Dattapadi
అలరునుబొట్టు(యెరుపు)గను
కలకలలాడునుపదములుకళగ(పసుపు)తో
(నలుపు)విలాసమెకురులన(తెలుపు)నతివలుమమతలనుతీయగ నెపుడున్
వెలిగించుదైవ(దీపం)
తొలిగించు(యహం)బు,యపుడు దూరము (పాపం)
కొలువగు(కోపం)బుమనో
బలహీనతలయెడ,దేహ బలిమియె పెరుగున్
(కోపం) బెపుడు మిగుల్చును
(పాపం)బును, కూరిమనెడి బాటే (దీపం)
తాపంబేల? (యహం)బే
శాపంబుగ మార తగదు సాధకులకిలన్
(పాపం)బును, కూరిమనెడి బాటే (దీపం)
తాపంబేల? (యహం)బే
శాపంబుగ మార తగదు సాధకులకిలన్
చిరుగాలి, లేత వెన్నల
మరిగిన తేనీరు కూడు మనసుకు హాయిన్
చిరుజల్లులె దీవెనలై
కురువగ, తడిసిపొడిగుడ్డగొదగిన పిదపన్
మరిగిన తేనీరు కూడు మనసుకు హాయిన్
చిరుజల్లులె దీవెనలై
కురువగ, తడిసిపొడిగుడ్డగొదగిన పిదపన్
శివుడే స్వయముగ దెలిపెను
సవివరముగ రామనామ సలువ, యనంతం
బెవిభుని , త్రయంబకుని దయ
భవసాగరతరణమునిల భాధలు దీర్చున్
సవివరముగ రామనామ సలువ, యనంతం
బెవిభుని , త్రయంబకుని దయ
భవసాగరతరణమునిల భాధలు దీర్చున్
అమ్మనిలుచుతిరుపతిమం
గమ్మై, కొలువు భ్రమరాంబికది శ్రీశైలం
బమ్మయెకాశివిశాలా
క్షమ్మౌ, కంచినగరమునకామాక్షమ్మౌ
గమ్మై, కొలువు భ్రమరాంబికది శ్రీశైలం
బమ్మయెకాశివిశాలా
క్షమ్మౌ, కంచినగరమునకామాక్షమ్మౌ
సరిగములుసేయ(నాట్యం)
బరయును(రాగం)బులునిలమధురము గానున్
విరియు స్వరము (తాళం)బుకు
దిరి, (పల్లవి)తానమరిన దివ్యము గానున్
బరయును(రాగం)బులునిలమధురము గానున్
విరియు స్వరము (తాళం)బుకు
దిరి, (పల్లవి)తానమరిన దివ్యము గానున్
వారిజనయనుండౌహరి
కారుణ్యములేకదునిమెకఠినము గానున్
ఆరక్కసులను, ఆబే
జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే
కారుణ్యములేకదునిమెకఠినము గానున్
ఆరక్కసులను, ఆబే
జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే
అతిసరళముజీవనమౌ
గతితప్పనిపయనమౌను, కలయై సాగున్
చితికినయహముపెరిగినను
పతియెడకూరిమిసతికిలపరిమితి లేకన్
గతితప్పనిపయనమౌను, కలయై సాగున్
చితికినయహముపెరిగినను
పతియెడకూరిమిసతికిలపరిమితి లేకన్
శా: గోవిందా వరదా పురాణ పురుషా గోపాల చూడామణీ
శ్రీవర్ధస్య సదా స్మరామి, వినుతా శ్రీవల్లభా శ్రీహరీ
ఓవేదాంత ఘనీ వివేక వరణా ఓవేంకటేశా ప్రభూ
శ్రీవర్ధస్య సదా స్మరామి, వినుతా శ్రీవల్లభా శ్రీహరీ
ఓవేదాంత ఘనీ వివేక వరణా ఓవేంకటేశా ప్రభూ
నీవేరక్ష, స్వయంభువా కొలుతు నిన్నే నే ఘనా బాంధవా
శా: శ్రేయో దాయిని శ్రీధరీ భగవతీ శ్రీదేవి దేవార్చితా
మాయాతీత స్వరూపిణీ భవతరీ మమ్మేలు మమ్మా నువే
శ్రీయోగీంద్ర వరీ పునీత జననీ శ్రీలక్ష్మి సామ్రాఙ్ఞివై
మాయోగమ్మునుగాచు , చంద్రవదనా మందాకినీపాహిమాం
మాయోగమ్మునుగాచు , చంద్రవదనా మందాకినీపాహిమాం
శా:శ్రీకృష్ణాయదునందనాగొలుతు నే శ్రీవత్ససా యోగదా
సాకేతస్థిత శ్రీధరాభవతరా శాంతాత్వయంపోషకా
శ్రీకళ్యాణకరాయశోదతనయా శ్రీరుక్మిణీవల్లభా
మాకైమోడ్పులనందుమోసుగుణధామా పుండరీకాక్షువే
సాకేతస్థిత శ్రీధరాభవతరా శాంతాత్వయంపోషకా
శ్రీకళ్యాణకరాయశోదతనయా శ్రీరుక్మిణీవల్లభా
మాకైమోడ్పులనందుమోసుగుణధామా పుండరీకాక్షువే
శా:శ్రీకృష్ణాయదునందనాగొలుతు నే శ్రీవత్ససా యోగదా
సాకేతస్థిత శ్రీధరా సకల తృష్ణావారణా భోగదా
ఓకళ్యాణకరాయశోదతనయా ఓయష్టపత్నీ సమే
తా కైమోడ్పులనందుమీ సుగుణదాతా పుండరీకాక్షువై
సాకేతస్థిత శ్రీధరా సకల తృష్ణావారణా భోగదా
ఓకళ్యాణకరాయశోదతనయా ఓయష్టపత్నీ సమే
తా కైమోడ్పులనందుమీ సుగుణదాతా పుండరీకాక్షువై
తెలుగు విజయము
సీ:పలుకుచుంటిమినేడువాగ్దేవివరముగా
తేనెలొలుకుమనతేటతెలుగు
భారతదేశమేభాషలపూదోట
మల్లెతీగేమనమాతృభాష
తేనెలొలుకుమనతేటతెలుగు
భారతదేశమేభాషలపూదోట
మల్లెతీగేమనమాతృభాష
యాబదారౌసంఖ్యయక్షరములదేను
యాసలెన్నొయలరుహాయిగొలుప
నాందిపలికినారునన్నయ్యతిక్కన
వేమనాబద్దనేవేదమైనుడివేరు
అష్టదిగ్గజములేఆరితేరు
త్యాగయ్యకీర్తనేయక్షగానమిలన
అన్నమయ్యపదమేఅందలమిడు
భద్రాదిరాముడేభద్రముగనుగాచ
రామదాసుయెపాడురమ్యముగను
అవధానమేచేయు అవలీలగావీరు
అమ్మదయనుపొందియాంధ్రకవులు
అష్టదిగ్గజములేఆరితేరు
త్యాగయ్యకీర్తనేయక్షగానమిలన
అన్నమయ్యపదమేఅందలమిడు
భద్రాదిరాముడేభద్రముగనుగాచ
రామదాసుయెపాడురమ్యముగను
అవధానమేచేయు అవలీలగావీరు
అమ్మదయనుపొందియాంధ్రకవులు
ఆ:
భాషలమణిపూసభావమేపండును
మదికిహాయిగొల్పిమంచిచేయు
మాతృభాషమనదిమకుటాయమానము
మధురమైనిలిచునుమదులుదోచు
మదికిహాయిగొల్పిమంచిచేయు
మాతృభాషమనదిమకుటాయమానము
మధురమైనిలిచునుమదులుదోచు
మన్నునె తినెచిని కృష్ణుడు
వెన్ననుగొనిబోయెతానువేణుధరుండున్
కన్నయెకాళిందిమడుగు
పన్నగనర్తనముజేసె, పాహినిడుటకున్
వెన్ననుగొనిబోయెతానువేణుధరుండున్
కన్నయెకాళిందిమడుగు
పన్నగనర్తనముజేసె, పాహినిడుటకున్
శరణాగతము ముకుందా
కరివరదాహితమునిచ్చు గాధలు నీవిన్
వరదానీకీర్తి సతము
కరుణానిరతులనెమతముగ నిడుము కృష్ణా
కరివరదాహితమునిచ్చు గాధలు నీవిన్
వరదానీకీర్తి సతము
కరుణానిరతులనెమతముగ నిడుము కృష్ణా
మాధవా మధుసూధనా పరమాత్మ వేనువు వల్లభా
మాధురీ ఝరిపంచులీలలుమాకుచూపితివోహరీ
సాధనాపధమందుముక్తినొసంగుబోధలవేగ నీ
గాధలే స్మృతులై హితంబునుగల్గజేయు యధోక్షజా
మాధురీ ఝరిపంచులీలలుమాకుచూపితివోహరీ
సాధనాపధమందుముక్తినొసంగుబోధలవేగ నీ
గాధలే స్మృతులై హితంబునుగల్గజేయు యధోక్షజా
జాయాపతులు
నిరతముధ్యానించునతడు
హరినే, పలుకే వరమని అందరు తలతుర్
గిరిధారిదయే, యతిశే
ఎలిమియె స్నేహము నందున
కలిమికొరకు నేస్తములతొ కయ్యమె పడినన్
బలిమియె కొరవగునప్పుడు.
చెలిమికి ప్రాణమిడినపుడు చిక్కును తోడే
కలిమికొరకు నేస్తములతొ కయ్యమె పడినన్
బలిమియె కొరవగునప్పుడు.
చెలిమికి ప్రాణమిడినపుడు చిక్కును తోడే
బాంధవ్యమున నిలువవలె
బంధములన్న పలుకవలె మంచిగ నెపుడున్
బంధువులతప్పులయెడల
మత్తకోకిల: మాధవా మధుసూధనా అరి మర్ధనా యదుభూషణా
మాధురీ ఝరిపంచునీకధమాకు గోకులనందనా సాధనాపధమందుముక్తినొసంగుబోధలవేగ, నీ
గాధలే స్మృతులై హితంబునుగల్గజేయు యధోక్షజా
మత్తకోకిల:
బాంధవాశ్రితపోషకా శ్రుతవందితా ద్యుతిదాయకా
అంధకాంతకనాయకా సురరంజనా వరపూజితా
గంధ,పుష్పపదార్చితా నవకంజలోచన సుందరా
బంధపాశవిమోచనా ప్రభుబాదరాయణ సేవితా
అంధకాంతకనాయకా సురరంజనా వరపూజితా
గంధ,పుష్పపదార్చితా నవకంజలోచన సుందరా
బంధపాశవిమోచనా ప్రభుబాదరాయణ సేవితా
పాతబడెన్ నిశా విభవ, భాసిలుచంద్రుడెచిన్నబోయెగా
ఆతళుకీనుతారలికయాకశవీధులకానరావుగా
ఆతరుణమ్మెపాఱెనిల, వాడెను, బాసెను ,వీగిపోవగా
రాతిరి, చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై
ఆతళుకీనుతారలికయాకశవీధులకానరావుగా
ఆతరుణమ్మెపాఱెనిల, వాడెను, బాసెను ,వీగిపోవగా
రాతిరి, చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై
చం:
గురువనుతత్వమెప్పుడొనగూర్చునుచాలహితంబుగాంచినన్
వరముగవిద్యనిచ్చితనువాణినిమేల్కొలుపున్ స్తిరమ్ముగా
కరుణగదిద్ది ప్రజ్ఞకిలకాంచనశోభలుగల్గ జేయుగా
శరములుదాల్చికాల్చుతనుశాంతముగానుయవాంచితమ్ములన్
వరముగవిద్యనిచ్చితనువాణినిమేల్కొలుపున్ స్తిరమ్ముగా
కరుణగదిద్ది ప్రజ్ఞకిలకాంచనశోభలుగల్గ జేయుగా
శరములుదాల్చికాల్చుతనుశాంతముగానుయవాంచితమ్ములన్
కం:
అర్థముకొరకుపరుగిడక
అర్థమవనివిషయపుపరమార్థముతెలుపున్
వ్యర్థమవదుమనసమయము
అర్థకరమగుపయనమగుయధ్యయనమ్మే
వ్యర్థమవదుమనసమయము
అర్థకరమగుపయనమగుయధ్యయనమ్మే
మ:
మనలోదాగినపాటవమ్ముమలచీమాణిక్యబేహారియే
తనలోనోరిమిదక్షతేమనకుతాతర్ఫీదుగానిచ్చుగా
మనసున్ కూరిమిదాల్చిశిష్యులకుతామంచేనిడున్ యెప్పుడున్
తనువుల్ మారినగానిబోధకులకీతత్వంబెఆభూతిగా
తనలోనోరిమిదక్షతేమనకుతాతర్ఫీదుగానిచ్చుగా
మనసున్ కూరిమిదాల్చిశిష్యులకుతామంచేనిడున్ యెప్పుడున్
తనువుల్ మారినగానిబోధకులకీతత్వంబెఆభూతిగా
కం:
బాలలచేయమ్మవలెను
లాలనగానోనమాలెరాయించుబడిన్
బేలతనమెపోగొట్టును
చాలబలిమినిచ్చుగురువెశైశవ దశలన్
లాలనగానోనమాలెరాయించుబడిన్
బేలతనమెపోగొట్టును
చాలబలిమినిచ్చుగురువెశైశవ దశలన్
ఉ:
వన్నెనుతెచ్చువిద్యనిడు వందితుడేగురువౌనుగా సదా
అన్నిటగెల్వుమీయనుచునాశయమిచ్చుగ దాదరమ్ముగా
చిన్నముచింతలే , గురువె చిక్కుసమస్యలు దీర్చుకూర్మిగా
పిన్నతనంబులేదుమనపెద్దనిధానమె తానుగా నిలన్
అన్నిటగెల్వుమీయనుచునాశయమిచ్చుగ దాదరమ్ముగా
చిన్నముచింతలే , గురువె చిక్కుసమస్యలు దీర్చుకూర్మిగా
పిన్నతనంబులేదుమనపెద్దనిధానమె తానుగా నిలన్
వా సో పో వే సాహిత్య వేదిక ఆధ్వర్యంలో
శీర్షిక: ఉపాధ్యాయుడు అంటే
కం:
బాలల చే యమ్మ వలే
లాలనగానోనమాలె రాయించు బడిన్
బేలతనమె పోగొట్టును
చాలబలిమినిచ్చుగురువె శైశవ దశలన్
కం:
క్రమశిక్షణనలవరచును
సమతాభావమునుదెల్పు సఖ్యత నేర్పున్
అమలినసేవానిరతినె
గమనముగమనకుగరపునుఘనముగ నెపుడున్
కం:
అర్థముకొరకుపరుగిడక
అర్థమవనివిషయపుపరమార్థముతెలుపున్
వ్యర్థమవదుమనసమయము
అర్థకరమగుపయనమగుయధ్యయనమ్మే
మ:
మనలోదాగినపాటవమ్ముతొలచీమాణిక్యబేహారియే
తనలోనోరిమిదక్షతేమనకుతాతర్ఫీదుగానిచ్చుగా
మనసున్ కూరిమిదాల్చివిద్యలనుతామందించువిద్యార్ధికై
తనువుల్ మారినగానిబోధకులకీతత్వంబెఆభూతిగా
మ:
అనఘుండైనిలవిద్యలన్నిటినొతాయందించుపాధ్యాయుడే
మనకౌచిన్నముశంకలే,నిలిచితామార్గమ్ముజూపున్ గదా
వినయమ్మేనిజమైనసంపదగతావిద్యార్ధికేనేర్పుగా
అనురాగమ్ముగగెల్వుమీయనుచుతానాశీర్వదించున్ సదా
యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077
అ(భయము)నొసగెనుగజముకు
విభుడౌహరితామకరమెవిరచి, వి(జయము)న్
శుభముగ (రయముగ) నిచ్చెను
ప్రభువే, హరిలీలలెపుడురస(మయము)నిలన్
విభుడౌహరితామకరమెవిరచి, వి(జయము)న్
శుభముగ (రయముగ) నిచ్చెను
ప్రభువే, హరిలీలలెపుడురస(మయము)నిలన్
నిన్నటిగూర్చితలచితిమి
మొన్నమనసులోనమనము, ముదము వెదకుచున్
కన్నకలరేపుఫలమిడు
నన్నాశలెమాపు, నవియె నడుపును మనిషిన్
మొన్నమనసులోనమనము, ముదము వెదకుచున్
కన్నకలరేపుఫలమిడు
నన్నాశలెమాపు, నవియె నడుపును మనిషిన్
నల్లనిగణపతిఒడిలో
అల్లరిగాలాపుటాపె అమరినదేలా?
చల్లని స్వామికి పంపితి
రెల్లరుఈమేలెనేడు ప్రీతిగ నిలలో?
అల్లరిగాలాపుటాపె అమరినదేలా?
చల్లని స్వామికి పంపితి
రెల్లరుఈమేలెనేడు ప్రీతిగ నిలలో?
కోనలలోకోయిలరవ
మైనలరెడితెలుగుమనది,మదిపుల కించున్
మానసములెవికసించును
ఆనందముపంచుభాషయందము చిలుకున్
అమ్మఒడినేర్చినతెలుగు
కమ్మనికధలనువినుచుకమనీయముగా
అమ్మహృదయమేతెలుగు
చెమ్మగిలుకనులుతలచుచుచిత్రము కాదున్
జంటనగరాలవీధుల
కంటివెలుగుతెలుగుభాషెగదనెప్పటికిన్
ఇంటింటివాక్కుతెలుగు
పంటలతూగుమనగడ్డపలుకే తెలుగున్
కవులెందరోతెలుగులో
కవితలులెస్సగనుడివిరికావ్యము లెన్నో
సవివరణలతోరాసిరి
అవధులులేనితెలుగుమనయందరి సొత్తున్
యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077
వాగ్దేవి కళా పీఠం కవన వేదిక కొరకు పద్య కవిత
అంశం: శ్రీ వామన జయంతి
శీర్షిక: మాధవ తత్వము
తేదీ : 12/09/2021
హరి ఐదవ యవతారము
పరిడిల్లెనువసుధలోన వామను రూపున్
సరిసాటిలేనివేదాం
తరహస్యమ్మెమనకవగతముసేయనిలన్
పరిడిల్లెనువసుధలోన వామను రూపున్
సరిసాటిలేనివేదాం
తరహస్యమ్మెమనకవగతముసేయనిలన్
ఘనుడౌ బలి ,హరి వటువుగ
తననడుగగ మూడగులను, దానం బిచ్చెన్.
తనదనుకున్నసమస్తము
తనతల సైతము హరిదను తత్వము నెరిగెన్
తననడుగగ మూడగులను, దానం బిచ్చెన్.
తనదనుకున్నసమస్తము
తనతల సైతము హరిదను తత్వము నెరిగెన్
నాదిదనెడిమమకారము
ఆదిపురుషునికిడెనుబలిఆనాడునిలన్
కాదనకహరియెమెచ్చెను
పాదముతాకగశిరసునుపావనుడయ్యెన్
ఆదిపురుషునికిడెనుబలిఆనాడునిలన్
కాదనకహరియెమెచ్చెను
పాదముతాకగశిరసునుపావనుడయ్యెన్
హరివే బ్రహ్మాండంబులు
హరియే యఖిలమున వెలయు యంతర్యామిన్
హరిపదములే తరి మదికి
పరిధులు లేనియునికి మన పరమాత్మునిదిన్
హరియే యఖిలమున వెలయు యంతర్యామిన్
హరిపదములే తరి మదికి
పరిధులు లేనియునికి మన పరమాత్మునిదిన్
పావన మౌను మన మనసు
ఆవామన చరిత తలచి నానందముగా
కైవల్య నాధుడు హరియె
బ్రోవును భక్తులను తాను భూరిగను సదా
ఆవామన చరిత తలచి నానందముగా
కైవల్య నాధుడు హరియె
బ్రోవును భక్తులను తాను భూరిగను సదా
యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077
లంబోదరుడుగణేశుడు
అంబాసుతుడువినుతుండు నందించ వలెన్
అంబరములంటుశుభములు
సంబరములుసౌఖ్యముగనుసకలజనులకున్
అంబాసుతుడువినుతుండు నందించ వలెన్
అంబరములంటుశుభములు
సంబరములుసౌఖ్యముగనుసకలజనులకున్
వినాయక ప్రార్ధన
మ:
సురదేవేరులు గొల్తురున్ నిను సదా శోభాయమానమ్ముగా
కరముల్ జోడ్చి నుతింతునో సులభ ఓ కారుణ్యసింధో ఘనా
వరదా విఘ్ణ వినాయకా యధిప నీ వాత్సల్యమే వేడుచున్
శరణమ్మో సుముఖా గణేశ్వరవిభో స్వామీ మొరాలింపుమా
ఏమెరుగనపుడు (తల్లి)గ
ప్రేమించును (తండ్రి)గనిల పెంచు సుగుణముల్
స్వామియె (గురువు) గను కొలువు
కామిత (దైవం) బెపుడు సకలమై వెలయున్
సుర(వరుడు)పరమపూజిత
(గురుడు)బృహస్పతినిడుగదగొప్పయొడిగముల్
(నరుడు)నిలకోరునదియే
వరముయొఱపిడుసహ(చరుడు) వైనము గానున్
(గురుడు)బృహస్పతినిడుగదగొప్పయొడిగముల్
(నరుడు)నిలకోరునదియే
వరముయొఱపిడుసహ(చరుడు) వైనము గానున్
వెర్రికవితలను వ్రాయును
కుర్రదివర్కుసమయమున, కునుకునె మానున్
తుర్రునపరిగిడుబాలుడు
మొర్రోఅనినవినబడదు, మోహంబిదియే
కుర్రదివర్కుసమయమున, కునుకునె మానున్
తుర్రునపరిగిడుబాలుడు
మొర్రోఅనినవినబడదు, మోహంబిదియే
నిక్కరు కురచగను తొడిగి
లిక్కరు తాగుట యెలక్కు లేకి పధమునన్
ఒక్కరు తిరుగుట మేలని
చిక్కరు హితులకు ,బ్రతుకికచెక్కం బడునే?
లిక్కరు తాగుట యెలక్కు లేకి పధమునన్
ఒక్కరు తిరుగుట మేలని
చిక్కరు హితులకు ,బ్రతుకికచెక్కం బడునే?
సీ:
ధిమిధిమినర్తించుదేవేరితోగూడి
దేవదేవుండుతాదివ్యముగను
హిమజనగవొలుకహిమశిఖరముతూగ
పరమశివుండాడుపరవశించి
ద్వైతరూపునుచూప ద్వంద్వతత్వముతోడ
అర్ధనారీశుడేఅందెకదుపు
పన్నగభూషణుపార్వతీపతిగాను
లాస్యముజేయునులయనునిలుప
దేవదేవుండుతాదివ్యముగను
హిమజనగవొలుకహిమశిఖరముతూగ
పరమశివుండాడుపరవశించి
ద్వైతరూపునుచూప ద్వంద్వతత్వముతోడ
అర్ధనారీశుడేఅందెకదుపు
పన్నగభూషణుపార్వతీపతిగాను
లాస్యముజేయునులయనునిలుప
ఆ:
నాట్యమాడుశివుడునటరాజుగామారి
భంగిమలనుదాల్చుభైరవుండు
ఆదిశక్తికదులు ఆద్యునిపదజాడ
సర్వహితములీయసతతమునిల
భంగిమలనుదాల్చుభైరవుండు
ఆదిశక్తికదులు ఆద్యునిపదజాడ
సర్వహితములీయసతతమునిల
భగభగమనెదశకంఠుడు
రగిలెనునిప్పెకణకణములఫెలఫెలా, ఔ
తగులబడెనహంకారము
మిగిలెనునగుబాటుధూళె మీరగ హద్దుల్
రగిలెనునిప్పెకణకణములఫెలఫెలా, ఔ
తగులబడెనహంకారము
మిగిలెనునగుబాటుధూళె మీరగ హద్దుల్
భగభగమనిదశకంఠుడె
రగిలెనునిప్పుకణికవలె,రాముని శరముల్
తగిలాకాముడుతగలడె
సెగలనుగ్రక్కుచు,విజయముసీతాపతిదే
నిప్పులు గ్రక్కుచు కూలెను
తప్పుడు దశకంఠుడిలన, ధరణిజ పొంగెన్,
యిప్పుడు దసరా మొదలగు
గొప్పగ సంబరములుజరుగుజగతి లోనే
కం
(జయము)లునీకోకృష్ణా
(నయము)గమమ్మేలుమోఅనంతకృ పాబ్దీ
(హయము)లుదయగనడిపితివి
(రయముగ)భక్తునికొరకుపరమకృపగ నిలన్
కం
సర్వముతెలుసునునీకో
పర్వతపుత్రీఅధర్మ,పరులకు వెతలన్
మర్వక నొసగుము సమతా
సర్వేశ్వరి, భావగమ్య, శాంకరి సదయా
కం
పంటినిబిగించినడుపగ
బంటు అనీరుడురధమునుబహుపాటవమున్
మింటినచెలగెనుసూర్యుడు
కంటికికానబడువేల్పుకరుణగ మనకై
బంటు అనీరుడురధమునుబహుపాటవమున్
మింటినచెలగెనుసూర్యుడు
కంటికికానబడువేల్పుకరుణగ మనకై
మత్తకోకిల:
దివ్య మంగళ సూర్య రూపము తేజరిల్లును నింగిలో
నవ్య తేజము నిచ్చు కాంతుల నందు ధాత్రియె శోభగా
భవ్యమౌ జగతే సదా దయ భాస్కరుం కిరణాలదే
సవ్యమౌ శుభమౌను జీవిక సారవృష్ఠి తనీయగా
అరుణారుణకాంతులతో
చెరగెనుభాస్కరునితేరుచిన్మయముగిలన్
గరిమ అనీరుదిహయములు
పరుగిడెవేగమ్ముగాను ప్రాతః దిశగా
చెరగెనుభాస్కరునితేరుచిన్మయముగిలన్
గరిమ అనీరుదిహయములు
పరుగిడెవేగమ్ముగాను ప్రాతః దిశగా
తిరుగుదుముపలుదిశలబడి
పరుగులువెట్టదముమేముపన్నగ శయనా
తిరుపతిపతీగతినువే
తిరువేంకటగిరికిచేర్చుతేరుల నీయీ
పరుగులువెట్టదముమేముపన్నగ శయనా
తిరుపతిపతీగతినువే
తిరువేంకటగిరికిచేర్చుతేరుల నీయీ
నీదయ కావలెన్ సతము నీరజనాభ యిలన్ శుభంకరా(ఉత్పల మాల)
కరుణయె కావలెన్ సతము కావుమునన్నుయిలన్ శుభంకరా(చంపకమాల)
అభవుడుపరమశివకరుడు
శుభములుజనులకునొసగి అశుభములుడుగగన్
అభయములిడుహరుడుశివుడు
విభవములిడువితరణముగవిరివిగమనకున్
నానీ! నానీ! నినునే
నానని నూనెనె ననున్న నాన్న నననా?
నూనెన నాన్నానననూ
నానిన నిన్నన నునేను నాన్నా నానీ!
శచిశివసతివిమలలలిత
ఉచితమగువిధమునజనులనుమయెగనునిలన్
సుచరితసరితభవతరిణి
వచనములుతెలియపరచవు వరముల ఘనతన్
ఉచితమగువిధమునజనులనుమయెగనునిలన్
సుచరితసరితభవతరిణి
వచనములుతెలియపరచవు వరముల ఘనతన్
అంకిలములుచాలకలవు
పంకిలమునకమలములను పంచుగ నివియే
వంకిలములేనిమొలకలు
సంకిలములవెతుగనేల సత్యమె యిదిగా
పంకిలమునకమలములను పంచుగ నివియే
వంకిలములేనిమొలకలు
సంకిలములవెతుగనేల సత్యమె యిదిగా
(గంగ)కటుదిక్కునగురువు
(తంగ)మనితరులతనినెగతాళియె సేతుర్
(లంగ)నుగురువుపిలుపువిని
(అంగ)కమలములువిరియగ యద్దరి చేరెన్
కావ్యలహరి
*తేది: 27-10-2021
అంశం: సందేశాత్మకమైన పద్యాలు
హామీ: యిది నా స్వీయ రచన. కావ్య లహరి పద్య ప్రక్రియ కొరకు వ్రాసినది
శీర్షిక: నాలుగు మంచి మాటలు
ప్రక్రియ: కంద మాలిక
పేరు: హిరణ్మయి ములుకుట్ల
నివాసము: టొరొంటొ కెనడ
బ్లేమును సేతుము మనమే
లేమిని చూసి నిలలోన లేజీ గానూ
ఏమీ గట్టిగ సేయక
కాముగ నడుగుదుము లక్కు కామితములకై
లేమిని చూసి నిలలోన లేజీ గానూ
ఏమీ గట్టిగ సేయక
కాముగ నడుగుదుము లక్కు కామితములకై
నవ్వే దివ్యౌషదముగ
నవ్వుతు హాయిగ బ్రతుకుము నవ్వించుమిలన్
నొవ్వని పలుకులె పలుకుము
సవ్వడు లేలపరుషముగ శాంతమె తగుగా
నవ్వుతు హాయిగ బ్రతుకుము నవ్వించుమిలన్
నొవ్వని పలుకులె పలుకుము
సవ్వడు లేలపరుషముగ శాంతమె తగుగా
ప్రేమగ నెరపుము పనులను
క్షేమము కోరిన సతతము క్షీణించుగదా
క్షామములిల, సౌభాగ్యమె
సామీప్యంబౌ సుఖముగ సకలజనులకున్
క్షేమము కోరిన సతతము క్షీణించుగదా
క్షామములిల, సౌభాగ్యమె
సామీప్యంబౌ సుఖముగ సకలజనులకున్
త్యాగము సేయుము చింతలు
యాగముగా నందమునిల యందించదగున్
భోగంబిది గద నిజముగ
యోగము గనుమారు బ్రతుకు యుక్తంబిదిగా
యాగముగా నందమునిల యందించదగున్
భోగంబిది గద నిజముగ
యోగము గనుమారు బ్రతుకు యుక్తంబిదిగా
జీవుండే యీశ్వరుడిల
పూవులు మనకర్మలిలన పూజలుసేయన్
నైవేద్యంబౌ కూరిమి
సేవ శివసనిద్ధి నిడును శీఘ్రముగ నిలన్
పూవులు మనకర్మలిలన పూజలుసేయన్
నైవేద్యంబౌ కూరిమి
సేవ శివసనిద్ధి నిడును శీఘ్రముగ నిలన్
సీ:
శబరిమాతానీకు సతతము ప్రణతులు
భక్తిరూపైనీవు బ్రతుకనేర్పు
కమ్మదనముచూసి కైవల్యపతికిచ్చు
కల్మషమేలేని కాంతనీవు
భక్తులెందరొకోరు భావనేసొంతమై
చరితలోనిలిచిన సత్యమునువు
పంపానదీదరిపావనమాయెను
నీపాదములధూళి నేతనొంది
కమ్మదనముచూసి కైవల్యపతికిచ్చు
కల్మషమేలేని కాంతనీవు
భక్తులెందరొకోరు భావనేసొంతమై
చరితలోనిలిచిన సత్యమునువు
పంపానదీదరిపావనమాయెను
నీపాదములధూళి నేతనొంది
సీ:
మునివరుడుమతంగుమోదముగతెలిపె
శ్రీపధమ్మునుచూపు శ్రీపతియని
గురువాక్కుపైగల గురితోడ శ్రద్దగ
గడిపినావుగనీవుకాలమునిల
శ్రీరామురాకకైరేయింబగులువేచి
రేగిపండ్లునువుకొరికినిడితివి
రాముడుతాతత్వరమ్యతౌనవవిధ
భక్తినితెలిపి అభయమొసగెను
శ్రీపధమ్మునుచూపు శ్రీపతియని
గురువాక్కుపైగల గురితోడ శ్రద్దగ
గడిపినావుగనీవుకాలమునిల
శ్రీరామురాకకైరేయింబగులువేచి
రేగిపండ్లునువుకొరికినిడితివి
రాముడుతాతత్వరమ్యతౌనవవిధ
భక్తినితెలిపి అభయమొసగెను
ఆ:
శ్రద్ద కలిగిననిల స్వామికి నచ్చుగా
సర్వ మిచ్చి మెచ్చు సత్య మిదియె
రక్తి లేని రత్న రాశి రామునికేల?
రేగి పండు చాలు ప్రీతి తోడ
సర్వ మిచ్చి మెచ్చు సత్య మిదియె
రక్తి లేని రత్న రాశి రామునికేల?
రేగి పండు చాలు ప్రీతి తోడ
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
ఫ్:6474013077
నీలికన్నులదాగెనేనిశములుగద
వాలుచూపులుచూపెగాపరువమునిల
పట్టుదలచూపెకనుబొమపడతిలోన
పద్మనేత్రిసింధూరమెబాసిబోయె?
వాలుచూపులుచూపెగాపరువమునిల
పట్టుదలచూపెకనుబొమపడతిలోన
పద్మనేత్రిసింధూరమెబాసిబోయె?
కవ్వించునగవులసొగసు
పువ్వులనడుమతనుదాగిపులకింతలిడెన్
జవ్వనినీలికనులకల
సవ్వడిమదిలోనరేప స్వాంతన మేదిన్?
పువ్వులనడుమతనుదాగిపులకింతలిడెన్
జవ్వనినీలికనులకల
సవ్వడిమదిలోనరేప స్వాంతన మేదిన్?
అష్టాంగయోగభంగిమ
కష్టంబాక్టోపసుకిల కరములె చాలున్
క్లిష్టంబదినాకనకుము
శిష్టముశాస్త్రముననరుల శ్రేయము కొరకున్
కష్టంబాక్టోపసుకిల కరములె చాలున్
క్లిష్టంబదినాకనకుము
శిష్టముశాస్త్రముననరుల శ్రేయము కొరకున్
ఉల్లినిముక్కలుతరుగగ
చెల్లినడిగికూరనేనుచేసితి నేడున్
తల్లికొనగూడెసాయము
సల్లగ,మళ్ళినదిమాకుసమయము హేలన్
దారిద్రనాశుడౌహరి
నారాయణునామములవినమృతమ్మౌగా
ఆరాధించదగునుగా
శ్రీరాజేశ్వరునిపదము శ్రేయము కొరకై
నారాయణునామములవినమృతమ్మౌగా
ఆరాధించదగునుగా
శ్రీరాజేశ్వరునిపదము శ్రేయము కొరకై
(జలము)లుగంగవిదక్కెను
(చలము)భగీరధుతపముది, సాగె నదిగ భూ
(తలము)కు, మనుజపరిశ్రమ
(ఫలము)లనెన్నగనులేముపరిపూర్ణముగన్
(చలము)భగీరధుతపముది, సాగె నదిగ భూ
(తలము)కు, మనుజపరిశ్రమ
(ఫలము)లనెన్నగనులేముపరిపూర్ణముగన్
పరమ శివుని కృప (ప్రళయ)ము
ధరణీ (బీభత్స) మిదని దడవవ లదిలన్
హరు (రౌద్ర) రూపు సల్పును
నరలోకమున (లయ), జగము నడువశుభముగన్
నీ(కృ)ప కోరెదము హరీ
శ్రీకృ(ష్ణ ) వరా దయనిడు శ్రేయోదాయా
మాకృషి (వే)ణుధరా నీ
స్వీకృతి కై ధర(ణి)లోన శ్రీకారుణ్యా
శ్రీకృ(ష్ణ ) వరా దయనిడు శ్రేయోదాయా
మాకృషి (వే)ణుధరా నీ
స్వీకృతి కై ధర(ణి)లోన శ్రీకారుణ్యా
ఇనకులతిలకం రామం
ఘనతర పాలం ఖలుజన కైవారం గా
చునగధర శ్యామం దే
వనరశ్రేష్టం నమామి త్వం సుగుణరవీ
ఇనకుల శేఖరా సుగుణశీలవరా పరమాత్మకా నమం
ఘనతర పాలకా సుజన కామ్యవరా కరుణాదయానగా
అనితర విక్రమా ఖలుజనాంతక శ్రీరఘురామభద్ర దే
వనర సుపూజితా శరణు వందనమో హరి తేజసోరవీ
అల్లరి కృష్ణునిలీలలు,
పిల్లన గ్రోవే సుజనుల ప్రియ నేస్తమ్మౌ
చల్లగొను వాసుదేవుని
కల్ల యనుకొనెడి ప్రబుద్ద ఖలులున్ కలరున్
పిల్లన గ్రోవే సుజనుల ప్రియ నేస్తమ్మౌ
చల్లగొను వాసుదేవుని
కల్ల యనుకొనెడి ప్రబుద్ద ఖలులున్ కలరున్
జీవనమె సమరము సుమీ
చావది వేరుగనులేదు చతికల బడుటే
ఓవీరా బలముగ మను
మా వరపుత్రుండవై, యమరునిగ నిలుమా
చావది వేరుగనులేదు చతికల బడుటే
ఓవీరా బలముగ మను
మా వరపుత్రుండవై, యమరునిగ నిలుమా
గండర గండునిగ మెలగు
లండుగ నూరికె నిలువక రక్షణ నిచ్చున్
పండుగె నాతని పక్షము
నుండిన, శత్రువుల పిండు నుజ్జుగ నిలలో
లండుగ నూరికె నిలువక రక్షణ నిచ్చున్
పండుగె నాతని పక్షము
నుండిన, శత్రువుల పిండు నుజ్జుగ నిలలో
గరళము కంఠము లోనన్
కరమున కణకణమనగ్ని కరుణ నయమునన్
పరమ దయాభరితంబును
పరమ పవిత్రం బదిగద పశుపతి రూపే
కరమున కణకణమనగ్ని కరుణ నయమునన్
పరమ దయాభరితంబును
పరమ పవిత్రం బదిగద పశుపతి రూపే
సంతత మొందిన, శివుడుర
వంతగనైన నిడు సకల వాంచితములిలన్
శాంతియు భాగ్యము నూతన
క్రాంతిగ వెల్లివిరియంగ కరుణించుమనన్
వంతగనైన నిడు సకల వాంచితములిలన్
శాంతియు భాగ్యము నూతన
క్రాంతిగ వెల్లివిరియంగ కరుణించుమనన్
కరుణా (పూరి)త శివుడవు
సరసిజనాభ హృదయఘన సం(చారు)డవున్
కరుణ సమ(కూర) నిలుతువు
నిరతిగ, (సాంబా! రు)జువిల నీలగళమ్మే
కరుణా పూరిత శివుడవు
సరసిజనాభ హృదయఘన సంచారుడవున్
కరుణ సమకూర నిలుతువు
నిరతిగ, సాంబా! రుజువిల నీలగళమ్మే
వెలుగ తెలుగు తేజమిలన
పలికెనుధీటుగ తెలుగున పద్యము లెన్నో
తెలుగు జనుల హృదయమ్మున
నలరు గరికపాటిమాట నవ్వులు రువ్వన్
పలికెనుధీటుగ తెలుగున పద్యము లెన్నో
తెలుగు జనుల హృదయమ్మున
నలరు గరికపాటిమాట నవ్వులు రువ్వన్
శ్రీకల్యాణీ తల్లీ
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకమలాబ్జుని ప్రియసతి శ్రీపంచమినన్
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకమలాబ్జుని ప్రియసతి శ్రీపంచమినన్
శ్రీకల్యాణీ తల్లీ
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకమలాక్షీ ప్రణతులు శ్రీపంచమినన్
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకమలాక్షీ ప్రణతులు శ్రీపంచమినన్
శ్రీకల్యాణీతల్లీ
సాకారమ్మౌనుపంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకరమిలనీకుపూజశ్రీశుభఫలదా
చదువుల తల్లికి ప్రణతులు
సదనముగగొనుము దయగను సతతము నువునా
హృది నీపదాబ్జములకున్
సదయా వాణీ శరణము శరణము తల్లీ
శరణము భారతీ శరణు సత్యవ తీ వరదాయినీ సదా
నిరతిగ నమ్మితిన్ యిలన నీపదపద్మము లన్సరస్వతీ
కరముల మ్రొక్కెదన్ హృదిన కావ్యసుధల్కురిపింపుమానువే
సరితగ ఙ్ఞానవాహినిగ శ్రద్దగ గొల్తును శారదా నినే
నిరతిగ నమ్మితిన్ యిలన నీపదపద్మము లన్సరస్వతీ
కరముల మ్రొక్కెదన్ హృదిన కావ్యసుధల్కురిపింపుమానువే
సరితగ ఙ్ఞానవాహినిగ శ్రద్దగ గొల్తును శారదా నినే
అ(హ)రహము తపము జపమను
మహిమయె నీస్వంతము గద, మ(ను)జుల కదియే
మహిలో (మం)గళ కరమౌ
యిహపర సాధనము, పధము: యి(త)రము కలదే?
మహిమయె నీస్వంతము గద, మ(ను)జుల కదియే
మహిలో (మం)గళ కరమౌ
యిహపర సాధనము, పధము: యి(త)రము కలదే?
అ(హ)రహము తపము జపమను
మహిమయెనీ స్వంతము హ(ను)మా మాకదియే
మహిలో (మం)గళ కరమౌ
యిహపరసాధనము, పధము, యి(త)రము కలదే?
మహిమయెనీ స్వంతము హ(ను)మా మాకదియే
మహిలో (మం)గళ కరమౌ
యిహపరసాధనము, పధము, యి(త)రము కలదే?
Comments
Post a Comment