SreekRishnaleelaamrutamu
ఈ రోజు నుండి రోజు పోతన గారు రాసిన శ్రీ కృష్ణ లీలను చదువుకుందామను కుంటున్నా. అలా చదువుకుని నా శైలిలో నేను కూడా శ్రీ కృష్ణునికి పద్య సుమాలర్పిస్తాను. అలా రాసినవి మీతో పంచు కోవాలనుకుంటున్నాను
కం:
అందరి వాడా శ్రీహరి!
అందుము నాకని వెదకుచు నార్తిగ ధరలో
ఎందరు చాచిన కరముల
నందరి డెందమును నింపు నానందముతో
కం:
చల్లని వాడా కృష్ణుడు
పిల్లన గ్రోవిని తనూదు ప్రేమగ మనకై
ఉల్లములు జల్లన వినుము
అల్లరి తండ్రికధ నిలన యానందముగా
శ్రీరామ స్తుతి
కం:
సీతా సమేత రామా
వాతాత్మజు సేవిత పద వరగుణ ధామా
శ్రీతేజో ఘన సీమా
పాతక రిపు అనఘ దివ్య పావన నామా
కధా ప్రారంభము
కం:
యదుకుల నందను లీలా
సుధల పరీక్షిత్తు వేడె సుమనస్కుండై
మధురా పురీశు కధలను
మధురముగ తెలిపె శుకముని మనయందరికై
కం:
శోకమె తానయ్యె ధరణి
రాకాసుల రాజ్యమడరి వ్రణమై దొల్వన్
చేకూరు తరుణమని గో
వై కమలాసనునికితన వ్యధలను దెల్పెన్
కం:
ధేనువు బాధను దీర్చుట
యా నలువకు క్రతువుగ నరయగనా క్షణమే
ధ్యానము జేసెగ నాతడు
దానవ వైరి హరి పాద దర్శనమునకై
కం:
వేచిరి భక్తిగ ధరణిన్
గాచెడి సురమునిగణములు కమలజు చెంతన్
శ్రీచరణములే ధ్యేయ
మ్మైచిత్తములోన బ్రహ్మ మాధవు గూడెన్
కం:
పరమ పురుషు సన్నిధిలో
పరమాద్వైతమ్ములోన పద్మోద్భవుడున్
స్థిరముగ విషయమ్మునెరిగె
ధరణీ సురలకు తెలుపగ ధ్యానము వీడెన్
బ్రహ్మ యిట్లు పలికెను
కం:
ధరణీభారముతీర్చగ
హరియుదయించునిలదానెయదుకుల మందున్
సురలారాజనియించుము
హరిబంధువులుగచుమీరు యదుకులమలరన్
యగరిమగజరుపనొకపనియవనీ పతికై
జగపతినిగొల్తురచ్చరు
లుఘనముగనుశోభనాంగులుగ రాజిలుచున్
విష్ణుని శేషశయమిలను వెన్నంటిహరిన్
కృష్ణుని లీలలు ధరణీ
తృష్ణను బాపును నిరుపమ దృష్టాంతములై
తాదెల్ప నలువ జగములు ధన్యం బయ్యెన్
ఓదార్పు ను తా బొందెను
భూదేవి, సురలకు తెలిసె బోధగ విధియే
యదువిభుడౌ శూరసేను యనుగు కొమరుడున్
మృదు భాషణు వసుదేవుకి
సుదతౌ దేవకికి పెండ్లి శోభగ జరిగెన్
ఉరకలు వేయుచు కంసుడు
తురగములు రధముకుకట్టి తోడుగ వెడలెన్
పథముననుత్సాహముగ, విపత్తది బలికెన్
విధియైయంబరవాణిగ
నధిరోహించిన పథికుఁలు నడరగ తానే
సంతుగ బుట్టును సుదతికి శౌరిఘనముగా
నంతంబు సేయు కంసా
పంతంబుగ శ్రీహరి నిను వాస్తవ మిదియే!
కొప్పును బట్టి బడదోసె, గూల్చగ నతివన్
ముప్పున కదరక బలికెగ
తప్పదు మృత్యువు నరునకు తధ్యం బదియే
తప్పుడు వాయు వచనముల
వెప్పటి కవవలె నిజంబు వినకుము కంసా
పనులను సేసిన హితముగ పరమిల దొరకున్
మనుగడ ధర్మము దప్పిన
దనుజుడగు మనుజుడు ఘోర దైన్యమె మిగులన్!
భగ్గుమనుచు కంసులోన పగయై రగిలెన్
బుగ్గియగుటతధ్యమనెగ
నిగ్గుగ నశరీరవాణి; నిజమగునదియే!
కర్మయను వచనములెల్ల కంసుడు వినునే?
ధర్మ పథమ్మును వదిలిన
దుర్మార్గుండట్టివాని దొలచు సమయమే
గావచ్చు నిధనమనడరి గడదేర్చకుమా
యీవధువు సంతునంతయు
నేవాగ్దానముగ దెత్తు నీకడకొసగన్
తడబడకను కంసు కడకు తనతొలి బిడ్డన్
ముడుపుగ నీయగ నడిచెను
వడివడిగ జడువక తాను వసుదేవుండే
సంతసముగ బలికె కంసు, "సత్యము కొరకై
సంతతి నిదెచ్చితివి నువు
పంతమునకు నేను బోను ప్రాణము దీయన్"
కేవల మష్టమసుతుడను, కీడగు వానిన్
కైవారమెత్త నీపరి
నీవానందముగ వెడలు నీరాజ్యముకున్
నిష్టముగ నరుండు సత్య నిష్ఠునిగ నిలన్
యిష్టానిష్టము ఙ్ఞానగ
రిష్టులు నెంచరు, విముక్తులెప్పుడు వారున్
తీరని నష్టము నరునకు తీరుగ గనినన్
కోరిన విత్తురు భక్తులు
వీరీయగ లేనిదేది వేడిన నొరులే
నసువులు దప్పకను దీయు ననునమ్మికతో
వసుదేవుండు మరలెను, మ
నసున భయము గలత వెట్టె నతడిని మాయై
నొద్దికగాదానసురుడె; నూరట వడెగా
పద్దతిగనివసుదేవుడు
సద్దుమణిగెఘాతుకుడని సంతసవడుచున్
గొప్పగ నారదుడు దాను గోరుచు హితమున్
తప్పది కంసా వారున్
ముప్పును తెత్తురనుచుబలు బోధల్ జేసెన్
బలి జేసెను నిర్దయగను బసికందులనే
తలిదండ్రి వగచిరి సుతుల
కలిమిని బాసి చెరసాల కల్గునడురుచున్
తాపము తీర్తునని శేష దల్పుడు దలచెన్
పాపాత్ము నాట లాగగ
నాపద గాయగ మొదలిడె నద్భుత లీలన్
గూర్పగ సంతసమును హరి గోరెను మాయన్
నేర్పుగ సప్తమ గర్భపు
మార్పున్: రోహిణిసుతుగ నమరె శేషుడిలన్
వికసిత కుసుమములు నీకు వేణువినోదా
వికలిత హృదయమ్ములు నిను
ముకులిత హస్తముల వేడి మోదము నొందున్
ప్రజలు దలచిరి యది గర్భ స్రావంబనుచున్
వ్రజ వాడల సంబరముల
విజరిగె బలరాము కొరకు వేడుక తోడన్
సుదతికి యెనిమిదవ మారు శుభసూచనతో
ఉదయించె విష్ణుతేజము
ముదిత గడుపులోన పూర్వ పుణ్యఫలముగన్
మురిసెను దేవకి మరిమరి మోదము తోడన్
మెరిసెను మేనే : యదిగని
పరితాపము నొందె నసుర పరివారమ్మే
తెచ్చును మృత్యువను భయము తెగచెను కంసున్
మచ్చుకు నైనను మరువక
నచ్చని విష్ణువు స్మరణన నలిగెను యతడే
ములునీవు శ్రీహరీ ముక్తిదాత
పంచభూతాధిపా పంచభూతనిలయా
పంచభూతాశ్రయా పాహిపాహి
నారాయణాఘనా నాదస్వరూపుడా
ప్రళయకాలాతీత ప్రణవరూప
మాయనీసహచరి మాధవా యయిననూ
నిన్నంటలేదుగా నీరజాక్ష
నిన్ను స్తుతుల గొలిచి నిన్ను దలచి
భక్తిలోన మునుగు భాగ్యజీవులకిల
నీవు కాని దేది నిజము గాను
పూచెను దేవకి కడుపున పురుషోత్తముడే
వేచంద్రార్కుల ప్రభవము
జూచి దరించు సమయమిది సుందర మూర్తిన్
కలిగిచతుర్భుజమ్ములను, కంసునిపాలిటమృత్యుమూర్తియై
కొలిచిరిపాదపద్మములు కోమలపుష్పములన్సురల్ యిలన్
వెలిగెనుపుణ్యలోకములు వీడెనుసంకెలదల్లిదండ్రికిన్
వరపుత్రుండుగ విష్ణుడే వెలయ సద్భక్తిన్స్తుతుల్జేసిరిన్
దురవస్థన్వివరించి యంతమవునా దుష్టాత్మ కంసుండనే
వరముం బొందిరనంత రంబు హరి దివ్యాకారమున్వీడెగా
మువ్వల సవ్వడిని సేసి ముద్దులు గొల్పెన్
దవ్వున రేపల్లె పిలిచె
కవ్వించగ కంసునిపుడు కాలము లేదున్
ద్వారములవి దాము దారి యిచ్చె
తల్లినిదురబోయె తండ్రిబయలుదేరె
శిరసు పైన గంప శిశువు లోన
నన్నిమరచినడచె నార్తి తోడ
నాది శేషుడు హరి ననుసరించెను వేగ
యమున దారి యివ్వ యాత్రసాగె
దేవకీ సుతుడాయెగా యదు దివ్యకీర్తి నికేతనం
పావనం బతి మోహనం బిల పాప మోచన కారకం
సేవనమ్హరికీర్తనం బతి శీఘ్ర కామ్య ఫలప్రదం
ఈవరంబిల ద్రక్కెగా హరి యిచ్చగాను యశోదకున్
ముదముగ వసుదేవుడుంచె మురిపాల సుతున్
హృదయమునకు హత్తుకొనెను
మృదువుగ నచటగల శిశువమృతవల్లనుచున్
యే పరమాత్మకు సహచరియే నిత్యమిలన్
ఆపద్బాంధవుని హరిని
నాపద్ధర్మముగవదలె నతి వేదనతో
సుదతి యశోద గనిన యదు శోభ కరములన్
కదలాడగా శుభముగన్
పదములవి కదిలెను దాము పరవడి వడిగన్
చేరెను గల్గును వడివడి చింతలు బోవన్
కారా గారము సంకెల
మారెనవి మునుపటి వలెను మాధవ కృపచే
కారుకారనె బిడ్డయే వడి కంసుడే తను వచ్చెనే
మారు మాటగ తెల్పెనే కడు మంచిగా తను దేవకీ
వీరుడా యిది న్యాయమా యిల వేదనే నువు గాంచవా?
నేడీ నిను జంపువాడు నీవుకుశలమే
ఓడెనశరీర వాణియె
చూడు నువీ ఆడుబిడ్డ చోద్యము గాదే
వీడక పంతము శిశువును విసిరెను కసితో
క్రీడన్ నవ్వెను పకపక
వేడుకగా బాలిక విను వీధి నెగురుచున్
నవ్యకాంతిని జూపగా వర నాయికై విను దారకై
దివ్యధాత్రిగ దాను నిల్చెను దేవియై సుర బూజితై
కావ్యముల్సరి బోల్చునా మరి కన్నులున్ గన గల్గునా
మంగళమ్ములుదల్లి మధురవచన
భువనములన్నిటాభూరికృపగురుపు
భువనేశ్వరివినీవుభోగదాయి
కరుణగమమ్మేలుకామాక్షిమీనాక్షి
కాత్యాయనీవేగగాంచుమమ్ము
శరణముగోరెముశార్వాణినిన్నేను
శాంభవీభైరవీశాంతినీయి
దయగజూడుదల్లిధవళవర్ణ
అసురజాతిగూల అమృతమిలననిండ
రాజ్యమేలుమమ్మరమణినీవు
గిట్టుట తధ్యమ్ము నీకు కీటకమువలెన్
యెట్టి దపములున్ గాచవు
నట్టి యధముడవనిబల్కె నామె కుపితయై
వడిగను గోరెను క్షమలను వసుదేవుడినే
కడునిర్వేదమునబలికె
కడకు నతడు "కర్మకిలన కర్తెవరనుచున్?"
పంచిన కూరిమిని గనుచు వసుదేవుడనెన్
మంచిగ మాటాడితివిల
నెంచిన సత్యమొకటేను నియతిగ గనుమా
రుజువీ రణములె యవనిన రోషమ్ములతో
సుజనుల కెవ్వరు పరులౌ?
యజరామర సత్యమిదియె యన్యులు లేరున్
నగుమోము కురిపించు నమృతమేను
పరమాత్మ మోపగా పాదము ధరణిపై
పుడమి పొంగేనుతా పులకితమయి
దేవ దేవుండుతా దివినుండిదిగివచ్చె
దివ్యపధము జూప తిమిరమందు
వటపత్ర శాయి తా వరగోపబాలుడై
వేలయద్భుతముల వెల్లివిరియు
దీనబాంధవునికి దివ్యజోక
భక్తవత్సలునికి భావకైంకర్యము
భవతరిపదములకు ప్రణతులివియె
చక్కనిచుక్కగనుమారిచనుబాలీయన్
యక్కునజేర్చెనుకృష్ణుని
మక్కువపేరునవిషమునుమాధవునికిడన్
Comments
Post a Comment