గజేంద్ర మోక్షము
కోరుదు భక్తిగ మదిలో
నీరజనాభుని " నడుపుము నీవే నన్నూ
ఆరాధింతును సతతము
నీరాజనముల నొసగుచు నీపదములకున్"
భద్ర గజము హరిని పిలిచె
భద్రమివమని, తను చిక్కి బైరికి కొలనున్
చిద్రూపి గాచె గజమును
సద్రూపముగ వెలిసినిల, సత్యము నిలుపన్
మూడు శిఖరముల నలరును
ఆడురు కిన్నెరలు చాల యానందముగన్
చూడగ యింపగు యాగిరి
వేడుక మీరసురలరుగు వినువీధులలో
ఆగిరి పేరు త్రికూటము
సాగించును తమ బ్రతుకులు సవ్యముగానున్
రాగాతీత శుకమ్ములు
భోగముల మునగు చరములు భుక్తిగడుపుచున్
చం:
సకలచరాచరమ్ములట స్వాంతనబొందునుహాయిగాసదా
అకటకటమ్ములేవచట యాగిరిలోకలవన్నిభోజ్యముల్
మకుటములేనిరాజులెగ మంచిగనెల్లరునచ్చటన్ సుమీ
ప్రకటముచాలవృక్షములు పక్వముగల్గుఫలమ్ములన్ నిడున్
దప్పిక గొని మద గజములు
గొప్పగ వెడలెను కొలనుకు గుంపుగ నడవిన్
చప్పుడు కదిరితర మృగము
లప్పుడు, బెదురుచు నలుదిశలకును పరుగిడెన్
తొణకని శక్తి గలిగినవి
బెణకవు సింహములకైన, భీతినెరుగువున్
అణకువగనితర జీవులె
ప్రణమిల్లీ గజములకును వణుకుచు నెపుడున్
ఉ:
తప్పెను త్రోవనీ పరియె దంతి యరణ్యములోన దుర్విధిన్
ఒప్పుల కుప్పలౌ సతులు నొబ్బిడిగా యనుగామిలైరిగా
దప్పిక మీరగా గనిరి తాలిమి నిచ్చు సరస్సె ప్రీతిగా
నప్పుడు సేదదీరిరిగ నందముతోడ జలాశయమ్ములో
దాహముతీరినపిదపన
మోహమున మునుగుచు నాడె ముదముగ గజముల్
ఆహారముకై వెదకెడి
గ్రాహమొకటి పట్టె కాలు గజరాజునిదే
కరిమకరమ్ములు పోరును
కరకుగ సలిపెను బలిమియెగల్గి కొలనునన్
సరితూగలేక నీటన
తరిగెను శక్తిగజమునకు తగవందుసుమీ
నీడౌ పరివారమ్మే
తోడుగ నిలువగనులేక దూరముగ దరిన్
గూడి గనిరి పోరాటము,
వీడక పాదము మకరమె వేదించె కరిన్
ఉడిగెను బలమి గజమునకు
గడువగ చాల సమయమ్ము, గర్వము వీగెన్
జడువక నిలిచెను పోరున
అడుగు కొలను వెలుపనగల హద్దున మోపన్
తననిక గాతురెవరని మ
ధన బడెను గజేంద్రుడలసి, దైవము బ్రోచున్
యనొక దలపు మెదిలె మదిన,
తనువు తుదకు వశము దప్పు తరుణము లోనన్
గతజన్మలపుణ్యఫలము,
వెతికెకరీంద్రుడుతపనగవిష్ణుని కొరకై
వెతలబడువేళ మరువక,
సతతముహరినేకొలిచెడిసద్భా వముతో
యవలంబము కోరి గజము
భవ సాగర తరిని పిలిచె భక్తికి రూపై
అవధారు దేవ మొరనని
రవమును జేయుచు పిలిచెను రయముగ గావన్
గజేంద్ర ప్రార్ధన
వెలసితివఖిలమునందున
నెలవైకారుణ్యమునకునీవె పరేశా
అలసితిని ప్రభోశరణము
కలిగింపుము ముక్తినాకు కైవల్య పతీ
తలపుల నందు నిలిపినిను
కొలచితి, పరమాత్మవునువు ,కోరితి నిన్నే,
పిలచితిని విభో నార్తిగ
పలుకుము దయతోడ నీవు, పావన మూర్తీ
అడుగడుగుననినువెదకుచు అంతర్యామీ
మడుగున పడి మోపగనొక
వగతునునీకొరకైనే,
భగవంతుడవునువు భక్త భవ తారణమా!
ఇగురునిక ప్రాణముల దశ
నగపడ వేమికను నాకు నభిమానముగన్ ?
కరిమొరలనువిని, సురలే
మురిసిరి, వరదుడుజనునిక ముక్తినిడుటకున్
కరిదరిచేరుటనిజమని ,
హరికదలె, సిరిహరి వెంట హాయిగ కదిలెన్
గరుడగమనుడైప్రభువు మ
కరమునుచక్రమునుదాల్చిఖండిం చెనుగా
కురిపించిరిగసురలు సుమ
ఝరి, గంధర్వుని గమారె జలకంటకమే
మరచితన తాపము, హరికి
సరసున గల కమలము నిడె సామోద్భవమే.
హరి నిమిరె దయ గటుల హరి
కరములు సోక కరిమారె గముముక్షువుగన్
కొలిచెగ యింద్రద్యుముడై
యలువక హరినీ గజమ్ము యలనాడు సుమీ
తలచుచు హరిని మరిచె దే
వలముని సత్కారమునొక పరి యనిరతిగన్
అలిగిమునిశాపమీయగ
కలిగెనుగజరూపతనికికాయము లోనన్
కలిమౌహరిభక్తితుదకు
నిలిచినిడెసకలమతనికినెమ్మిగనుగదా
నారాయణుడేగాచును
సారంగకధననుదినముచదువుసుజనులన్
భారముదీరునుమదులకు
తారణమిహపరములకునుతధ్యము గానున్
జయహో దుర్గా అంబా
జయహో శంకర ప్రియసతి జయహో మాతా
జయహో జగదోద్దారీ
జయహో సర్వేశ్వరీ విజయహో జననీ
నమహో నిత్యా నియమా
నమహో నారాయణీ అనంత కృపాబ్దీ
నమహో అనన్య శక్తీ
నమహో నమ్యా ఉమా ప్రణామము నందా
శరణంబో భవతారిణి
శరణంబో శుభ ప్రదా ప్రసన్నా సత్యా
శరణంబో శార్వాణీ
శరణంబో సత్కళా ప్రసాదీ సాధ్వీ
పాహిపరమార్ధదాయిని
పాహిపరంజ్యోతి సర్వపాప వినాశీ
పాహిపరాశక్తి శచీ
పాహిపరమపావనీ ఉపాసన లభ్యా
నీరాజనమోనిర్మల
నీరాజనమోనిరంజనీనిష్పాపా
నీరాజనమో నవ్యా
నీరాజనమోసనాతనీ నిర్మోహా
phytollaccA 30+ 1 drom
Comments
Post a Comment