రుక్మిణీ కల్యాణము
ప్రార్థన
మాధవు పట్టపు రాణివి
నాదరముగ గనుముమమ్ము, నమములు నీకున్
నీదరికి జేర్చు మాతా,
నీ దివ్యపద చరణములె నెలవులు మాకున్
గోవిందా! గోపాలా!
నీవే శరణము హరీ ! కనికరము గొనుమా
పావనమూర్తీ కృష్ణా!
ఓవేదవిహారి నీవు నొప్పుము కృపతో
కథా ప్రారంభము
జలజ భవునాన మేరకు
కలికి నొసగె రైవతుండు కల్యాణమునన్
బలరామ దేవ రేవతు
లలరిరి వైవాహమునతి రమ్యము గానున్
క్షీరాబ్దికన్య యంశగ
నారుక్మిణి వెలసె, నిలకు నందములొశగన్
కారుణ్య జలధి బ్రోచెగ
దారమణిని తాను దునిమి ధరణీ పతులన్
రుక్మిణీ జననంబు
వెలిగె ఘనుడు భీష్మకుడున్
గలుగగ నేవురు కొమరులు కమనీయముగన్.
నిలశోభ యినుమడింపగ
నలరెను రుక్మిణి కడదియు, నారవ చూలై
అందాలభరిణె, జాబిలి
చందమున కలకలలాడు చక్కనిమోమున్
నందమిడె పసిడిబొమ్మగ
నందరి కన్నులకు నామె నయగారముగన్
మోహనుడే మోహమ్మును
నూహకు నందనివిధముగ నొందెడి సొగసుల్
సాహసము సేయదగునుగ
దాహరి కైనా, హొయలులు తనసొంతమవన్
చెలులను గూడి తనాడెను
యలుపు సొలుపు లేక చిలిపి యాటల నెన్నో
కలడిల కృష్ణుడని తెలిసి
కలలను గనెనా సుకన్య కన్నని కొరకై
అందరు మెచ్చిరి బాలను
"సుందరి, పొందితివి నీవు సుగుణముల సిరుల్"
బంధువుల నోట తెలియగ
నంద కుమారుడును వలచెనాలిగ సుదతిన్
వన్నెల బంగరు తల్లికి
కన్న డుదగినపతి యనుచు గఱపిరి యాప్తుల్
మన్నింపలేదు రుక్మిణి
యన్నౌ రుక్మి , వలదనెను యఙ్నానముతో
కోరెను వియ్యము మిత్రుని
తో రుక్మి, వరునిగనెంచె దుష్ట నృపాలున్
కారుణ్యము, దయ చూపని
రారాజు, దనుజుడు, చేధి రాజ్యాధిపతిన్
తలపులు సోదరుని వెరిగి
కలత వడెను రుక్మిణి తనకట్టి మనువుయే
వలదని వసుదేవసుతే
నిలలోతనపతిగ తగునని దలచి వగచెన్
సోదరుని మాటల నెపుడు
కాదనడుగ నాదు తండ్రి కలలో నైనన్
నీదరికి నన్ను జేర్చుమ
నాదామోదరుకి కబురు నంపను బూనెన్
అప్రియముగ నాకీ మను
వప్రమితము నీదుబలిమి వారింపుమనెన్
విప్రుడు యగ్నిద్యోతను
డప్రకరణ ద్వారకకు వెడలె దూతవలెన్
నిలచెను ద్వారము వద్దన
నలరచు విప్రుడనెరింగి, నల్లని ఱేడున్
నలరించె విధిగ మేలౌ
బలు సత్కారముల తోడ, భక్తుని వోలెన్
దీవించెను ధ్వజి మేలుగ
గావలె కల్యాణమనుచు, కడు కూరిమిగన్
తావచ్చిన పనియేమని
నా వసుదేవసుతు డడిగె నాప్యాయముగన్
మదిలో మన్నన లెంతో
మెదలగ కృష్ణుడు పలికెను మెల్లగ నిటులన్
బుధులౌ మీరు కుశలమా?
విదితము ధర్మము నిజమగు విప్రులకెపుడున్
కనకము కైధర్మమ్ముగ
మనుట విడువరెపుడు మీరు , మాన్యులు నిలలో
ధనము దొరికినంతయె చా
లునని మెలగుదురు సతతము లోకము నందున్
ఏదేశము వారు తమరు
నాదేశించవలెమీరు,నందింతుసుమీ
కాదనక నేను సాయము
లేదుగ నాకుహృదిలోన లేమార్యులకై
యదునందనుని వచనములు
మదిదోచ ద్విజుడును చెప్పె మంచిగ వార్తన్
"హృదయమున నిన్నె వలచెను
పదములు నీవె శరణమని పంపెగ దామెన్"
అందాల బాల రుక్మిణి
వందనముల నంపె నీకు, వలచి నిను ప్రభూ
సుందరి, విదర్భ రాజుకు
నందమిడు కడపటి బిడ్డ, నలిన దళాక్షీ
రుక్మిణి సందేశము:
పామరుడా శిశుపాలుడు
నీమహిమ నెరుగని యధము నికినే రాణిన్?
స్వామీ గాచుము, నీవే
హామీ, మనువాడలేను హరివైరినిలన్
నాధా! శరణము నీమా
నీదరికి ననుగొని బొమ్ము, నీవే దిక్కున్
నీదవని యెడల వ్యర్ధము
నాదేహమ్మిలన, నిన్నె నమ్మితి స్వామీ
తపముల జేసితి నీకై
యపరిమితము గాను, నాకు యఖిలము నీవే
జపముల నంతమగుదు నే
ను, పతిగను నిలబడకున్న, నువ్వే కృష్ణా
నీరాకే రక్షగదా
నీరజనాభా! ,కొలుతును నీపదములనే
నారాయణా! ,మన దగను
గారాక్ష సవరునికి సతిగా నిలలోనన్
నేచెలులగూడివెడెలద
నాచారముగగుడికపుడుననుగొని బోవన్
నీచతురంగబలములకు
నీచాతురతకుతరుణమునీరజ నయనా
ఇది నాప్రార్థన,నీకై,
కదనమున గెలువుము నన్ను కరివర దహరీ
మదిలోనే సంశయమువ
లదు వేచెద నీ కొరకును, రావలె కృష్ణా
అగ్నిద్యోతనుని దీవెన:
తగునీకు రుక్మిణి సతిగ
నగధారి, నువె సరిజోడు నామెకు నిలలో!
జగము నలరు మీ పరిణయ
ము, గురువులుగ దీవెనలివి మోదము తోడన్
వాసుదేవుని సమాధానము
గాఢము నాయను రక్తిగ
వీడె నిదుర నాకనులను, వీడవు తలపుల్
తోడుగ రుక్మిణి గావలె
వీడిమనగ లేనునేను, విరహము లోనన్
పడతిని వేగమె బ్రోచెద
కడదేర్చెద నడ్డువడిన కరకుగ, అరులన్
అడచెదనేనురణమ్మున,
గడగడలాడుదురువారు గడ్డిప రకలై
వత్తును విధర్భ కిప్పుడె
తెత్తును రుక్మిణినినేను, తిరుగుయె లేదున్
సొత్తు నికనామె నాకున్
తుత్తునియలగుదురు నాపు తుచ్చులు, వదలన్
యిటుల పలికి వెడ లెనుగా
నటులే సైన్యమును వదలి నంద కొమరుడున్
పటిమకు సైన్యము తోడు, న
చటకుచకగను బలరాము జనె బలగముతో
రుక్మిణి నిరీక్షణ
వలచిన కృష్ణుడు రాడను
తలపుల వేగెలలనాము, తత్తర పడుచున్
కలతవడె నామె పలువిధ
ముల, గడిచెను ఘఢియలు యుగములుగ రమణికిన్
నవ్వదు గలగల త్రుళ్ళుచు
పువ్వులు ముడవదు కురులన, పొందిక బోయెన్
సవ్వడి విప్రుని దేదని
త్రవ్వుచు మదిలోన చింత, తాపము నొందెన్
పరిపరి విధములుగ మనసు
పరుగులు వెట్ట ,"వినునా, యభయ మిడునా ఆ
కరివరదుడు నాకు" , ననుచు
మరిమరి మధనవడెనామె మాధవుకొరకై
చేరి నదా నా ప్రార్థన
నారాయణుని కడకునని, నారీ మణియున్
భారముగవగచె, తల్లికి
తీరని శోకమును గూర్చి తెలుపదు బాలన్
మ : కొలిచా నీచరణమ్ము లే నెపుడు, నే గోరాను నిన్నే గదా
పిలిచా రమ్మని జాగుసేయకుము, ఓపీతాంబరా నువ్వు, నే
నలిసా, నీదరిచేరుభాగ్యమెపుడో? నా పై కృపా సాగరా
అలుకా నీకు? మరేల రావునువు? ఓఆనందమూర్తీ, హరీ !
రుక్మిణీ కల్యాణ వేడుకలు మొదలగుట
మ : కడు రమ్యంబుగ వీధులందు విరిసే కల్యాణ సంబ్రమ్ములే
నిడె దానంబులు చాల నా నృపతి, కన్నీరాయెగా రుక్మిణీ
వడిగాడ్పాయెను చల్లగాలి వలపే పంచే గదా వేదనా
కడకేధర్మము నామెపాలివరమౌ? కాలంబె తేల్చేనుగా
అగ్నిద్యోతనుని పునరాగమనము
శా: కారుణ్యంబుగ కాలమే కదుల గా గాంచేను విప్రేంద్రునిన్
మీరాకే శుభమౌగ నాకు ననెనా మీనాక్షి మోదంబుగా
సారంబే మనె రుక్మిణీ గలగలా "సందేశమేమాయెగా
నేరంబే నని కోపగించెనతడున్ నేపంపినావేదనన్?"
శా: మెచ్చాడమ్మ నినే హరీ జరుగుగా మీపెండ్లి శీఘ్రంబుగన్
నిచ్చాడమ్మ యనంతుడే కరుణతో నెంతో ధనమ్మేసుమీ
వచ్చాడమ్మ విభుండు కోరినిను నీవాడే హరీ, దల్లి, నీ
నెచ్చెల్లుండు నువన్న పద్దతిగనే నిన్నుంగొనింబోవుగా
రుక్మిణి:
తెలిపి శుభవార్త మీరున్
నిలిపి రసువులు గద నావి, నిజముగ నిలలో
సలపగలేనుగ సమముగ
నలరెడి సాయమును నేను, నమములు మీకున్
స్వయంవర వివాహ వేడుకలు:
అచ్చెరు వొందెడి యందము
మెచ్చి తమకు దక్కుననుచు, మిక్కిలి మనసై
నచ్చిన చెలి పొందుదమని
విచ్చేసిరి రాకొమరులు వేడుక గానున్
శిశుపాలుండు విడిదికే
గెశుభములిచ్చు రమణితనకే స్వంత మవన్
వశమిక రుక్మిణి తనకను
చుశరమ్ములతోనిలిచె వసుమతీ పతియున్
యదు నందనుడు నగరమున
మెదల జనులుసంతసముగ మెచ్చిరి చకగన్
మదులను దోచుహరి యితడు
సుదతికి తగుజోడి నలరె శుభముగ నిలలో
శా::
గౌరమ్మన్ గొలువంగ నాలయముకున్ కన్యామణేగెన్ తనే
ఔరా ముగ్ద వయారముల్ సొగసులున్! అచ్చేరువందారు గా
ఆరమ్యం బగు శోభగాంచి జనులే, అందమ్ముబంధమ్ముగా
మారేచూచెడివారికిన్, అలరెగా మందాకినీ, రుక్మిణీ!
అంబను వేడెను రుక్మిణి
అంబుజ నాభుడె తనపతి యవవలె ననుచున్
సంబర ముగల్గె నామెకు
"నంబిక గాచును, వరమిడు నాపన్నులకున్"
దానముల నిచ్చె విప్రుల
కానందముగాను సుదతి, కల్యాణముకై
తానొందెను దీవెనలను,
గానముల నడుమన వేడుకలు కొనసాగెన్
గుడి వెలుపల కామె వెడలె
నడెచెను పూబా లవోలె నయగారముగన్
తడబడిరి రాకుమారులు
సడలగ ధైర్యములు, పుష్ప శరఘాతమ్మే?
నయనములు వెదికె నాధుని
పయనమయె నతనికడకును పదములె వడిగా
హయములు నడుపుచు నేర్పుగ
నయన మనోహరిని జేరె నంద కొమరుడున్
రధమున రమణిని వడిగా
నధిరోహింపగను జేసెనతడు క్షణమునన్
పధమున సాగిరి రువురున్
అధికుల మనితలచు నృపులు యధములయిరిగా
అన్న బలరాము డండన
కన్నయ విజయమును పొందె కయ్యము నందున్
సన్నగిలి గిరరి వర్గము
మిన్నగ "నిలువు" యను రుక్మి మీసము గొరిగెన్
వన్నెల రుక్మిణి తనదవ
కన్నుల పండువగ జరిగె కల్యాణమ్మే
పన్నగసాయి విజయమిది
మిన్నుని జేరెనిక హర్షమె యవని లోనన్
మంగళము రుక్మిణీ పతి
సంగరమున గెలిచినావు స్వామీ నీవున్
అంగనను, వినతులు ప్రభో !
బంగరుతల్లికి, ప్రణతులె భాగ్యము మాకున్
బుద్ధినితలికట్టెరోట, బుడిబుడి నడకన్
మద్దులగూల్చెనుబాలుడు
సద్దునుసేయుచు, సురలకు శాపము తీరన్
చద్దినిగైకొనిరికృష్ణసాంగత్యమునన్
శ్రద్దగవినిననొసగునుస
మృద్దిగయన్నమును: లీల వృత్తాంతమునన్
కొన్నే, అయినా కుచేలు కుకుబేరునిగన్
మన్ననలుదక్కెనిలలో
వెన్నయెకృష్ణునిమనస్సువింతయె లేదున్
మిషమున సద్గతుల నిచ్చె మేఘశ్యామే
మిషలేని దయా సాంద్రుడు
విషమస్థితి గలుగదు నిల వెన్నుని కిడినన్
దావిధిగతులాడునిలవిధాత కరుణగన్
ఆవసుమతీపతానయె
జీవము, వసుదేవసుతుకు జేజే రవముల్!
Comments
Post a Comment