Posts

Showing posts from March, 2022

SreekRishnaleelaamrutamu

ఈ రోజు నుండి రోజు పోతన గారు రాసిన శ్రీ కృష్ణ లీలను చదువుకుందామను కుంటున్నా. అలా చదువుకుని నా శైలిలో నేను కూడా శ్రీ కృష్ణునికి పద్య సుమాలర్పిస్తాను. అలా రాసినవి మీతో పంచు కోవాలనుకుంటున్నాను కం: అందరి వాడా శ్రీహరి! అందుము నాకని వెదకుచు నార్తిగ ధరలో ఎందరు చాచిన కరముల నందరి డెందమును నింపు నానందముతో  కం: చల్లని వాడా కృష్ణుడు పిల్లన గ్రోవిని తనూదు ప్రేమగ మనకై ఉల్లములు జల్లన వినుము అల్లరి తండ్రికధ నిలన యానందముగా శ్రీరామ స్తుతి కం: సీతా సమేత రామా వాతాత్మజు సేవిత పద వరగుణ ధామా శ్రీతేజో ఘన సీమా పాతక రిపు అనఘ దివ్య పావన నామా కధా ప్రారంభము కం: యదుకుల నందను లీలా సుధల పరీక్షిత్తు వేడె సుమనస్కుండై మధురా పురీశు కధలను మధురముగ తెలిపె శుకముని మనయందరికై కం: శో క మె తానయ్యె ధరణి రా కా సుల రాజ్యమడరి  వ్ర ణమై దొల్వన్ చే కూ రు తరుణమని గో వై   క మలాసనునికితన  వ్య ధలను దెల్పెన్ కం: ధే ను వు బాధను దీర్చుట యా   న లువకు క్రతువుగ నర య గనా క్షణమే ధ్యా న ము జేసెగ నాతడు దా న వ వైరి హరి పాద  ద ర్శనమునకై కం: వే చి రి భక్తిగ ధరణిన్ గా చె డి సురమునిగణములు  క మలజు చెంతన్ శ్రీ చ రణములే ధ్యే...