Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)physicsquestions@fnal.gov
Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)
బంధితుల మైతిమివిభోఅందముచిలుకానగవుకునాప్యాయతకున్
సందేహముపాల్జేయక
వందయుగములుగడిచిననుబంధించు మిలా
హనుమగనునేనువచ్చితిహాయిగొలుప
నగవులొలుకునీమోములోననికనయము
మీర, దైన్యముమానుమాధీరమాత
సలుపుహితమ్ముశిశువులకుచక్కెరకేళీ
అలసినచోరవకేసరి
కలవుగద అమృతగుళికలు గాంచుము మనసా
తొనకకనా పధంబునకు దూరముగా శివపాద పద్మముల్
వెనుకగమీ పదాబ్జములు వేసియిలన్ జయమొందిరార్యులై
మనుజుల మానసం బునకు మార్గము చూపు మహత్తు మీదెగా
తెలియనివేళగూడనిలతీరుగనేర్వగవచ్చుగానువే
ఉలకకబల్కకంగనుట ఉత్తమమే? చెడుజర్గుతావులో?
మెలగినమంచిగానరుడుమిక్కిలిశాంతినిబొందుగాసదా
కలలసాఫల్యమైకలిమిపండు
ఆరోగ్యభాగ్యమైఆనందనర్తనై
చెలిమిబలిమిహాయిచేరువవ్వు
నిత్యనూతనమైఅనితర ప్రజ్యోతయై
ఉత్తేజముజవము ఉదయమవ్వు
సత్యమైసకలమైసాంబుడేతోడుయై
నీడయైసఖునిగానెమ్మినిచ్చు
ధరయెఉప్పొంగుజనులుముందడుగువేయు
కోటిదేవతలుమురిసికొలువుదీరు
పద్యమిదిమేలుగోరుచూ, పదముకలిపి
ఆదరముగమీరుతధాస్తుయనురిగొప్ప
పెద్దమనసుతోవినుటకుప్రియముగాను
ధరయెఉప్పొంగుజనులుముందడుగువేయు
కోటిదేవతలుమురిసికొలువుదీరు
పద్యమిదిమేలుగోరుచూ, పదముకలిపి
ఆదరముగమీరుతధాస్తుయనురిగొప్ప
పెద్దమనసుతోవీనులవిందుగాను
కులము లన్ని సేవ కొరకు పుట్టె
ఆత్మ ఙ్ఞాన మన్న అన్యులు లేరను
అనుభ వమ్ము మనము యందుటగద
మురళీరవమ్ములమోహనుడవు
వెన్నదొంగవునీవువెన్నంటిమనసున్న
వేయినామమ్ములవేల్పునీవు
పాలుకుడుచునీవుపాపాయివాగావు
పాపాత్ములనడచుపాశమునువు
పాహియనెడివారిపాలికల్పతరువా
పతితపావనమునీపాదములిల
యాదుకోమమ్ముమాధవా యన్నిటనువె
శ్రీకరదయాలవాలమాశ్రీలునీవె
శుభముగనుచేరువవుమాకుశుభకృతమున
కైవేవచ్చియిడుసుఖవికాసాల్ శుకముల్
ప్లావనజేయన్మన్నున్
వావిలిధీవింతువార్యవాణీరమ్మా
హంతకుడు, దేవుడైపూజలందుకొనెను
యచటిపహరాజవానపాయమునతానె:
గాచిజనులందరినిపొందెగౌరవమ్ము
त्वमस्मिन कार्य निर्योगे प्रमाणं हरिसत्तमा |
हनुमान यात्नमास्ताया दु:ख क्षय करोभाव ||
వేగంగన్కడగండ్లుమాయమవునిర్వీర్యంబుగామారుచున్
యోగంబుల్బలు ద్రక్కుమానవులకున్యుక్తంబుగామేలుగా
నీలకంఠేశ్వరా నిగమవినుత
మదిలోనకొలువైన మంజునాధా ఘనా
మహిమాన్వితావరా మదన రిపువ
శివకరా శ్రీశశి శేఖరా యానంద
సింధువా వైభవా సిద్ధయోగి
వామదేవా ఉమా వల్లభా వర్ధనా
వాంచితఫలదా శివా మహేశ
యాగభోక్తనీవు యన్నినీవు
భక్తివశ్యునీవు బంధమోచనునీవు
భారమంతనీదె భయమదేల?
మారాజుల వశముగాదు మాదనడుగరున్
నేరోజు భ్రాతృలవదుగ
భారము, విద్య ప్రధమసిరి పంచినపెరుగున్
మెన్నుమహింసనుఘనముగ, మేలా కక్షల్?
దన్నుగనిలుమాదయకున్
మన్నగుతనువిలనతధ్యమదియే మనసా
అయిననూరసాయనమది, యందుచేత
కృంగె శ్వాసనాడులునాకు, కృతకమయిన
జాజులపరిమళముకడుసంకటమయె
తీరమ్మే తానదేల తెలియదు మనకున్?
మారేనా తెర చాపయె
తారాకా చంద్రుని వలె, దారియె చూపన్?
నిదురమూలమవ్వు నిజమె నీవు
నిజము నెరుగ టకును నీరాజ నమె దివ్వె
తత్వ శోధ కునికి ధరణి లోన
వమ్మా లలితాను రాగ వల్లివి నీవై
ఇమ్మా యని యడుగకనే
నిమ్ముగ గూరిమిని పంచు నెమ్మిక వమ్మా
వమ్మా వాత్సల్యమనెడి వరమిడు నీవే
అమ్మ రుణము దీర్చు విధా
నమ్మే లేదిలన విశ్వనాధుని కైనా
మురిసే పసిబాలురిలన మోదమె మీరున్
మెరిసే ఆ ఉత్తేజము
మరిమరి చూడగ తపించు మాయెదలుగదా
నువిరివిగను పంచుదురిల నొప్పగ మీరే
నవపల్లవములు మీరే
పొన్నారులు హాయిగొల్పు పూచిగురులిలన్
కన్నుల పండుగ మీరే
మిన్నంటు కలలనుగనుచు మీరెదగవలెన్
నుదయించును విద్యగూడ నుల్లాసముగా
మది దోచుమీదు ప్రాయము
నిదియే బంగరు తరుణము నింగియె హద్దున్
కన్నకొడుకుదిక్కుకాకపోయె
నాశలేనియతడు, నాలితోడుగమున
గంగ, మునిఁగిపోయె గంగలోన
మీకొరకు పదరసఝరులు మీస్వంతంబై
మీకందవలెను సులువుగ
ఆకంద శరళి రవళులె ఆనం దముగా
చదువులు చాలా గ్రహింప? చాతుర్యమ్మా
అదియేమూలకు? అమలిన
హృదయమెసరి నిన్నుజేర హృదయ నివాసా
పదిలక్షల గ్రంధ పఠన, ప్రావీణ్యము నీ
పదములు జేర్చెడి యమలిన
హృదయమునకు పధములిలన, హృదయ నివాసా
మనసున తలచుము మనోఙ్ఞమని మొదలిడుమా
పనిని యతితేలిక విధం
బున, యనిశము సాగు మిష్టముగ మంచి దిశన్
విను వీధి కెగసి నిలిచి రవిని దాకు ఘనుల్
వినినంత నీకధలిలన
జనులొందురు హాయి బోవు సంకట ములవే
కాయము వంచి పని జేసి కష్టము వడినన్
ఖాయమ్మవు సాఫల్యము
మాయా జాలమును బోలు మంత్రం బిదియే
డేటింగు లటాగకచట డేరుగ పధమున్
ఫైటింగులంట యయ్యో!
మీటింగులట తలిదండ్రి మేధావులకున్
కమ్మని కృష్ణకధ వినిన క్లబ్బుల వడునా?
రమ్మను ఫేసుబు కాహ్వా
నమ్మువినబడా? నమములు నందకొమరుకున్
నంద కిషోర గిరిధారి నందరికొరకై
వంద సమస్యల కాతడె
మందు వగచి మరచుటేల మాధవ కరుణన్
పదధూళులె చాలు శిలలు పలుకును కదులున్
పదపద్మములవి మ్రొక్కిన
ముదముగ నిచ్చును విముక్తి మోక్షప్రదమై
పదిలముగ నిలుపుదురు దమ వాగ్దానములన్
మదిగోరు యండ ,నెయ్యము,
పెదవుల ధరహాసములను ప్రేమగ నిత్తుర్
మోహన కృష్ణుడును గూడ ముదముగ గీతన్
స్నేహితునికై తనిచ్చెను
మోహా పాశమ్ము మారె మోక్షముగనిలన్
స్నేహితులు హితులు దొరకుట శ్రేయంబిడుటా
ఏహామీలడుగరు గద
సాహాయ్యమ్ములను సేయు సహపాఠీలున్
నాశయ మొకటుండిన ధర నధ్యాయదిశన్
నాశయ చంద్రకిరణములు
శాసించు మనసను పెద్ద సంద్రపు టలలన్
ఒద్దికగను గూర్చొనమను! ఓర్వకు దానిన్
బుద్దిగ పనిజేయుము నువు
శుద్ద మనస్కుండవై యశుభ్రత దొలగన్
కాలమాగబోదుకాస్త ఐన
నాడుకొనెడివేళనాటాడుహాయిగా
పాడుకొనుమునీవుపాటలెన్నొ
కాలము దీరిన జనులిక కదలరు గదిలన్
గాలము దీయును ప్రాణము
మేలముగ! నరునికి సఖ్యమే జీవమిడన్?
మనుము; కనుగొనుము కలలను; మానకు మెపుడున్
ఘన మానవప్రయత్నము
యనితర జయసూత్రములివి యందలమెక్కన్
తిరుమల శ్రీహరి హృదయము తిరుమల హరిదే
తిరుమల యిల పరమపదము
తిరుమల భక్తాళి నెలవు తిరుమల జనురే
మతిలేత విరులను జేర్చి మాలలు దాల్చున్
హితమనుచు నీలవేణిన్
యతినిర్దయగను పొలతియె యయ్యో గనదే?
యింతీ! మనుమా సతతము చింతవడకిలన్
ఎంతో సద్గుణము గదా
కాంతిగ నవ్వుచు తిరుగుట కైవల్యమదిన్
పాకాన బడెను ;మరలవు పైకపు రుణముల్
ఆకలి దప్పులు మరిని
ద్రీకలిలో లబ్దను భ్రమ క్రీడకు బలియే
బాస్కింగులు సేయవచ్చు బాసుకు లబ్దై
కాస్కేడు ఫాలది వదలి
డిస్కవరీలను పధమున టీముగ నిలుమా
అవలీలగ సేయువారు యాగాధిపతుల్
అవధులు లేనధ్యాయము
కవనశిఖర గోపురమ్ము కలయది నాకున్
మూల్యమే మని తూచకం ధర మోదముం తము పొందిరే
లౌల్యమే విడనాడి తేజము రైతుకిచ్చిరి సంస్థయై
కాల్యమౌ యనుకోని యాదృచికమ్ము గాధగ నిల్చెనే
యిక్కడలేవేమి యన్న యిక్కట్లేగా
ఎక్కడ గావది నసుగుడు?
చక్కగ విడుమా మనసను చంద్రిక వెల్గున్
నలుగురు పార్టీగ గూడు నలుగు లుకలుకల్,
కలహాలు బహిర్గతముగ
సలహాలు సయోధ్య నడుమ సమతయె లోనన్
ప్రాణ హాని యెపుడు పాప మేను
చెడ్డ కర్మ జేసి చెడకుమా నీవు పా
పాల వలన జనులు పతితులైరి
మీ యెద గోరును సతతము మేలుగ నిలలో
మీ యాపేక్షను పొందితి
మా యదునందుని దయగను మాభాగ్యమెగా
ఎంచక లాభములు లెంత సేవ జరిగెనో
అంచెలుగ నెదిగె సేద్యము
మంచిని గూడా గరిపెను మనకు కరోనా
జీవుడ దరును వగచి బలు చింతలు వడుగా
గావునపుడు పరమగురువు
దీవెనెలిడి చూపుదారి దివ్యపదముకున్
స్వామికి కైంకర్యములను వరములు గొనుడీ
శ్రీమూలము లవి మనకిల
క్షేమమ్ము నిడును సతతము కీర్తిని నిలుపున్
జనవలెతీరికగనీవుచల్లని గాలిన్
తినవలెతీయనిఫలములు
అనుభూతులివిమనకొరకు యటవీ సీమన్
కరములుకలపవలెమనముకర్తవ్యముగన్
తరుగనిపుణ్యముదక్కును
సరగునరారండుమీరుసజ్జనులారా
ప్రజల హృదయములను దోచి రాజిల్లవలెన్
సుజనులు సుకవులు మెచ్చగ
నజరామరణమగుకీర్తినర్జింపవలెన్
భవ్యపద్యపదమ్మిదేజనుభాగ్యమేమనదేనులే
దివ్యకీర్తనసేయగాయిలదేవుడేకరుణించులే
శ్రావ్యమైనిలిచేనుగామనసారసాక్షుడుమెచ్చుగా
రాముని చరితము సుధాఝరౌ నరులకిలన్
రాముని కృప రసభరితము
రామాధారము సకలము రాముడఖిలమున్
మున వర్ణించగను లేను ముక్తిఫలపతీ
మనసున వెలసిన స్వామీ
నను నడుపుము భక్తిపధమున విడువకసదా
నీపద ధూళి మహిమలను నేర్పుగ తెలుపన్
తాపస జన మందారా
పాపవిదూరా శరణము భవతాపహరా
వేడద మనసారగ నిను వేదవిహారీ
తోడుగ నిలుమా సతతము
నాడూ నేడను సమయమున కతీతముగన్
కలిమిని బలిమిని వరములుగను ప్రసరించున్
వెలకట్టలేని పరమును
నిలలోభక్తులకునిచ్చు నిత్యేశ్వరుడే
మరువక మన స్వామి పలుకు మన హితమునకై
ఒరులకు మనమిచ్చునదే
వరముగ మనకు మిగులు సిరి వాస్తవమిదియే
అమితకరుణనీది అమృతవల్లి
అనితర సాధ్యమా అధ్బుత రూపమా
ఆద్యంత రహితా అయాచితదయ
మమ్మేలుమాయమ్మ మందాకినీ ఉమా
మరకత శ్యామా సుమనసవంధ్య
మందస్మితామృదుమంజులభాషిణీ
మునిమానసనివాసముక్తిదాయి
అండనీదుపదము ఆత్మ జ్యోతి
భక్తిభావగమ్య భైరవీశరణము
భవతిమిరవిదూర భాగ్యఫలద
అరుణగిరీశుండుఆత్మబంధు
పరమశివుండుతాపాపాంతకహరుడు
మోహపాశకహారిముక్తిదాత
భూరికరుణతోడభోగభాగ్యములిచ్చు
తత్వభోధలుజేసిదారిజూపు
పరిపూర్ణుడవనుచుపలురీతిగదెలుపు
ఆరోగ్యసిరియిచ్చుఆయువిచ్చు
ఒక్క చూపు చాలు ఉద్దరింప
ఎన్న తరము గాని మిన్నంటు కూరిమి
సకల శుభములిచ్చు సాంబశివుడు
గురు చరణము భవహరణము గురుకృప జాలున్
గురు దర్శనమ్ము భాగ్యము
గురు వాక్కులు శృతులు ముక్తి గురుసన్నిధియే
కమనీయములునీదుగాధలిలన
కష్టమ్ములనుదీర్చుకైవల్యనాధుడా
కావ్యనాయకులకుకలలనావ
కల్పతరువునీవుగాచుదొరవునీవు
కల్పాంతమందునకల్కినీవు
కల్లకపటములుకలికల్మషమ్ములు
కాసింతమిగలవుగాంచిననువు
కావ్య శ్రేష్ట వీవు భవ్య రూప
కీర్తనా రసఫల కేశవా మాధవా
కంటిపాపవోలె గాచుమమ్ము
Poetry on
Swamiji
కం
తలపున
ముక్తీశుండై
వెలతువు
నిత్యేశ్వరునివి విఘ్నేశుడివిన్
పిలుపది
వేడక దయయై
నిలుతువు
వెరుపది యెరుగని నిత్యపురీశా
కం = kanda
style telugu poetry
తలపున ==
in thoughts/mind
ముక్తీశుండై
= Lord of Liberation
వెలుతువు =
You Shine
నిత్యేశ్వరునివి
= You are Lord of Eternity, Time
విఘ్నేశుడివిన్
= Lord of Obstacles
పిలుపది =
call for help
వేడక =
does not need
దయయై =
become compassion
నిలుతువు =
You stand
వెరుపది =
fear
యెరుగని =
does not know
నిత్యపురీశా
= Lord of City of Eternity
In English
what I mean to say
Oh Lord of
NityaPurii, You Shine in thoughts/mind as Lord of Liberation, Lord of Time,
Lord of Obstacles. Even before we call for help You stand there fearlessly and
compassionately eternally
Poetry on
Swamiji
కం
కొలుతుము నిన్నోస్వామీ
వెలుతురు నీవని
వెలుగువు విధికర్తవనీ
పిలుచుట మాకో
తపమే
పలుకుట నీలీల
దాస పరిజన పోషా
కం = kanda
style telugu poetry
కొలుతుము =
we worship
నిన్నో =
You
స్వామీ =
Lord
వెలుతురు =
Light/Jnaana
నీవని =
You are
వెలుగువు =
Light
విధికర్తవనీ
= Bestower of Fate
పిలుచుట =
Calling
మాకో =our
తపమే =
meditation/penance
పలుకుట =
answering
నీలీల =
Your Leela
దాస పరిజన పోషా
= Lord who takes care of devotees
In English
what I mean to say
Oh Lord
who takes care of devotees, we worship You as Light of Knowledge, Light of
eyes, bestower of fate. Calling You is our penance and answering is Your Divine glory/act
సీ
కైలాసపతివైన
కారుణ్యసాగరా
కమనీయములునీదు
గాధలిలన
కష్టమ్ములనుదీర్చు
కైవల్యనాధుడా
కావ్యనాయకులకు
కలలనావ
కల్పతరువునీవుగాచు
దొరవునీవు
కల్పాంతమందున
కల్కినీవు
కల్లకపటములు
కలికల్మషమ్ములు
కాసింతమిగలవు
గాంచిననువు
ఆ
కరిని బ్రోచు
హరివి కామేశ్వరుండవు
కావ్య శ్రేష్ట
వీవు భవ్య రూప
కీర్తనా రసఫల
కేశవా మాధవా
కంటిపాపవోలె
గాచుమమ్ము
English
Translation
Oh Lord of
Kailaasa, Ocean of Compassion
Your grand
narratives are very delightful in
all words/worlds
Oh Lord of Liberation You
relieve us of our troubles
Oh Ship of dreams for great
Heros/Warrior
Oh tree of eternal boons, Oh
Ruler
Oh Great avatar Kalki during
end of times
When you give Darshan all
lies, deceptions all kali pollutants evaporate
Oh Harii the liberator of
Gajendra, Oh Lord of Desires
Oh Best in all Kavvyas, Oh
magananimous
Oh Divine keertana’s fruit,
Oh kESavaa, Oh Maadhavaa
Save all of us just like how
a eyelid saves eyes even if eye does not know and is not aware
కం
రవ్వల మువ్వల రవళులు
పువ్వుల పలుకులిల పూర్వ పుణ్య ఫలమ్ముల్
దవ్వున మురళీ పిలుపులు
నవ్వుల త్రుళ్ళింతలు శివ నటవర కొలువుల్
In english what i mean to say
Gem studded anklet jingles, musings of flowers, fruits of varaSiva worship, beckonings from a distant flute , waves of laughter these are nitya naTavaraa's court yard proceedings/nitya naTavaraa's court yard proceedings sevas
కం
నీవే కర్మవ నిశమున్
నీవే కర్తవు బరువులు నీవే స్వామీ
నీవే సర్వము అభవా
నీవే లీలలిల సత్య నిరతా నిత్యా
In English what i mean to say
Oh Eternal Oh unBorn Oh one dedicated to Truth
Yours are deeds unceasingly, You are Doer , Yours are all burdens, You are Omni, Yours are Leelas in all worlds
కం
మహదానందోత్సవముల
మహతినిమధురముగమీటుమనకై హరుడే
మహదవకాశమిదివినుడి
అహరహరము యన్నిమరచి ఆనందముగన్
English Translation
Lord Hara is strumming
sweetly for us great festivities as if He is strumming mahati(Narada’s veena). This
is a great opportunity , please listen day in day out forgetting all else in
anandaa..
కం
హరునివె లీలలు భువిలో
హరహర యనుజనులు పెద్ద హాసము తోడన్
మరచి తమ తావు భక్తులు
పరుగులు వెట్టెదెరు శివుడె పరమార్ధముగన్
English translation
Leelas belong to Hara on
planet earth. People will laugh ecstatically loudly on Hara’s name. Devotees
forget their abodes and run with Lord Siva as greater meaning of life
సీ
హృదయాంతరమ్మున ఋజువుగనిలిచెడి
రాజాధిరాజుడీ రాజగురువు
సత్యసంధతనేర్పు సద్గురువు శివుండు
సత్యశోధకులకు సద్గతీయు
తత్వభోధనయందు తాపము నడచును
తీరముజేర్చెడి తేరుతాను
నిత్యపురీశుండు నిత్యపునీతుండు
నిత్యనిత్యుండీ అనిత్యహారి
English translation
He is the witness of in
our heart of hearts. He is emperor among emperors and Guru of emperors. He teaches
adherence to Truth and is Siva and Sadguru(bestower of mukti). He gives good
merits to seekers. His teachings dissolve sorrows and is flagship which leads
us to other shore. His abode is eternal and He is eternally embodied purity. He
is eternally eternal who dissolves all that is ephemeral
రాజులెల్లగొలుచు రామమనోఙ్ఞుండు
రమ్మననినవచ్చి రక్షనిచ్చు
రమ్యరసములొలుకు రాక్షసులుచెదురు
రాచఠీవిగనుము రమణులార
He is worshipped by kings.
Loved by Rama Himself. If you call Him to come, He protects you. Beautiful
emotions are going to flourish, demons are going to disperse. See His Royal Splendor
O Dear ones
రవితానాగునునిజముగ
ధవళహిమనగమునుచూపుతళుకుల హొయలున్
అవదెపుడుహద్దుకాలము
భవతిమిరముబోవుస్వామిభావసమాధిన్
ఎవనికరుణమననేలును
అవనీతలమునునిరతముఅవలీలగతా
కవివరులకలముకదుపుచు
అవధూతలపలుకువినుచునానందముగన్
పవళించుశేషశయ్యన
పవనసుతునిప్రభువితండుపద్మనయనుడున్
వివరించలేనిమహిమల
భువనాధిపతికినమములపుష్పములివియే
సీ
అన్నపానమ్మిచ్చు అమ్మవైనువ్వేను
ప్రాణదానమునిచ్చు ప్రభువు నీవు
స్వర్గధామమ్మిచ్చు స్వామివైనీవేను
మోక్షపధమునిడు రక్షనీవు
సత్యసంధతగోరు స్వాధికారమునీవు
నిత్యనిర్మలతత్వ నిర్వికార
నిత్యనిత్యేశ్వర నిత్యనటవరుడా
భక్తజనులపాలి భయవిదూర
ఆ
వరద మూర్తివి హరి వటపత్ర సాయివే
శరణుశరణుశరణు సాంబ మూర్తి
వేయి మార్లు వ్రాతు వేవేల విధములన్
వేల శ్రుతుల మ్రోగు వీణనౌదు
కలదేహద్దుమనాశకు?
నిలలోనిశిఖరమెమారునిగ్గుగ నువ్వై
మొలచినకోరికదీరిన
సులువుగనిజమిదనిమసలుసుఖముగ మనసా
కలదే హద్దు మనాశకు?
నిలలోని శిఖరమె మారు నిగ్గుగ నువ్వై
తలపులు తీరిన పిమ్మట
బలమైన నిజమిది చూడు బ్రతుకున మనసా
ఆహరుని లీల యేమో
దేహము భగ్గుమన దనుచు దినములు గడుపున్
శ్రీహరి పదములను మరచి
మోహమున మునిగి మనుజుడు ముక్తి పధమునన్
Comments
Post a Comment