పాట 61
జయదుర్గాంబికే
జయకల్పవల్లీ
విజయ
నిత్యాంబికే విజయమువిరజాక్షీ
జయజయమంగళమ్ములూ
జలజాక్షీ నీకమ్మా
జయ నీరాజనములూ జగన్మాతా (జయ)
శ్రియః
కల్యాణ శ్రేయోభివర్ధినీ
యశఃకల్యాణ
పయోభివర్షిణీ
సామ్రాజ్యప్రదాయినీ
సకలసౌభాగ్య సంపదాప్రదా
నిత్యాయవ్వనీ
మాతా మద్భాగ్య మందారవల్లీ(జయ)
శాంతి
సౌఖ్యాలనిచ్చు శాంభవివి నీవు తల్లీ
సౌహార్ద
సంప్రీతీ మాకొసగు నీవమ్మా
సౌగాత్రీ..సౌందర్యలహరీ...
సౌజ్యన్య
సంపూజితా (జయ)
Close English Transalation
Victory to Thee O Victorious Durgaa
Hail O desired boon Giver
Victorious Eternal Ambikaa Glory unto You O moist eyed One
Auspicious glory of victory to Thee O lotus eyed Mother
Victorious lamps to Thee O Divine Cosmic mother ( Victory)
O fortune and fortitude Enricher
O Divine mother raining
milk of fame and Glory
O bestower of Divine
kingDoms and eternal riches and auspiciousness
O eternally youthful divine fragrant One Hail un to You(Victory)
O eternal Peace bestowing loving Goddess Saambhavii
Give us kind and good heart with ultimate prosperity
O Divinely melodious Voiced Hail un to You
O eternally Gracious Mother Victory to Thee
You are worshipped by all Great and Good Charactered Humans(
Victory)
song62
కం
అమ్మా అమృతవల్లీ
యిమ్మా భాగ్యములనీశ్వరీ త్రైనేత్రీ
తెమ్మా స్వాంతన శాంతా
రమ్మా నిత్యమ్ము నాద రాగోద్భవదా
కం
లెమ్మా శీఘ్రము వనజా
కమ్మా కళ్యాణకావ్య కాంచన మాలా
నమ్మేము నిన్ను నిత్యా
సమ్మోహనములు త్వదీయ సంకల్పితముల్
కం
అన్నీ నీవై యుంటివి
పన్నీటన దేల్చుమమ్ము పర్వత పుత్రీ
వెన్నెల నీవు గౌరీ
వన్నెలు మాకిచ్చి బ్రోవు వరమిల నీవే
కం
ఎవరూ రాలే నప్పుడు
ఏవరములులేక మేను ఏమరి యున్నా
నీవే తోడుగ నిలుతువు
ఓవర దుర్గా సతతము ఓంకారమ్మై
song63
సీ
దేవీ బాంధవీ దివ్య తేజోజ్వలా
అంబా భవానీ అండ నీవు
పద్మ సంభవా అపర్ణా అపరిమితా
నయగారములు నీ నగవులేను
శృంగార నాయికా శృతులన్నీ నీవు
భవతిమిరములను బాపుమమ్మ
మాయనీవమ్మా అమలిన కీర్తి నీది
మహిమలెన్న లేని మనసు నాది
ఆ
అలకలువడబోకు అనఘుని కులసతీ
పద్యసుమమునీదు పదములకడ
నన్ను మరువ బోకు నాదు ప్రాణ సఖీ
మనసులోననిలిచి మహిమదెల్పు
పదములు జాలవు దెలుపగ
పదధూ ళుల మహిమలిలన పలుపలు విధమున్
పదపితా మహు కైనా
పదఘట్టన వివరింప పాడియవదుగా
కదులుము కైలాసమునకు
వదులును భవతిమిరములవి వడివడి గానున్
కదిలిన జ్ఞానపధమ్మున
మొదలవు నవజీవనమ్ము ముదము గొలుపుచున్
కాగలరు మీరు ముక్తులు
వేగిరముగ ధరన మీకు వేదన బోవున్
సాగును జీవన పయనము
ఆగకమృదు మధురముగను ఆద్యుని కృపతో
సిరుల నొసగుదువు జననీ
శరణమ్మడుగు సుజనులకు సక్కగ నమ్మా
వరముగ గోరుదు తల్లీ
స్థిరమ్మగు సద్గుణములు సీతా మాతా
బంగరు రంగున దేహము
ఫింగరు నాదనుచు గ్రోలు ఫికరలు లేకన్
చెంగున వేయును గెంతులు
పొంగెడి నవ్వులను రువ్వి పొసగుతు శోభల్
అల్లరి సేసెడు బాలా
చిల్లర పనులుమనకేల చిలిపిగ చిన్నా
మెల్లగ నుండుము నీవే
చల్లగ సమయము కరుగును చంద్రుని ఓలెన్
నేననుయహమునకునెలవు
ఆనటరాజుచలువేను అలువక కొలుమా
మానసచోరునిచరణము
లేనాడైనాహృదిలోనలెస్సగమనసా
song65
కారణ కారణ మతడే
ఆరని జ్యోతి ధరలోన ఆజ్ఞయు నతడే
ఏరోజు గడచును మనకు
మారేడు ప్రియుకృపలేక మరువకు మనసా
ఆనటరాజు చలువేను అలువక కొలుమా
మానస చోరుని చరణము
లేనాడైనాహృదిలోన లెస్సగ మనసా
మరువము తలవము యదియే
తరచి తలచుచు మరిపించు తనువే తానై
తెరచిన కనులీ నిజముకు
అరుణాచల స్మరణమగును అక్శబ్దమ్మై
song66
రామావరసుగుణారామాసకలశుభా
రామావరప్రదాప్రణవజ్యోతి
హనుమానుసేవితాహారితిగొనుతండ్రి
సీతాసమేతమైశ్రీకరముగ
రామాకనికరించిప్రార్థనలువినుమా
భక్తనిరంజనాభవతరివయి
లక్ష్మణపూజితాలక్ష్మీపతీనమో
ఆహ్లాదజనితుడాఆదుకొనుము
రామచంద్రరఘువరాభక్తపాలకా
శరణుతండ్రిశరణుశాంతికామ
రఘుకులోత్తముడవురాక్షసాంతకుడవు
జానకీపతీభజనముసేతు
song67
సీ
శ్రీరామ నామము శ్రేయస్సు నిచ్చును
భూతల మందున భూరి గాను
సీతాపతియె లేక శ్రీరమణుడు లేక
చింతామణియెలేక చిరము లేదు
రాజమార్తాండుండు రాజశేఖరుడిల
రత్నకిరీటిల రాముడేను
పాపపంకిలముల పాలుగాక మనము
పాడుదాముకలిసి పాహియనుచు
ఆ
బ్రోచు వాడు తాను బోదన తానేను
పాహియనినచాలు వరములిచ్చు
పన్నగశయనుండు పాలించు పాడిగా
భక్తిగాగొలిచిన ముక్తినొసగు
song68
సీ
నంద గోపాలుడా నవనీత చోరుడా
రాధామనోహరా రక్ష రక్ష
బృందావనమునేలు బృగుమునిసేవితా
భక్తజనార్దనా భవవిదూర
సజ్జనపరిపాల సత్యవ్రతావిభో
నన్ను బ్రోవుము తండ్రి నారదనుత
రుక్మిణీపతివి మారుతి నీదు ప్రాణము
పతితపావనుడిగా పరము నీయి
ఆ
ఆదు కొనుము నన్ను ఆది నారాయణా
శత సహస్ర నామ శరణు శరణు
ఆర్తభాంధవుడివి అంతర్యమునుదెల్సి
బ్రోవు తండ్రి నన్ను బ్రోవు బ్రోవు
రాముడు పూర్ణావతరణ
పామరు లేమరని నిజము పరమార్ధమ్మున్
ఏమీ హాస్యము ఆర్యా
రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్
song69
సీ
సకలచరాచరా సర్వేశ్వరాశివా
లోక సంరక్షకా లోభనాశ
పరమ పావననామ పాపవినాశకా
పాదనందర్శన ప్రాప్తినీయి
నీఅండమాకీయి నిర్మలాంగావరా
నిత్యనిత్యేశ్వరా నిత్యపూజ్య
నీకటాక్షమ్మను నిత్యముసారించు
నిన్ను సేవింతుమనితర సాధ్య
తే
హృదయమందుననిలుహరాహృద్యముగను
శూలపాణీమదీయ అశుభవి దూర
ఆశ్రితజనసంపోషకాఆర్తినివిను
లోకశోకవినాశకాలోకపూజ్య
తల్లిదండ్రులకిలతీరదసలుదిగులు
బాల్యస్నేహముదల్చుచుబాధలువడు
ఉన్నతకుటుంబవిలువనుమన్నుగూల్చ
జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె
song 70
సీ
అవ్యాజకరుణకు అవతారరూపము
హాయినిపంచును హరునివలెను
తపమొనర్చునిలలోతాపము హరియింప
కైలాస క్షేత్రమే గల్గజేయు
శాంతిసౌభాగ్యము సంతోషముగ నిచ్చు
ధృడచిత్త వరమిచ్చు ధృతిగమనకు
కంటిపాపవలెతా గాచుమననెపుడు
కానుకలనుబంచు కల్పతరువు
తే
ముక్తి మార్గమున నడుపు మోక్ష దాత
ధర్మ సూక్షమెరుక జేయు తత్వవేత్త
సత్య సారముగరిపెడి సత్వగురువు
నిత్య నిత్యేశ్వరుండిల నిత్యుడెపుడు
song71
సీ
అన్నపూర్ణగ స్వామి అన్నదానముసేయు
మీనాక్షివలె రాజ్య మేలు ప్రభువు
కామాక్షిసాక్షిగా కామితార్ధముదీర్చు
కనకదుర్గ విభుడు కలియుగమున
ఙ్ఞానదానముసేయు ఙ్ఞానసరస్వతి
పాదదాసులపాలి పద్మనేత్రి
అంబెతానుమనను ఆదుకొనెడివేళ
అమ్మలగన్నమ్మ ఆనయిదియె
ఆ
అన్నియున్ననాడు ఆనందమిచ్చును
లేదు యన్న మాట లేనెలేదు
ఆత్మబోధసేసి ఆధ్యాత్మికతచాటి
ఆర్తిదీర్చునట్టి ఆప్తబంధు
song72
సీ
తపము చాలదిలలోధర్మ సాధన కార్య
దూర పయనములోధృడతకొరకు
భక్తితో గూడిన భజనలు గావలె
యోగ సాధన గూడ యోగ్యత నిడు
పూజకు మించిన పుణ్యధనములేదు
సేవ సేసి మనిషి సిద్ధుడగును
గురువాక్కుమనలోని ఘోరకలిని ఆపు
గురునేత్రములుచాలు గురినితాక
ఆ
వెర్రి ముదిరి నేడు వేయి విధములుగా
మనిషి జారు చుండె మనసులేక
పూజ మానవలదు పూజ్యవచనమిది
వినిన మంచి జరుగు వింతకాదు
song78
పంచాననాశివా పశుపాశమోచనా
పరమపావనగుణా పాహిఈశ
పతితపావనమూర్తి పన్నగేశా భవా
పాలించుమాప్రభో పరమ పూజ్య
పరమపవిత్రా అపరిమితమ్మౌ దయా
పాదదాసులపాలి పద్మనేత్ర
పదధూళులేచాలు పాతక నాశనా
పదివేలవరములుపంచునవియె
పంచాననా శివా పశుపాశ మోచనా
పరమపావనగుణా పాహిఈశ
పతితపావనమూర్తి పన్నగేశా భవా
పాలించుమాప్రభో పరమ పూజ్య
పరమపవిత్రా అపరిమితమ్మౌ దయా
పాదదాసులపాలి పద్మనేత్ర
పదధూళులేచాలు పాతక నాశనా
పదివేలవరములు పంచునవియె
కాలి యందెలు మ్రోగించు కాలకాల
భక్త వరద అభయహస్త భక్తపాల
త్రినయన త్రిపూజ్య త్రిపురాంత రేడునీవు
కాచు చుంటువి ననుసదా కలిమితోడ
Comments
Post a Comment