ధ్యానగమ్యానమో
రాక్షస సంహార రక్షరక్ష
నారాయణానమో నగధరా శరణము
శరణమోవల్లభా శరణుశరణు

నందగోపబాల నవనీత ప్రియచోర
నీలమేఘశ్యామ నీవెరక్ష
రాగద్వేషదూర రాసవిహారుడా
నిన్నుగొల్తుతండ్రి నిత్య వంధ్య
 

సామగానముదితా సాధనానందకా
కరుణించుమానీవు కార్యకార్య
వివిధవిధులవెల్గు వేయినామమ్ముల
దేవరాగావుమాదివ్యరూప
వేణుగోపాలుడావేగరమ్మోదేవ
వేదనాదముతోడవినుతినీకు
ఓంకారరూపమాజ్యోతిస్వరూపమా
దేద్వీప్యతేజమా దేవదేవ 

శబ్ద బిందు నాద సారమ దైవమా
కృష్ణ వర్ణ దేహ కృపకు రూప 
వరశుభ శిఖిపింఛ వనమాలి శ్రీకృష్ణ
నన్నుదరికిజేర్చునాదు స్వామి


సుమనసా మోహనా సురవరా శుభకరా
శశికళా సుందరా శాంత రూప
నిత్యతత్వమునీది నిగమాగమవినుతా
పరమపావననామ పాపనాశ
పరిపూర్ణ కరుణాబ్ది ప్రణమిల్లుదునునీదు
పాదపద్మములకుపంకజాక్ష
ప్రణమామి శ్రీహరీ పరమార్ధదాయకా
శరణుపరంధామ సత్యదేవ

నాదు దేవ నీకు నైవేద్యములనిత్తు
భక్తి తోడ నేను భవ్యముగను
పరమ కృపగ జూచు పరమాత్మవుప్రభో
నన్ను దరికి జేర్చు నంద నంద



ణువణున వెలసి లరించు నటరాజ
నంద తాండవా దిదేవ
న్నులకువెలుగౌ మనీయ దైవమా
న్నుపాలించేటి నాదు స్వామి
పంచ ప్రాణములు నీ పాద జాడలుహరా
ప్రాణి కోటినినిల్పు ప్రాణహేతు
శంభోమహాదేవసాంబసదాశివా
స్తోత్రప్రియాభవాశోకనాశ


రహరానాగ భూషణా అంత రాత్మ
మురహరా ఉమా శంకరా ముక్తి దాత
సురవరా వరదా విభో శుభశశిధర
రణు సర్వేశ్వరా శివా రణు శరణు


నంద వర్షిణీ మ్మాజగన్మాత
రుణామృతమునీవుమలనేత్రి
భయవరదవమ్మ అంబాకృపావల్లి
మ్ముగాచుమునీవుహిమ తోడ
శాంతినీయుముతల్లి శాంభవీ జగధాత్రి
రణు వేడితినిను శంభురాణి
ల్లీనినుగొలుతు దాక్షాయణీమాత
ప్పులుమన్నించి యను జూపు
రుని ప్రియరాణి శార్వాణి రువకునను
కూరిమి కురిపించుముతల్లి కుముద వల్లి
పాహిపరమేశ్వరీమాతపాహిపాహి
యము పార్వతీ పరమేష్ఠి యము జయము








Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3