Song 1

వేయి వందనములు విఘ్ణనాయకునికి

వినతులు నీకుమావి గణనాధ

కుడుములు ప్రీతినీకు కరివదనుడివి

కరుణగనెపుడును కాచుమమ్ము

పరమశివసుతువి పాపనాశకుడివి

పరమదయగగను పాహిపాహి

గౌరీతనయునివి కలికల్మషపునాశి

గరిమ నీయుముమాకు ఘనముగాను


సిద్ది బుద్ది గణేశుడు శ్రీకరుండు

భానుకోటి శత ప్రభుడు పావనుండు 

ప్రధమపూజనొందునెపుడు పరమపూజ్యు 

నాదప్రియుడునీయునిలయానందములను


దండ ప్రణామంబుల నుతి

కొండంత గయండగ నిలు గణనాధునికిన్

ఉండ్రములు కడుపు నిండుగ

మెండుగ నుభుజించి గాచు విఘ్నాధిపుకిన్


Song 2

 కరుణకునువుపేరుకాత్యాయణీదేవి

కురిపించెదవునీవుకూర్మినెపుడు

మనసుపండునుమాకుమహిమనీదేనమ్మ

మమతలమారాణిమంచిదల్లి

ధవళకాంతులునీవిదాక్షాయణీమాత

ధన్యమౌ బ్రతుకునీదర్శనమున

కర్పూరహారతికాశీవిశాలాక్షి

కావుమమ్ములశివకామినీవు


అమ్మవునువుజనని అఖిలలోకములకు

అయ్యవారితోడు అమ్మనీవు

అమ్మశరణమీయి ఆనందదాయిని

అన్నినీవెనాకు అవనిలోన


Song3

ఆనందమువెల్లివిరియ

పానమెచేయిశివశివశివయనోమనసా

ఈనామమెఓంకారము

గానముసేయదగుభక్తిగశివుని కొరకై


మిక్కిలి ప్రీతిగ మ్రొక్కులు,

ముక్కంటికి,కోరిన వరములిడుశివునికిన్,

చక్కని సాంబునికి,యడిగిన

గ్రక్కున యక్కరను దీర్చు గంగాపతికిన్


జీవమనుకుమూలమ్మువు

నీవేగపరమశివా,యనితరకృపయెనీ

పావనలీలలుమాకై

కావుమముశివాయహేతుకకరుణ తోడన్


ఉండునటా శివుడంతట,

యండగ నిలుచునెపుడుగద యానందముగన్

కొండంతమేలు నీయుగ

మెండుగ ఈశుండెపుడు నమిత దయ గానూ



Song4


పరమ శివా నీకు పన్నగములె ఆభ

రణములు, హాలహలంబె బోజ్య 

ము ,వసతి  కైలాసము , ధరింతువుగ జింక

చర్మము, భస్మమె చందనంబు

ఏమీయ గల్గెద ఈశ్వరా యిలలోన

మనసు వినా నేమి, మనిషి నౌతి

నంది వాహనుడివి నన్ను బ్రోవుము హరా

ఆసుతోషుడివి నీ అండ నీయి




పాశ మోచనుడవు పరమేశ్వరా పాహి 

పరమ శుభకర శివ పావన చరి

తా మములను గావు త్రాహి త్రాహి యభవా

జగమె నీది ఈశ జంగ మేశ



Song 5


పరమపావన అభవ పరమశివుడా 

పన్నగా భూషణా పాహి మమ్ము

ధిమిధిమి తాండవ దీనులదేవర

దయగని మముజూచు తండ్రినీవు

నీలకంఠమునీది నిఖిలేశునీవుగా

నటరాజ నర్తించు నందముగను

సంబో సదాశివా శరణంటి నేనుగ

శాంతమూర్తీ గనీ సాకు మమ్ము 


రుద్రుడుశివుడుదురితహరుడు జగమ్ము
గాచు గరళ కంఠుడు నీలకంధరుండు
పాశమోచనడు కపర్ధి స్మధరుడు
తిత పావనమూర్తిపాపాంతకుండు


Song 6

కౌసల్య నందనా కరుణాకరావరా

సీతా మనోహరా శేష శయన

జానకీ వల్లభా జగదోద్దరా ధీర

రవికుల వర్ధనా రాఘవేంద్ర

రావణాంతక రామ రణరంగ విక్రమా

హనుమంత సేవిత అంబుజాక్ష

సుగ్రీవురక్షకా సుమనస్క శ్రీరామ

పాప భంజన రామ పాహి శ్యామ


కమ్మనైన నీ నామము కష్టములను

తీర్చు వదలక తలిచిన తీర్చు దుఖము

శ్రీలు నిడు కద నీపదసేవ రామ

తాపస వరదా తీర్చు మా తాపములను


Song 7

భక్తుల గాచును బద్దుడై కృష్ణుడు

రథమును తోలెగ రణమునందు 

గోవర్ధనంబెత్తె గోకులమునుగాచె

కాళీయు మర్ధించి గాచె జనుల 

నందకిశోరుడు  నవనీత చోరుడు 

బాలముకుందుడు మాధవుండు 

పావనచరితుడు   పాపవి మోచనుడు  

పరమహితుండితడు పాహి యనిన


అల్లరి పనులుకడు   యందము గను జేయు  

పిల్లలడగ    వెన్న   పిలిచి నీయు 

నల్లకన్నయ  యిల నడుచు రేపల్లెన 

చల్లలను కుడుచుచు  చక్ర ధారి


Song 8

మత్స్యముగ వేదముల మాధవుడు గాచెనూ

కూర్మముగ నమృతము కూరిమినిడె 

యఘ్ణ వరాహముగ అవనిని బ్రోచెగద

నారసింహముగను నాశనంబు

ఆ హిరణ్యకశిపు ఆగడము ధరణిలో

వామనుడై బ్రోచె బలినివిష్ణు

రాముడవతారమున రావణునివధజేసె

కృష్ణునిగ లీలలు కృపగజూపె


హరియు నిలుచు నెపుడు యండగ లోకమున

భక్తులకిల చింత, భయము దీర్చు

అసురతత్వములను అంతము జేయుగద

మంచివారికినిడు మంగళములు




Song9

జగములనుగన్నతల్లివి

జగదీశునిరాణినీవుజయములు మాతా 

నిగమాగములవిహారీ

నగవులనీయుదువునీవునళినదళాక్షీ


జయ హారతులు భగవతీ!

దయతో బ్రోచెడి చదువుల తల్లివి! వాణీ!

నియతిగ కొలుతుము మాతా!

నయముగ మమ్ములను జూడు,నళినదళాక్షీ!


 


వేదంబులు నీకు నెలవు     

కాదంబరివి నినుకొలుతు,కావ్యరవములన్!                     

మోదంబుల నీయుమెపుడు              

ఖేదంబును రూపుమాపి కృపతో వాణీ!


సిరులిడు లచ్చివి, నీవే

మఱుకీయుము భక్తిని హరి పదముల జేరన్ 

హరి విసిగిననూ నువుగను

కరుణగ,భక్తుల కిలనువు కలిమివి జననీ!


Song 10

వినాయక వందనము:


ఆది పూజల నందు అంబాసుతా వరా

నాదమూర్తివి విఘ్ణనాయకుడవు


ఓదయాసాగర ఓగణేశా  ఘనా

లేదాలసతనీకు లేశమైన

సాదు జనులకునీ సాయుధ్యముదొరకు

పాద ధూళియెచాలు పాపహారి


నీదాసులకు రక్ష నీదయా ద్రుక్కులు

మోదకములెనీకు ముడుపులెపుడు

సదయాకృపాశీలి శాంతా శరణమునీ

పదచరణములేను పాహిపాహి


సేవలను సేతుముగనీకు శివగణేశ

విఘ్ణములను వారించుము వేగముగను

కరుణతోమముగాచుము కమలనేత్ర

ఙ్ణానమొసగుదయగమాకు ఙ్ణానదాత

Song 11


భక్తుల బ్రోతువు భగవతీ దేవివై

కన్న బిడ్డల వలె గారముగను


లాలింతువుఒడిలో లలితాంబికానీవు 

పాలింతువు కనురెప్పవలె తల్లి

నీకటాక్షమునకు నీచలువకులేవు

సరిహద్దులుజననీ, చల్లనమ్మ


మధుర మీనాక్షిగమము గాయునీవమ్మ 

మామంచితల్లివి మాకుదిక్కు

కంచికామాక్షివైకైవల్యమిచ్చేవు

లోకేశ్వరీపాహిలోకమాత


మంగళము నీదు రూపము మానినినువు

మమ్ముచక్కగ గాంతువు మహిమనీదె

మదినిదోచుతల్లీ నీదు మమతలెపుడు

మరిమరి మురిపించునునీదు మంచితనము



భక్తుల బ్రోతువు భగవతీ దేవివై

కన్న బిడ్డల వలె గారముగను



లాలింతువుఒడిలో లలితాంబికానీవు 

పాలింతువు కనురెప్పవలె తల్లి

నీకటాక్షమునకు నీచలువకులేవు

సరిహద్దులుజననీ, చల్లనమ్మ



మధుర మీనాక్షిగమము గాయునీవమ్మ 

మామంచితల్లివి మాకుదిక్కు

కంచికామాక్షివైకైవల్యమిచ్చేవు

లోకేశ్వరీపాహిలోకమాత


మంగళము నీదు రూపము మరువలేము

మమ్ముచక్కగ పాలించు మమ్మనీవు

మదినిదోచుతల్లీ నీదు మహిమలెపుడు

మరిమరి కురిపించుము దయ ఉమా భవాని







Somg 12


inko version

విజయము లిత్తువు విజయ దుర్గా,తల్లి
వీర మాతలు గొల్చు వేల్పునీవు
మహిషాసురుని మదమడచిన దేవివి
మదులు దోచును నీదు మహిమలెల్ల
చేసితివితపము చిద్రూపిణీనీవు
చంద్రశేఖరునికి సతిగనలర 
లోకమ్ములనుగాచు లోకేశ్వరీ మాత
లేశమంతయుగూడ లేక జాగు


వందనములు నీకు పార్వతీ, భగవతీ
కొలుతుమెపుడు నిన్ను కూర్మితోడ
భక్తిగ బ్రతికెదము భారము నీదేను
మమ్ము బ్రోవు మమ్మ మంగళాంగి

Song 13

ఏడుకొండలనెక్కి ఎలుగెత్తినామంబు
పలికేముమేమిల పాహియనుచు
తలనీలములనిచ్చి తలపులందునమేము
కొలుతుమునిన్ను మ్రొక్కుగను స్వామి
జన్మధన్యమ్మౌను జగదీశ్వరామాకు
దర్శనమ్మిచ్చిన దయగతండ్రి
లడ్డూప్రసాదమ్ము రమ్యమ్ముగుండును
తీర్థయాత్రజరుగు తీయగాను

యిక్కటులను తీర్చి ప్సితములనిచ్చు
వేంకటేశ్వరునివి వినతులు ప్రభు
పాహియనినచాలు పావనమౌమేము
డు కొండలవిభొ లు మమ్ము


Song 14
సీ
సిరిసంపదల నిచ్చు శ్రీలక్ష్మిదేవివి
వరములెన్నియొనిత్తు వమ్మదయగ
పాడిపంటలను కాపాడు చల్లగనువు
పిల్లపాపలనీయు ప్రేమగనువు
ఆపదలందునయాదు యమ్మవునీవె
శక్తియుక్తులనిచ్చు చక్కనమ్మ
భక్టిభావనలిచ్చు భాగ్యలక్ష్మీదేవి
విజయములిత్తువు విజయలక్ష్మి



క్షీరసాగరమ్ముక్షేత్రమై వెలసేవు 
పద్మనాభురాణిప్రార్ధనమ్మ 
స్వామిపాదసేవ సతతమ్ముసేసేవు 
శాంతభావనిమ్ము జననిమాకు 


అష్ఠసిద్ధులన్ని అద్భుతమ్ముగనిచ్చు
విష్ణుపత్నివినువు విమల హృదయ 
వాటితోడునీయివాసనలబడని 
మంచిబుద్ధినిలనమాకుతల్లి  

తే
బిడ్డలమునీకులక్ష్మమ్మవినుముమొరలు
సుఖములన్నినీదయనిలశోభనాంగి
హరి ప్రియసఖివినీవమ్మ యాదిలక్ష్మి
పరమ పదముచేర్చుముమముపద్మనేత్రి


 Song 15

నందగోపాలుడా నవనీతచోరుడా
నయనమనోహరా నల్లనయ్య
బృందావనమ్మున బంగారుతండ్రివై
గోపమ్మలను బ్రోచు గోపబాల
రేపల్లెవాడల రేయింబగల్లునీ
లీలావినోదమే లెస్సగాను
మురళీధరా కృష్ణ మోహనాకారుడా
రాధికారాణితో రమ్మునీవు

యగ బ్రోవు మమ్ము దామోదరాహరీ
కాంత తోడుగ నువు గాంచు మయ్య
లుకు నువ్వు తండ్రి రమాత్మ నీవేను
రణమునువు నీయి క్కనయ్య


Song 16

విద్వత్తునిత్తువు విఙ్ఞానమొసగేవు
విద్యానెలవునీవు వినతులమ్మ
వాగ్దేవిగయవిద్య మ్ముజేతువుదేవి
భారతీప్రణతులు గవతినువు
రదాయినీ హంసవాహినీబ్రోవుము
శారదాంబా గావు కలజనుల
మలజురాణివి గాంచుమమ్మ దయగ
ల్లీసరస్వతీ త్రాహి త్రాహి

బుద్ధి నొసగు మాకు భువనేశ్వరీ నీవు
ముదము తోడ గొలుతుము నిను మేము
నసులోన నిలుచుమ్మ జనని నువ్వు
మ్ము వీడి పోకు మాకు దిక్కు

Song 17

Dedication of Sri Rama's Devotees

సీతారాములసేవాభాగ్యమె
వాతాత్మజుండువరముగదాల్చెను

లక్షణుడుగొలిచెలక్ష్మీపతినిల
లక్షణముతమ్ములచెలిమికిదెలుప 
పక్షముధర్మముపగిదివిభీషణు
రక్షణగోరెనురాఘవేంద్రునే


కూరిమియెదలోకొలువైగుహుడే
తీరముజేర్చెనుతిమిరాంతకుడిని
భారముమోసెనుభరతుడుదీక్షా
సారమునెరింగిస్వామికోసమై

భక్తిగవేచినభక్తశబరికే
ముక్తిమధురఫలములొసగినకీర్తి
శక్తియుడుతదేసంసేవలోన
యుక్తమవఘనతయుగములుగడచిన 

Song 18

గోవిందా! వరదా ! గోపాలా! శరణము
నీవేబ్రోవుసదా నీదాసులముమేము


నీరజనయనాహరి నీకుప్రసూనమ్ములు
హారతిప్రభూనీకు ఆదుకొనుముమమ్మూ
ఆరాధింతుమునిను ఆనందముప్పొంగ
ఓరాజరాజేశ ఓభక్తహృదయేశ


తిరుమలేశాప్రభూ తీర్చుతాపమ్ములను
కరుణతోగావునువు కనికరమ్ముగనెపుడు
అరవిందదళాక్షా ఆపన్నరక్షకా
పరమాత్మాపాహీ పరంధామపాహీ


కరములనుజోడించి కైమోడ్పులిచ్చేము
వరములనునీవిచ్చు వడ్డీకాసువేల్పు
పరమముమేమెరుగము పన్నగశయనా, నిల
అరయునిన్నేమేము ఆదిమూలమ్ముగా



Song 19

అంబా!దుర్గా! ఆదిశక్తివై
ఈభువనమేలు ఈశ్వరివమ్మ 

శాంభవీనీవుశాంతమునీయీ
మాభాగ్యమునువుమాతాజననీ
నేభక్తిగకొలుతునిన్నేతల్లీ
శ్రీభద్రకాళిశ్రేయమ్మునీయీ 

కంచికామాక్షిగాచుముతల్లీ 
వాంచితార్ధములువరముగనీయీ
పంచేవుసుఖముపద్మాక్షినీవు
గాంచుమమ్మునువుకరుణతోనెపుడు


మధురమీనాక్షిమాకన్నతల్లి 
కదిలిరావమ్మకల్యాణివేగ 
మదిలోనిలుచుముమందారవల్లి
సదానినుతలతుశర్వాణినేను


Song 20
సీ :
అలిమేలు మంగమ్మ అందుకోవమ్మ ఈ
నీరాజనమ్ములు నీరజాక్షి
పాలించునీవమ్మ పసిబాలలను జేసి
లీలావినోదివై లెస్స గాను
వెంకటేశునిరాణి వేడెదము జనని
మంగళములనీయి మాకు తల్లి
వాత్సల్యమును జూపు వరముల కురిపించు
భక్తజనాళికి భయము బాపు

ఆ :
దిగు తిరుపతినున్న దిక్కు నీవే మాకు
నవ్వుల సిరినీయి నయము మీర
దయగ గనుము మమ్ము దాక్షిణ్యముగ గాయి
హరి ప్రియ సఖి నీవు హారితిగొను

Song 21

సీతారామా! స్వామీ ! శ్రీవల్లభానమామీ
వాతాత్మజసంసేవిత  పావనమూర్తీ! పాహి 

నీలమేఘశ్యామా ఓ, నీరజనయనా రామా 
కాలాంతకా ఘన ఘోరాంతకా భక్తజనరక్షకా
శ్రీలక్ష్మీకాంతా ఆశ్రితపారిజాతమా, మా
ఆలంబననీవే రామా , కృపామృత సాగరా 

వేదములసారమునీవె విధివిలాసమె నీ లీల
నాదబ్రహ్మవుస్వామీ నువె, నారాయణా వామనా
ఆది యంతములు నీవే, అనంతశయనా, అచలా
నీదు మహిమెన్న గలమే? నీవే కలవు యంతటా

కారుణ్య ధామా మమ్ము  గాచే పరంధామా 
తారకమ్మునీనామము, తండ్రీ, భక్త వత్సలా
భారమ్ము నీదే, మాకు భాగ్యము నీవే,  దైవమా 
శ్రీరామా కొలుతుము నిను   శ్రీధరా ఓ ప్రధాతా            

Song 22
అభివందనములు ఆంజనేయునికి
అభివందనములు ఆంజనేయునికి


కాయముపెంచెను కదమ్ము త్రొక్కెను
వాయుపుత్రుండు వరణము దాటెను
సాయము వచ్చిరి స్వయముగ సురలే
ఆయువు దీరెను అసురలకేనిల

లంకకుజేరెను లంఖిణిగూల్చెను
శోకముదీర్చెను సుందరవాక్కుల
పంకజనేత్రికి పరమపావనికి
అంకుశమాయెను అక్షకుమారుకె


ఏమాతేజము ఎనలేనిదీక్ష
ఆమోదించెను అవనీ పుత్రిక
రామునిబంటుగ రాజిల్లె హనుమ
స్వామికార్యమును సాధించెనుగా  



Song 23

నారాయణా నీవు నయముగనను బ్రోవుము 
నారాయణా నీవు నయముగనను బ్రోవుము 

పాపనాశనా నా పాలిదైవమై నువు
తాపముహరియింపుము దయనేకురిపించుము 
నీపాదపద్మముల నేవిడువను స్వామీ 
ఓపన్నగశయనా ఓంకారహేతువా 

జయమ్ములు నీకు దను జాంతకా విధాతా 
జయవిజయమ్ములు జయ జయదేవా నీకు య
భయమ్ము నొసగము నువు భక్తపారిజాతా 
స్వయంభువా వరదా స్వామీ స్వయం ప్రభా 

జీవమునిత్తువు ఓ జీవేశ్వరా నీవు 
పావన చరితా మము పాలించు జగదీశ 
దైవమా శరణమ్ము  దామోదరా హరీ 
శ్రీవల్లభా నీవు శ్రేయమ్ము నీయుమా  


Song 24
ముకుంద కృష్ణుండు మోహన మాధవుడు
సఖుండు దామోదర కేశవుడు హితుండు 

లలిత లలిత సుందర రవళీ
చిలుకు మరులు మోహన మురళీ
అలంకృత మృదు పాద యుగళీ 
అలరునా శిఖి పింఛ మౌళీ

పదమంజీరములు తుళ్ళును కేళిగ 
ఎదలు అదమరచి రంజిలు హాయిగ 
పదముల నొలుకు హొయలు మేలుగ
మదిలో మెదలు లయలు మధురముగ    

వెలుగు నయనముల తేజో దీప్తి 
అలసిన మనసులకు తీరు ఆర్తి
కలుగు కరుణామృతమ్ము ప్రాప్తి
నిలుచు హృదిలో కృష్ణుని ప్రీతి

Song25

యగ జగము గాచు దామోదరుండైన
ర్మమూర్తి విభుడు నుజవైరి
మోదము నిచ్చును మోక్షప్రదాతైన
మోహన కృష్ణుడు మురహరుండు
దాసుల బ్రోచు నం కుమారుడైతాను
రణీ ధరుండు విధాతశౌరి
రాధా రమణుడు నారాయణుండజితుడు
విచంద్రనేత్ర పరాత్పరుండు

రివరదుడు ఘనుడు రుణాలవాలుడు
రుడ వాహనుండు లవిదారి
ద్మనాభుడు హరి న్నగ శయనుడు
క్తజనుల పాలిద్రమూర్తి

చిత్రమునీలీలుహరీ
పత్రముతోయముఫలములెభక్తిగ నిడినన్
పుత్రులమనినీవిచ్చు, ప
విత్రముగసకలసుఖములు, వేణువినోదా

వెన్ననుముద్దుగపెట్టెను
న్నానీకైయశోదడుకూ రిమిగన్
న్నునునీవేతింటివి
చిన్నికరములనిడివడిగ, చిలిపిగ కృష్ణా

చద్దులు ముద్దుగ చవిజూచు బాలుడు
మద్దులే గూల్చెగా మహిమ గాను
వేణువూదిన గోప విధిగగోవర్ధన
మ్మేమోసిగోకులమ్మేలినాడు
వెన్నదొంగే ఐన, వింతగమన్నును
తినెను గా ధరణీపతే సొగపుగ
భక్తులమదిదోచు భాధలన్నీదీర్చు
అసురాధముల గూల్చి యడచి బ్రోచు

అమృతమునుచిలికుచుఆనందమునుపంచు
బాలకృష్ణులీలభళిగనెపుడు
పాపములనుబాపుపరమాత్మకధలను
వినెడిభాగ్యమెపుడువిడువరాదు

మృతమునుచిలికుచునందమునుపంచు
బాలకృష్ణులీలళిగనెపుడు
పాపములనుబాపురమాత్మకధలను
వినెడిభాగ్యమెపుడువిడువరాదు

రాధా కృష్ణా దీనా
నాధా స్వామీ సవినయ నమములు నీకున్
మాధవ ప్రభూ కొలుతుము ని
నే, దనుజారి హరి పాహి నీరజనాభా

ఏటిదరినపంచెచెలిమి
నీటినతేలుకమఠములు,నెగురు విజములే
సాటిచెలికాండ్రు,కోరవు
కోటివరమ్ములవిచాలుకూసింత కూడే

అక్కుననిలిచెశునకముకు
మక్కువతోచిట్టిపాప,మరచిజగమునే,
దక్కెనుభాగ్యమనుకొనుచు.
చక్కనిచిన్నారి,చూడచకనిమమతగా

క్కుననిలిచెశునకముకు
క్కనిచిన్నారి, చూడకనిమమతతో
క్కెనుభాగ్యమదేమో?
క్కువతోచిట్టిపాప, రచెజగమునే

అంముగవిరిసిహరివి
ల్లంరికుల్లాసమునిడిరంజిప జేసెన్
సుంరమీదృశ్యముమన
డెంముగోదావరమ్మొడినతేలెగదా


రామచంద్రుడుహరిఘుకులతిలకుడు
రావణాంతకపరబ్రహ్మమిలన
మణిసీతామనోమలోకపావని
రామునిపట్టపురాణి, జనని
రాజశేఖరుడైనరామభద్రునిధీటి
రామభక్తులపాలిత్నమేను
మ్యముదివ్యముమణీయకావ్యమౌ
రామకధచిలుకురాగసుధలు

ధురమైరామనామముదినిదోచు
మంచిగంధపరిమళమ్మునసులోన
హిమలెన్నలేమెపుడునురువలేము
మాధవునినామ స్మరణమె మంత్రమౌను

సీ:రామచంద్రుడుహరిరఘుకులతిలకుడు
రావణాంతకపరబ్రహ్మమిలన
రమణిసీతామనోరమలోకపావని
రామునిపట్టపురాణి, జనని
రాజశేఖరుడైనరామభద్రునిగాధ
రామభక్తులపాలిరత్నమేను
రమ్యముదివ్యమురమణీయకావ్యమౌ
రామకధచిలుకురాగసుధలు

తే:మధురమైరామచరితముమదినిదోచు
మంచిగంధపరిమళమ్ముమనసులోన
మహిమలెన్నలేమెపుడునుమరువలేము
మాధవునిలీలల స్మరణ మంత్రమేను


నారాయణీ,గౌరి,నాగభూషణురాణి
నేరములెంచకునీవుజనని

cha 1:
పాయసాన్నము పిండివంటలు, మధురమౌ
లములనొసగేముక్తిమీర
తెల్లనిమల్లెలుతెచ్చినీపదముల
నర్చింతుమోతల్లినందముగను

cha 2
ప్రియజననీనీవుప్రీతితోనెపుడుమా
పిల్లవారినిగాచు ప్రేమతోడ
సౌభాగ్యసౌశీల్యసంపదేమాకిచ్చి
పసుపుకుంకుమలుకాపాడుతల్లి


cha 3:
నిరతమునినుసేవింతుమునీరజాక్షి
కరుణనుకురిపించుదయగకనకదుర్గ
చల్లనమ్మవుకామాక్షిసంతసించి
బ్రోవుమమ్ము శ్రీమాతవై భువనమందు


పుట్టితిమొకేతలియొడిన
చెట్టాపట్టాలువేసిచెట్టులు పుట్టల్
జట్టుగతిరిగితిమిమనము
గట్టిగమెదలుమదిలోనకలిమిగ నేడున్

చెల్లినినాకుచెబితివిగ
అల్లిబిలికధలనుచాలయక్కున జేర్చిన్
అల్లరిచేసితిమికలిసి
చల్లగహాయిగనుగడిచెసమయము మనకున్

అన్నామనయనుబంధము
మిన్నగనలరవలెగల్గిమిక్కిలి మమతన్
కన్నులకువెలుగువైనువు
అన్నింటనిలిచెడి యండవాత్మీయుడివిన్

నీకైదైవమునుగొలిచి
పాకముతీయనిదిచేసిఫలములొసగితిన్
ఆకరుణావరునికరుణ
నీకైకురువవలెననుచు నే మ్రొక్కితిగా

ఈరక్షాబంధమునీ
కారోగ్యధనములనిచ్చిగాచవలెసదా
కారుణ్యసింధువైన
ట్టారఘురాముదయనీయెడనిలుచునెపుడున్


varalakshmi
రలక్ష్మివి జననీ! వందనములిడేము
శ్రావణమునభక్తి శ్రద్ధ గల్గి
దేవీవిరాజిల్లి దివ్యముగానీవు
పూజలుగైకొనీ పుణ్యదినము
మ్మాదయగగను నందవల్లివి
ఖిలమునీకృపేవనిలోన
యనమనోహరీళినదళాక్షివి
మామొరలనువినిమ్ముగాచు


దిలక్ష్మివినువు అందాలభరిణవు
శ్రితులను బ్రోచె మ్మనీవు
సిరులుసంపదలను శ్రేయమ్మునిత్తువు
మ్రొక్కులందుమావిముదముతోడ

సరస్వతీ ప్రార్ధన
శ్వేతాంబరధరీసువిద్యాప్రసాదినీ
పుస్తకధారిణీపూజసేతు
వాగీశ్వరీదేవివాణీనమమునీకు
శారదానినుగొల్తు శ్రద్దతోడ


బ్రాహ్మీనిరంజనీ రాగస్వరూపిణీ
వంధ్యామహాశ్రయా వందనములు
శ్రీప్రదా సౌమ్యా సురేఖా సరస్వతీ
చంద్రికాభోగదా రణమమ్మ

నా
దమునీదివీణాపాణివిజననీ
వేదవల్లీనీకువినతితల్లి
పమాలదాల్చెడివరాలివేనీవు
లపులందుననిల్వుయగమాత

రమహంసలునీకుపాదదాసులుతల్లి
సురలుగొల్తురునినుశోభనాంగి
వసాగరంబున డియున్నననుగావు
రదేవతానీవెపాహినిడుము  

భారతీ దయగొను వాంచితదాయినీ
ర్వసుఖకరీ ప్రన్నవదన
గవతీనినమితక్తిగసేవింతు
పాదపద్మముకడపాదునీయి


న్నపూరణితల్లి ధారహేతువా
వనీజనులగాయు దిశక్తి
న్నపూరణితల్లి ద్యంతములునీవె
అంబాభవానీజయంబునీకు
న్నపూరణితల్లి ఖిలాండనాయకీ
విశ్వనాధునిరాణివినతులమ్మ
న్నపూరణితల్లి నందదాయకీ
వందనములునీకు మందగమని

న్నపూరణితల్లి అంధకారముబాపు
త్మస్వరూపమా వనిలోన
న్నపూరణితల్లి నురాగమేనీవు
తిలోకసుందరీ రుణకాంతి
న్నపూరణితల్లి రవిందదళనేత్రి
రుణగగాంచుమో లవిదారి
న్నపూరణితల్లి మితమునీదయ
ర్వేశ్వరీ దేవి రణమమ్మ

అంజలిడెదునీకు అన్నపూరణితల్లి
ఆదుకొనుమునీవె అన్నిట నను 
భక్తిగకొలుతునిను పరమేశ్వరీఉమా
ముక్తినొసగుమమ్మ ముదముగనువు

పరబ్రహ్మరూపిణీపంచప్రణవవాసినీ
శ్రీరాజరాజేశ్వరీశ్రేయోదాయినీ 

నిఖిలవిద్యేశ్వరీనిరంజనీనిరుపమా
లోకశోకనాశినీలోకేశ్వరీపాహిమాం 
సకలహితకరీసర్వసంపత్కరీ
క్షేమకారిణీక్షేత్రపాలినీపాహిపాహి

సర్వమంగళప్రదాసమస్తశుభప్రదా 
పురాణాగమసన్నుతాపుణ్యఫలదా
లోకనాయకీబాంధవీపాలించుమమ్ము 
విశ్వాధారీవిశ్వకర్మిణీవినతులమ్మ 

పరమేశ్వరీజగదీశ్వరీపరమాత్మికా
అనంతకృపాబ్దీఆదిశక్తీఆదుకొనుము
పరమానందదాయినీప్రణతులమ్మ
సర్వార్ధసాధినీశాంతమూర్తీశరణమమ్మ

సీ:
రమాత్మికాదేవిశుపాశమోచినీ
శ్రీరాజరాజేశ్వరీ అనుపమ
నిఖిలవిద్యేశ్వరీనిరుపమానిర్మలా
లోకశోకవినాశిలోకరక్ష
కలహితకరిణీర్వసంపత్కరీ
రాగస్వరూపసుమునివంద్య
ర్వమంగళదాయిర్వశుభంకరీ
నిగమాగమాది ప్రణిత అనన్య

సీ:
బాంధవీనాయకీక్తవరప్రదా
విశ్వకర్మిణినీకువినతులమ్మ
రమేశ్వరీసర్వపాపనాశీశుభా
శ్రీకరుణాసాగరీప్రణతులు
రదేవతానమోరమశాంతానమో
భార్గవీభగవతీభావగమ్య
నందభోగినీశ్రితవత్సలా
శ్రీలలితాంబికాశ్రియమునీయి


తే:
యోగనాయకీశ్రీరమాయోగవశ్య
శ్రేయసీ శ్రీఫలీశచీ శ్రీకృపాబ్ది
శ్వరీ శ్రుతిసన్నుతా లుమమ్ము
శాంకరీభైరవీనీవెరణమమ్మ


విజయము మాకిమ్ము విజయ దుర్గా, తల్లి
క్తిగాగొలుతుమో క్తిగమ్య
హిమాన్వితాతల్లి హిషాసురాంతకీ
మ్మా శివానీ ఉమా భవాని
చంద్రశేఖరురాణి చండీ శచీ మాత
చిద్రూపిణీ దేవి చిత్ప్రకాశ
లోకమ్ములనుగాచు లోకేశ్వరీ దేవి
దయా కృపాశీలి క్తిరూప


దుర్గతినాశినీదురితనివారిణీ
గౌరీత్రయంబికేగావుమమ్మ
పాపసంహారిణీ ద్మాక్షిషోడశీ
శాంభవీపాహిపాశాంకుశధరి
ల్మషదూరాదుహరీసుజనపాలి
ద్గతిదాయినిత్యవాణి
ప్రణవస్వరూపిణీప్రణతులునీకమ్మ
తితపావనమునీపాదధూళి

వందనములు నీకు పార్వతీ, భగవతీ
కొలుతుమెపుడు నిన్ను కూర్మితోడ
క్తిగ బ్రతికెదము భారము నీదేను
మ్ము బ్రోవు మమ్మ మంగళాంగి


జయముమహిషమర్ధినీశైలపుత్రీవిధాత్రీప్రియేవిశ్వసమ్మోహినీవింధ్యశృంగేశ్వరీ
జయముమహిషమర్ధినీచంద్రమౌళీసతీవిష్ణుపత్నీఅసంఖ్యాపురంధ్రీస్థిరాకారణా
జయముమహిషమర్ధినీదుర్ధరాఘాతినీదుర్ముఖాలంభినీహర్షిణీదుర్మదాంతఃశివా
జయముమహిషమర్ధినీత్రైజగత్పోషిణీశంకరాహ్లాదినీయింద్రసంతోషిణీహాసినీ
జయముమహిషమర్ధినీదైత్యసంహారిణీనీలవేణీశచీపార్వతీశ్యామలావాసినీ
జయముమహిషమర్ధినీకేసరారూఢిదుర్గాత్రిశూలాయుధాశీర్షికాలంకృతాభార్గవీ
జయముమహిషమర్ధినీఅంధకారాంతకీభైరవీదుందుభీనాదినీశృంగశస్త్రాకరీ
జయముమహిషమర్ధినీరక్తబీజాసురాఘాతినీశుంభవిచ్చేదశక్తీనిశుంభాంతకీ
జయముమహిషమర్ధినీదీనదారిద్రనాశీదయాసంద్రమా అవ్యయాయామినీపాలినీ
జయముమహిషమర్ధినీపల్లవీమాధవీమాధురీమందహాసారవిందాసుధావర్షిణీ  



ee paata annamaachaarya keertana, raadhaa maadhava(priya sisters paadaaru)..vine untaaru..aa paaTa tune chaala baagundi, padaalu andarilO paadataaniki abhyamtaramgaa unnayi ani maa relative kotta padaalu request cheste raasaa..

బాలా త్రిపుర సుందరి అవతారము మీద పాట 

బాలా నామములతి లలితమ్మిల
విజయప్రదంబతిసుందరం 

సదయే పార్వతి సత్యా నిత్యా  
ప్రణతి సతీ క్షేమకరి  శచీ  
విభవద మదా అఘమంతౌ 
నిరతదృతా  మా నిజ త్రాతా (బాలా)    

ఘనచరిత విజయ వరదా కరుణా     
సుర వంధ్య అమోఘాహైమా  
భగవతి అనఘే దదతి విశాలం  
పరమా నందా   సరితా త్వం (బాలా)


దేవీ వితరణ శీలా సుముఖా 
ఆంబేభవతరి మాయా త్వం  
గావగ రావా పరమాత్మికగా 
శ్రీ  వైభవా ప్రణితో గౌరి  (బాలా)

హిరణ్మయి ములుకుట్ల(6474013077)  


21-10-2021
అంశం :తెలుగు భాష 

పేరు : హిరణ్మయి విశ్వనాథ్
ఊరు :టొరొంటొ కెనడ 
చరవాణి :6474013077 

శీర్షిక : మన తెలుగు భాష   

అంబా భవాని ఆశీస్సుయె అమ్మ నేర్పిన మన  తెలుగు భాష 
వాణీ  సరస్వతీ దత్తమె అమ్మ నేర్పిన మన  తెలుగు భాష  
 
పోతన భక్తిగ పలికిన భాగవతము మన తెలుగు భాష 
రాయలు శక్తిగ నిలిపిన సామ్రాజ్యము మన తెలుగు భాష
 
సజ్జనుల సాంగత్యము పంచును మన తెలుగు భాష 
స్నేహితుల సౌజన్యము పెంచును మన తెలుగు భాష

ఆత్మీయుల అనుబంధమే అందమైన  మన తెలుగు భాష 
బాంధవ్యములను పెంచుగా భవ్యమైన  మన తెలుగు భాష
 
వసంతకోకిల రావము రాగాల మన తెలుగు భాష
గులాబి రంగుల అందము తాళాల మన తెలుగు భాష

ఆవకాయల గుభాళింపు కమ్మనైన మన తెలుగు భాష
పూతరేకుల దీయదనము రమ్యమైన మన తెలుగు భాష 

చిన్నారుల కేరింతల శోభయె మన తెలుగు భాష
లాలిత్యపు లావణ్యము ప్రెమా మన తెలుగు భాష 

నయగారము లొలుకు మనందరి తెలుగు భాష
సమభావము తొలుకు మనందరి తెలుగు భాష 


త్రైజగమ్ములనేలుశ్రీలలితాంబికాత్రిపురాంతకీ
త్రాహిమాంజననీకళావతిధర్మపోషిణిసాక్షిణీ 
సర్వసంభవకారిణీశివశంకరీఅభయంకరీ
అంబికాజగదంబికాపరమాత్మికావరపూజితా 

ఓం మో లయకారిణీ స్థిర ఓం నమో సకలేశ్వరీ
ఓం మో వర ఙ్ఞానదాయిని ఓం నమో హితపోషిణీ
ఓం మో శుభ శోభనాంగిని ఓం నమో పరదేవతా
ఓం మో కరుణావరప్రద  ఓం నమో లలితాంబికా


పేరు: హిరణ్మయి ములుకుట్ల
నివాసము: టొరొంటో కెనడ  
శీర్షిక: ఉయ్యాల పండుగ
ఫ్:+16474013077
 
ఉల్లాసముగబాల ఉయ్యాలలేఊగు
అట్లారగించాక ఆడుకొనుచు
జలతారువన్నెలే జాలువారునునేడు
పట్టుపావడగట్టిపాటపాడ

పూవులుపొంగుగాపుణ్యమేమాదని
అమ్మయిజడలోన అందముగను
గజ్జెలుమోగునుఘల్లుఘల్లుమనుచు
తరుణమ్ముమాదనీతాండవించు (ఉల్లాసము)

గోరంటపండంగకోరుతుభాగ్యమ్ము
నోములేముదితలునోతురమ్మ
అందముచిలుకగ అట్ట్లతద్దెమనకై
యింతులుమురవంగయింపుగాను(ఉల్లాసము)

తెలుగుదన్నముతూగునూతీయగాను
బాలికలుఆడుదురుగసంబరముగాను
ఊహయేచాలుహాయిగా ఊయలూగ
సుదతులందరిముచ్చటశుభములీయ   (ఉల్లాసము) 

మ:
మానందకరీశివా విమల శ్రీపాదార్చితాశ్రీఉమా
దాపాహిశుభానమమ్ముసిరిసంత్కారిణీపాహిమాం
ణమ్మోహరురాణి శ్రీవిభవదాక్తీదయాసాంద్రమా
విందాక్షిభవాద్బితారిణిసదానందనృత్యేశ్వరీ


కావ్యలహరి

తేది. 29-10-2021

శుక్రవారం

అంశం : దీపావళి 

శీర్షిక : దీపావళి  వెలుగులు 

పేరు: హిరణ్మయి ములుకుట్ల 

ఊరు: టొరొంటొ కెనడ  

చరవాణి : 6474013077 

హామీపత్రం : ఇది నా స్వీయ రచన. 


దీపకాంతులలరారు దీపావళి 

దివ్యతేజోమయమీ దీపావళి 


దానవాంతకమైన దీపావళి  

సీఆపన్నులార్తిదీరెగ దీపావళి

మాధవజయకేతనమీ దీపావళి

పీతాంబరురాణికీర్తి దీపావళి

ఆపతితపావనురాక దీపావళి

అయోధ్యలోసంబరమీ దీపావళి 


ఆనందలాహిరిలన దీపావళి 

అమావాస్యతొలగించు దీపావళి

అందాలువిరబూయు దీపావళి 

శ్రీదేవిపూజావైభవమీ దీపావళి


బాణాసంచామోత దీపావళి 

తారాజువ్వలపొంగు దీపావళి 

మతాబులవెలుగు దీపావళి

భూచక్రములెతిరుగు దీపావళి 



ఆత్మీయులుగూడు దీపావళి  

పేణీలమాధుర్యమీ దీపావళి 

పెద్దపండుగమనకు దీపావళి 

సేదదీర్చునుమదిని దీపావళి



రామదూత హనుమ:


రాముడే సకలమై రాజిల్లు మారుతి

సీతారమణునికి సేవకుడిల


రామునిబంటుగ రాయబారముసేసె

అవనిపుత్రికజాడ యలవిజేసె

రామునిప్రేమను రణకుశలతనిల

తేరుకొనగసీత తెలియ జేసె


రామునికాప్తుడు రణరంగధీరుడు

జానకీమాతకు సన్నిహితుడు

రామసేవాతత్పరాయణుండితడుగ

ధరణిజకాపాడు దనుజవైరి


అంజనాసుతా మమ్ముల ఆదుకొనుము

పవనకుమరుడవుగ మాకు పాహినిడుము

సూర్యునికిశిష్యుడవునీవు శుభమునిమ్ము

రామదూతవుమము సఫలమునుచేయు


పేరు: హిరణ్మయి ములుకుట్ల

నివాసము: టొరొంటొ కెనడ

శీర్షిక: రాఘవా గావుమా

హామీ: యిది నా స్వీయ రచన




పరంధామా హరీ పావనానిధానా 

పశుపాశమోచనా పరమాత్మా స్వామీ 

రఘుకులతిలకాఓ రావణాంతక ఘనా

పాపనాశకవిభో పాలించుమామమ్ము 




సీతాప్రాణపతీ శ్రీకళ్యాణమూర్తి

చేతనాకారకా చిద్రూపా సుగుణా

రామాకృపావరా రాజీవలోచనా

కారుణ్యసింధువా కాపాడుమామమ్ము 


ఆత్మబాంధవా ఓ ఆపన్నరక్షకా

శ్రీదయాసాగరా శ్రీశ్రేయోవరదా

నారాయణా పద్మ నాభా శ్రీరక్షా

రామారమణగుణా రాఘవాగావుమా 



అలసితిని నేను అంబాసుత

పలుకరించని దొరవెనువు..


రయముగ బ్రోవుము

నయముగ పలుకుము

నియమముగనేసేవించెదా

దయనుజూపుము ధర్మము కాదిది

ప్రియముగ గావలె దర్శనము (అల)



శరణము హేరంబ

శరణము గణేశ

శరణు శరణు శ్రీవిఘ్ణేశ్వరా

పరుడను గాను నే భక్తుడ నైతిని

నిరతము చేయుదు నీ ధ్యానమే (అల)



నమో శివపుత్ర

నమో శక్తీకర

నమహ మోదకప్రియా

అమిత శ్రీవిఘ్ణాధిప యినా

శ్రమ ఎల్లను నీ సేవార్ధమే (అల)


స్తోత్రమ్ముజేసేము శోభనాంగీనిను
దురితనివారిణీ దుఃఖ హారి
పూజలందుమునీవు పుణ్యప్ర దాఉమా
భోగప్రదాయినీ ముక్తి దాయి
త్వమునేర్పేవు రినిజేర్చేవు మా
ప్పిదములకోర్చు ల్లివినువు
ధ్యానమ్ము నీదయే దాక్షాయ ణీ మాత
ల్పవల్లీదేవిరుణనేలు

తితపావనీఅర్ణపాహినిడుము
హపరములనొసగె శ్వరినువు
సిడిహృదయముగలపాశాంకుశధరివి
పాహినిడుముమాకుద్మ నేత్రి



సీ:స్తోత్రమ్ముజేసేము శోభనాంగీనిను
దురితనివారిణీ దుఃఖ హారి
పూజలందుముదేవి పుణ్యప్రదాఉమా
భోగప్రదాయినీ ముక్తి దాయి
తత్వమునేర్పేవు దరినిజేర్చేవు మా
తప్పిదములకోర్చు తల్లివినువు
ధ్యానమ్ము కృపజేయి దాక్షాయణీ మాత
కల్పవల్లీమమ్ముకరుణనేలు

ఆ:పతితపావనీఅపర్ణపాహిజనని
ఇహపరములనొసగె ఈశ్వరినువు
పసిడిహృదయముగలపాశాంకుశధరివి
శరణుశంభురాణిశరణుశరణు


రాగభావశోభలు
బడునాయవినొరులకువనము లేకన్?
విబడునవిమనకలముకు
సదిమౌనమునువీడినతో పలుకన్

ములవమరినకులుకుగ
దులాడునుసంతసముగమైమర చిసదా
యెలవతిసున్నితమ్మ్మై
దులునునయగారముగనువితా ఝరిలో


దివేల యూసులు దెలుప

నెలకు నొకపద్యమదియె నిజముగ చాలున్
దువరులకు కవనమ్ములు
రస సారములు ఙ్ఞానధ సాధనముల్

రాజులకోటలుగూలును
రోజులుగడచినపిదపనరోతగ మారున్
పూలుబొందుమహాకవి
రాజులమాటలెపుడునువిరాజిల విద్యల్



ఆదుకోవయ్యామమ్మో ఆపన్నరక్షకా

సాదు పుంగవ ఘన సేవితా  సర్వేశ్వరా సదా  (2)


తిరుమలరాయా దైవమా తిమిరాంతకా

దరిజేర్చుమమ్ము బాంధవా దయాసాంద్రా

చరణమ్ములకడ తావునీయి శాంతానీదు

శరణమ్ముకోరుదు శ్రీపతీ సారసాక్షా (ఆ)


కీర్తన ప్రియా గోవిందా క్లేశనాశా

ఆర్తజనపోషకా శ్రియా అనంతకృపా

ధూర్త కైవారా ధరణీ  దురితవారా

స్పూర్తిప్రదాయకా సకల శుభవరప్రదా (ఆ)


శ్రీవేంకటేశ్వరా హరీ శ్రీకారుణ్యా

పావనమూర్తీ మాంపాహి పరంధామా

వేవేలభక్తులార్తిగా వేడేరునిను

గావుతండ్రీవేగముగా గరుడగామీ(ఆ)

సీ

డుకొండలసామిలుమయ్యామమ్ము

శ్రీచిద్విలాసాపరిజనపోష
పంకజనేత్రా అరిమితా శ్రీవరా
నీకృపజూపుమానీరజాక్ష
న్యులమయ్యేముర్శించినినువిభో
దుఃఖాంతకాప్రభూదురితదూర
రమపావనమూర్తిపాపనాశకహరీ
ర్వశుభప్రదాన్నుతాంగ

తే

వేంకటాచలాధీశుడావిధివిదాత
వేయినామములస్వామివేదవినుత
వందనములాశ్రితవరదాజ్రమకుట
రవితరణాతిరుమలాద్రివాససదయ


కావ్యనాయికవేచెకానబడుదువనీ
నెలరాయరమ్మోయినీవువేగ
లరాకున్నావుక్కడున్నావోయి
కోమలాంగిమనసెకోరెనిన్ను
వంగకోకనుగట్టి లపుతలపులతో
వేగెనీకొరకుగా వేయి మార్లు
నీలిముంగురులాడెనీకొరకాశగా
నీలవేణివిరహిణినినెదలచు


కంటినీరుతానుడవలోదాచెనా?
వెంటలేవునీవు వేదనాప
జంటరమ్మువడిగ వరాలి వెతబాప
ఒంటరాయెచెలియ రడించు


సీ:

బిడదిపురీశ్వరాప్రీతిగనర్చింతు
శ్రీపదములునీవిశివపరేశ
నందగంధేశరాధ్యదైవమా
శ్రితరక్షకాదిపూజ్య
రమశివనిజరూపరాత్పరాహరా
లోనాయకిపుత్రశోనాశ
రోగ్య వరదాయ శ్వర్య దాయకా
ప్తబంధువునీవు అండనీవు

ఆ:

క్తిపాతమిచ్చుశంకరాభైరవా
రణు స్వామి శరణు త్యదేవ
రుణకునువురూపుకైవల్యవితరణా
మానససుమములివిమాతృమూర్తి

నిదురపోమాతండ్రినీవుసల్లంగా

నిదురపోమాబాబునీవుహాయిగా


ఆటలాడినావు అలసిసొలసినావు

నేటికికచాలించి నీవుశయనించు

గోరుముద్దలారంగించాకగోముగానీవు

గారాబుసేయకోకన్నయ్యపవళించననీ


నీలాలనింగిలోమెరిసేనాతారకలు

జాలమదేలనీకుజామురాతిరిలోన

పండువెన్నెలనీకు పట్టుపానుపుగా

కొండగాలివీచె కొలనుదరిలోన 


నిదురించుమా అదమరచి నిండుగా నీవు

నిదురలోనెదిగేవుబంగారుకొండా

శ్రీరామాచంద్రుడేనిన్నుగాచేను

మారామదియేలమాకంటిపాప


Song


వేయివందనములు విఘ్ణరాజానీకు(2)


మూషిక వాహనా మునిజన సేవితా

పరమపదమునీదు పదముతండ్రి

పతితపావనమూర్తి పరిజన పోషకా 

నీయండ మాకీయి నీరజాక్ష(వేయి)



గౌరీప్రియతనయా కలికల్మషపునాశ

గరిమ నీయుముమాకు ఘనముగాను

భానుకోటిశతప్రభాభక్తబాంధవా

పరమదయగగను పాహిపాహి (వేయి)



Song

సీ:

వందే ముకుందా భతరీ హరీ పాహి
నందదాయి అవ్యాజ కరుణ
నంద గోపాలుడా యన మనోహరా
న మేఘ శ్యామా అణిత సుగుణ
క్త మందారా అయవరదా నమో
శ్రీపతీ సర్వేశ శ్రీవిలాస
దామోదరా ముక్తి  దాతా సకలశుభా
రాధికా వల్లభా రంగ నాధ


ఆ:

మాధవా శరణము దనాంతకా త్రాహి

నిన్ను నమ్మి నాను నియతి తోడ
పాప పుణ్య రాశి పాదార్పితము సేతు
ర్శనమ్ము నీయి యగనీవు



paaTa:

ఉరుకులు తీయుము ముందుకు మున్ముందుకు

వడివడిగా అలుపేలేక  జడువక విడువక ఓ మనసా(2)


వరములు కురిపించు తెగువ సుమీ

పరుగున పోవు అశుభములవియే

పండుగె నీదౌ విజయమె నీదౌ 

ధరలో పడకుము భయమను చెరలో

ఘనుడవునీవే చింతలు యేలా?  (ఉరు)


పరమార్ధమున్న చాలును గా 

సరుగున నీకొచ్చు కొత్త శక్తుల్ యుక్తుల్ 

పొరబడకుమా అశక్తుడనని

హరుడవు నీవే శివుడవు నీవే  (ఉరు)


ఉల్లాసమేహాయిగాఉయ్యాలయైఊగేనులే

అట్ట్లారగించేరులేఆటలేపాటలై


వెన్నలమ్మతానేవన్నయై

జలతారుపావడాగట్టేనులే


అమ్మయిజడలోనపూవులే

అందమైఒదిగేనులే


భాగ్యమేపండంగగోరంటయై

నోములేనోచేరులే 


ఇంతులేపూబంతులై యింపుయై మురిసేరులే  



సీ

ఏడుకొండలసామిఏలుమయ్యామమ్ము

శ్రీచిద్విలాసాపరిజనపోష

పంకజనేత్రా అపరిమితా మాపైన

నీకృపజూపుమానీరజాక్ష  

ధన్యులమయ్యేముదర్శించినినువిభో

దుఃఖాంతకాప్రభూదురితవార

పరమపావనమూర్తిపాపనాశకహరీ

సర్వశుభప్రదాసన్నుతాంగ 


తే

వేంకటాచలాధీశుడావిధివిదాత

వేయినామములతండ్రివేదవినుత

వందనములాశ్రితవరదావజ్రమకుట

వరవితరణాతిరుమలాద్రివాసపాహి


సీ

ఘుకుల తిలకా వరా లోక శుభకరా
రామా వరప్రదా రాక్షసారి
రమదయాకరా రసుగుణప్రభా
రవిందదళనేత్ర ర్తరక్ష
భువనేశ్వరాప్రభోభూరికృపాంబుధీ
క్తహృదయవాస యవిదారి
శరధతనయా చిదానందదాయకా
ర్మవ్రతాహరీ త్రాహి త్రాహి


ఆ:

రుణకు నువుపేరు కౌసల్య ప్రియసుతా
గాంచుమమ్ముతండ్రి నికరముగ
ముక్తిపదమునజను మోదము గోరేము
రణము నిడు స్వామి సార సాక్ష


Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3