ఉత్తమముగ సాగవలెను
క్రొత్త వసంతము, శుభములుగూడవలెనిలన్
సత్తువ, కూరిమి, యనబడువిత్తము లొందవలె మనము విరివిగ యెపుడున్
వేదముల నెలవై వేదాంతముతెలిపి
జ్ఞానమొసగుభూమిజగతిలోన
భక్తవరేణ్యులపాదమ్ములనుమోయు
పుణ్యభూమిమనదిభువనమందు
ముక్తిపధమునుండుమునులతపమ్ముల
గాంచినచారిత్రగాధమనది
జ్ఞానమొసగుభూమిజగతిలోన
భక్తవరేణ్యులపాదమ్ములనుమోయు
పుణ్యభూమిమనదిభువనమందు
ముక్తిపధమునుండుమునులతపమ్ముల
గాంచినచారిత్రగాధమనది
నాదతరంగాలునడయాడుముదముతో
నటరాజుకొలువుండునందముగను
పలుభాషలకొలువుపలుకళలకుతావు
సాహిత్యసంపదేస్వంతమవుగ
సాంప్రదాయముగాచుచల్లగ యీభూమి
సంస్కృతినిలుచునుసతతమిచట
నటరాజుకొలువుండునందముగను
పలుభాషలకొలువుపలుకళలకుతావు
సాహిత్యసంపదేస్వంతమవుగ
సాంప్రదాయముగాచుచల్లగ యీభూమి
సంస్కృతినిలుచునుసతతమిచట
పాడిపంటలతూగుపచ్చనిమనభూమి
అన్నపూర్ణయెగదాయవనిలోన
అన్నపూర్ణయెగదాయవనిలోన
మమతలెన్నోపంచుమాతృభూమిమనకు
పిల్లపాపలలరిపెరుగుభూమి
పిల్లపాపలలరిపెరుగుభూమి
శాంతివాంచించుతగదనుసమరములను
కర్మభూమియైయిలననాకముగనలరు
వందనములుభారతమాతపదములకును
పూర్వపుణ్యమేనీయొడిపుట్టినాము
కర్మభూమియైయిలననాకముగనలరు
వందనములుభారతమాతపదములకును
పూర్వపుణ్యమేనీయొడిపుట్టినాము
బంగారుభూమిమనదే
గంగాజలములుపదములుకడుగగ యలరున్
శృంగారముగహిమాద్రియె
పొంగినహృదయమునుగల్గిపొగడుదు ధాత్రిన్
వీరజవానులెగాతురు
శూరులత్యాగములనెపుడు;శుభములు నిలుపన్
ధీరజనులై;నిలుచుగం
భీరముగయణుశక్తిగల్గిభీతియె లేకన్
ముక్తిపధమ్మునుతెల్పును
భక్తికినెలవీధరణియె,భారతమనినన్
శక్తియుతశాంతి,ధార్మిక
వ్యక్తులవనిలో న వెలుగు భారత పుత్రుల్
భారతమాతపదములకు
నీరాజనమ్ములనిత్తునేవి నయముగన్
భారతరత్నములకునా
జోహారులనిచ్చెదనెపుడుజేగం టలతో
Comments
Post a Comment