Song 1
వేయి వందనములు విఘ్ణనాయకునికి
వినతులు నీకుమావి గణనాధ
కుడుములు ప్రీతినీకు కరివదనుడివి
కరుణగనెపుడును కాచుమమ్ము
పరమశివసుతువి పాపనాశకుడివి
పరమదయగగను పాహిపాహి
గౌరీతనయునివి కలికల్మషపునాశి
గరిమ నీయుముమాకు ఘనముగాను
సిద్ది బుద్ది గణేశుడు శ్రీకరుండు
భానుకోటి శత ప్రభుడు పావనుండు
ప్రధమపూజనొందునెపుడు పరమపూజ్యు
నాదప్రియుడునీయునిలయానందములను
దండ ప్రణామంబుల నుతి
కొండంత గయండగ నిలు గణనాధునికిన్
ఉండ్రములు కడుపు నిండుగ
మెండుగ నుభుజించి గాచు విఘ్నాధిపుకిన్
Song 2
కరుణకునువుపేరుకాత్యాయణీదేవి
కురిపించెదవునీవుకూర్మినెపుడు
మనసుపండునుమాకుమహిమనీదేనమ్మ
మమతలమారాణిమంచిదల్లి
ధవళకాంతులునీవిదాక్షాయణీమాత
ధన్యమౌ బ్రతుకునీదర్శనమున
కర్పూరహారతికాశీవిశాలాక్షి
కావుమమ్ములశివకామినీవు
అమ్మవునువుజనని అఖిలలోకములకు
అయ్యవారితోడు అమ్మనీవు
అమ్మశరణమీయి ఆనందదాయిని
అన్నినీవెనాకు అవనిలోన
Song3
ఆనందమువెల్లివిరియ
పానమెచేయిశివశివశివయనోమనసా
ఈనామమెఓంకారము
గానముసేయదగుభక్తిగశివుని కొరకై
మిక్కిలి ప్రీతిగ మ్రొక్కులు,
ముక్కంటికి,కోరిన వరములిడుశివునికిన్,
చక్కని సాంబునికి,యడిగిన
గ్రక్కున యక్కరను దీర్చు గంగాపతికిన్
జీవమనుకుమూలమ్మువు
నీవేగపరమశివా,యనితరకృపయెనీ
పావనలీలలుమాకై
కావుమముశివాయహేతుకకరుణ తోడన్
ఉండునటా శివుడంతట,
యండగ నిలుచునెపుడుగద యానందముగన్
కొండంతమేలు నీయుగ
మెండుగ ఈశుండెపుడు నమిత దయ గానూ
Song4
పరమ శివా నీకు పన్నగములె ఆభ
రణములు, హాలహలంబె బోజ్య
ము ,వసతి కైలాసము , ధరింతువుగ జింక
చర్మము, భస్మమె చందనంబు
ఏమీయ గల్గెద ఈశ్వరా యిలలోన
మనసు వినా నేమి, మనిషి నౌతి
నంది వాహనుడివి నన్ను బ్రోవుము హరా
ఆసుతోషుడివి నీ అండ నీయి
పాశ మోచనుడవు పరమేశ్వరా పాహి
పరమ శుభకర శివ పావన చరి
తా మములను గావు త్రాహి త్రాహి యభవా
జగమె నీది ఈశ జంగ మేశ
Song 5
పరమపావన అభవ పరమశివుడా
పన్నగా భూషణా పాహి మమ్ము
ధిమిధిమి తాండవ దీనులదేవర
దయగని మముజూచు తండ్రినీవు
నీలకంఠమునీది నిఖిలేశునీవుగా
నటరాజ నర్తించు నందముగను
సంబో సదాశివా శరణంటి నేనుగ
శాంతమూర్తీ గనీ సాకు మమ్ము
రుద్రుడుశివుడుదురితహరుడు జగమ్ము
గాచు గరళ కంఠుడు నీలకంధరుండు
పాశమోచనడు కపర్ధి భస్మధరుడు
పతిత పావనమూర్తిపాపాంతకుండు
Song 6
కౌసల్య నందనా కరుణాకరావరా
సీతా మనోహరా శేష శయన
జానకీ వల్లభా జగదోద్దరా ధీర
రవికుల వర్ధనా రాఘవేంద్ర
రావణాంతక రామ రణరంగ విక్రమా
హనుమంత సేవిత అంబుజాక్ష
సుగ్రీవురక్షకా సుమనస్క శ్రీరామ
పాప భంజన రామ పాహి శ్యామ
కమ్మనైన నీ నామము కష్టములను
తీర్చు వదలక తలిచిన తీర్చు దుఖము
శ్రీలు నిడు కద నీపదసేవ రామ
తాపస వరదా తీర్చు మా తాపములను
Song 7
భక్తుల గాచును బద్దుడై కృష్ణుడు
రథమును తోలెగ రణమునందు
గోవర్ధనంబెత్తె గోకులమునుగాచె
కాళీయు మర్ధించి గాచె జనుల
నందకిశోరుడు నవనీత చోరుడు
బాలముకుందుడు మాధవుండు
పావనచరితుడు పాపవి మోచనుడు
పరమహితుండితడు పాహి యనిన
అల్లరి పనులుకడు యందము గను జేయు
పిల్లలడగ వెన్న పిలిచి నీయు
నల్లకన్నయ యిల నడుచు రేపల్లెన
చల్లలను కుడుచుచు చక్ర ధారి
Song 8
మత్స్యముగ వేదముల మాధవుడు గాచెనూ
కూర్మముగ నమృతము కూరిమినిడె
యఘ్ణ వరాహముగ అవనిని బ్రోచెగద
నారసింహముగను నాశనంబు
ఆ హిరణ్యకశిపు ఆగడము ధరణిలో
వామనుడై బ్రోచె బలినివిష్ణు
రాముడవతారమున రావణునివధజేసె
కృష్ణునిగ లీలలు కృపగజూపె
హరియు నిలుచు నెపుడు యండగ లోకమున
భక్తులకిల చింత, భయము దీర్చు
అసురతత్వములను అంతము జేయుగద
మంచివారికినిడు మంగళములు
Song9
జగములనుగన్నతల్లివి
జగదీశునిరాణినీవుజయములు మాతా
నిగమాగములవిహారీ
నగవులనీయుదువునీవునళినదళాక్షీ
జయ హారతులు భగవతీ!
దయతో బ్రోచెడి చదువుల తల్లివి! వాణీ!
నియతిగ కొలుతుము మాతా!
నయముగ మమ్ములను జూడు,నళినదళాక్షీ!
వేదంబులు నీకు నెలవు
కాదంబరివి నినుకొలుతు,కావ్యరవములన్!
మోదంబుల నీయుమెపుడు
ఖేదంబును రూపుమాపి కృపతో వాణీ!
సిరులిడు లచ్చివి, నీవే
మఱుకీయుము భక్తిని హరి పదముల జేరన్
హరి విసిగిననూ నువుగను
కరుణగ,భక్తుల కిలనువు కలిమివి జననీ!
Song 10
వినాయక వందనము:
ఆది పూజల నందు అంబాసుతా వరా
నాదమూర్తివి విఘ్ణనాయకుడవు
ఓదయాసాగర ఓగణేశా ఘనా
లేదాలసతనీకు లేశమైన
సాదు జనులకునీ సాయుధ్యముదొరకు
పాద ధూళియెచాలు పాపహారి
నీదాసులకు రక్ష నీదయా ద్రుక్కులు
మోదకములెనీకు ముడుపులెపుడు
సదయాకృపాశీలి శాంతా శరణమునీ
పదచరణములేను పాహిపాహి
సేవలను సేతుముగనీకు శివగణేశ
విఘ్ణములను వారించుము వేగముగను
కరుణతోమముగాచుము కమలనేత్ర
ఙ్ణానమొసగుదయగమాకు ఙ్ణానదాత
Song 11
భక్తుల బ్రోతువు భగవతీ దేవివై
కన్న బిడ్డల వలె గారముగను
లాలింతువుఒడిలో లలితాంబికానీవు
పాలింతువు కనురెప్పవలె తల్లి
నీకటాక్షమునకు నీచలువకులేవు
సరిహద్దులుజననీ, చల్లనమ్మ
మధుర మీనాక్షిగమము గాయునీవమ్మ
మామంచితల్లివి మాకుదిక్కు
కంచికామాక్షివైకైవల్యమిచ్చేవు
లోకేశ్వరీపాహిలోకమాత
మంగళము నీదు రూపము మానినినువు
మమ్ముచక్కగ గాంతువు మహిమనీదె
మదినిదోచుతల్లీ నీదు మమతలెపుడు
మరిమరి మురిపించునునీదు మంచితనము
భక్తుల బ్రోతువు భగవతీ దేవివై
కన్న బిడ్డల వలె గారముగను
లాలింతువుఒడిలో లలితాంబికానీవు
పాలింతువు కనురెప్పవలె తల్లి
నీకటాక్షమునకు నీచలువకులేవు
సరిహద్దులుజననీ, చల్లనమ్మ
మధుర మీనాక్షిగమము గాయునీవమ్మ
మామంచితల్లివి మాకుదిక్కు
కంచికామాక్షివైకైవల్యమిచ్చేవు
లోకేశ్వరీపాహిలోకమాత
మంగళము నీదు రూపము మరువలేము
మమ్ముచక్కగ పాలించు మమ్మనీవు
మదినిదోచుతల్లీ నీదు మహిమలెపుడు
మరిమరి కురిపించుము దయ ఉమా భవాని
Somg 12
వేంకటేశ్వరునివి వినతులు ప్రభు
పాహియనినచాలు పావనమౌమేము
ఏడు కొండలవిభొ ఏలు మమ్ము
కాంత తోడుగ నువు గాంచు మయ్య
పలుకు నువ్వు తండ్రి పరమాత్మ నీవేను
శరణమునువు నీయి చక్కనయ్య
విద్యానెలవునీవు వినతులమ్మ
వాగ్దేవిగయవిద్య వమ్ముజేతువుదేవి
భారతీప్రణతులు భగవతినువు
వరదాయినీ హంసవాహినీబ్రోవుము
శారదాంబా గావు సకలజనుల
కమలజురాణివి గాంచుమమ్మ దయగ
తల్లీసరస్వతీ త్రాహి త్రాహి
ముదము తోడ గొలుతుము నిను మేము
మనసులోన నిలుచుమమ్మ జనని నువ్వు
మమ్ము వీడి పోకు మాకు దిక్కు
ధర్మమూర్తి విభుడు దనుజవైరి
మోదము నిచ్చును మోక్షప్రదాతైన
మోహన కృష్ణుడు మురహరుండు
దాసుల బ్రోచు నంద కుమారుడైతాను
ధరణీ ధరుండు విధాతశౌరి
రాధా రమణుడు నారాయణుండజితుడు
రవిచంద్రనేత్ర పరాత్పరుండు
గరుడ వాహనుండు కలవిదారి
పద్మనాభుడు హరి పన్నగ శయనుడు
భక్తజనుల పాలిభద్రమూర్తి
కన్నానీకైయశోదకడుకూ రిమిగన్
మన్నునునీవేతింటివి
చిన్నికరములనిడివడిగ, చిలిపిగ కృష్ణా
బాలకృష్ణులీలభళిగనెపుడు
పాపములనుబాపుపరమాత్మకధలను
వినెడిభాగ్యమెపుడువిడువరాదు
చక్కనిచిన్నారి, చూడచకనిమమతతో
దక్కెనుభాగ్యమదేమో?
మక్కువతోచిట్టిపాప, మరచెజగమునే
ల్లందరికుల్లాసమునిడిరంజిప జేసెన్
సుందరమీదృశ్యముమన
డెందముగోదావరమ్మొడినతేలెగదా
రావణాంతకపరబ్రహ్మమిలన
రమణిసీతామనోరమలోకపావని
రామునిపట్టపురాణి, జనని
రాజశేఖరుడైనరామభద్రునిధీటి
రామభక్తులపాలిరత్నమేను
రమ్యముదివ్యమురమణీయకావ్యమౌ
రామకధచిలుకురాగసుధలు
మంచిగంధపరిమళమ్ముమనసులోన
మహిమలెన్నలేమెపుడునుమరువలేము
మాధవునినామ స్మరణమె మంత్రమౌను
ఫలములనొసగేముభక్తిమీర
దేవీవిరాజిల్లి దివ్యముగానీవు
పూజలుగైకొనీ పుణ్యదినము
అమ్మాదయగగను ఆనందవల్లివి
అఖిలమునీకృపేయవనిలోన
నయనమనోహరీనళినదళాక్షివి
మామొరలనువినిమమ్ముగాచు
ఆశ్రితులను బ్రోచె అమ్మనీవు
సిరులుసంపదలను శ్రేయమ్మునిత్తువు
మ్రొక్కులందుమావిముదముతోడ
వాగీశ్వరీదేవివాణీనమమునీకు
శారదానినుగొల్తు శ్రద్దతోడ
బ్రాహ్మీనిరంజనీ రాగస్వరూపిణీ
వంధ్యామహాశ్రయా వందనములు
శ్రీప్రదా సౌమ్యా సురేఖా సరస్వతీ
చంద్రికాభోగదా శరణమమ్మ
వేదవల్లీనీకువినతితల్లి
జపమాలదాల్చెడిజవరాలివేనీవు
తలపులందుననిల్వుదయగమాత
సురలుగొల్తురునినుశోభనాంగి
భవసాగరంబున బడియున్నననుగావు
పరదేవతానీవెపాహినిడుము
సర్వసుఖకరీ ప్రసన్నవదన
భగవతీనినమితభక్తిగసేవింతు
పాదపద్మముకడపాదునీయి
అవనీజనులగాయు ఆదిశక్తి
అన్నపూరణితల్లి ఆద్యంతములునీవె
అంబాభవానీజయంబునీకు
అన్నపూరణితల్లి అఖిలాండనాయకీ
విశ్వనాధునిరాణివినతులమ్మ
అన్నపూరణితల్లి ఆనందదాయకీ
వందనములునీకు మందగమని
ఆత్మస్వరూపమా అవనిలోన
అన్నపూరణితల్లి అనురాగమేనీవు
అతిలోకసుందరీ అరుణకాంతి
అన్నపూరణితల్లి అరవిందదళనేత్రి
కరుణగగాంచుమో కలవిదారి
అన్నపూరణితల్లి అమితమునీదయ
సర్వేశ్వరీ దేవి శరణమమ్మ
శ్రీరాజరాజేశ్వరీ అనుపమ
నిఖిలవిద్యేశ్వరీనిరుపమానిర్మలా
లోకశోకవినాశిలోకరక్ష
సకలహితకరిణీసర్వసంపత్కరీ
రాగస్వరూపసురమునివంద్య
సర్వమంగళదాయిసర్వశుభంకరీ
నిగమాగమాది ప్రణిత అనన్య
విశ్వకర్మిణినీకువినతులమ్మ
పరమేశ్వరీసర్వపాపనాశీశుభా
శ్రీకరుణాసాగరీప్రణతులు
పరదేవతానమోపరమశాంతానమో
భార్గవీభగవతీభావగమ్య
ఆనందభోగినీఆశ్రితవత్సలా
శ్రీలలితాంబికాశ్రియమునీయి
శ్రేయసీ శ్రీఫలీశచీ శ్రీకృపాబ్ది
ఈశ్వరీ శ్రుతిసన్నుతా ఏలుమమ్ము
శాంకరీభైరవీనీవెశరణమమ్మ
భక్తిగాగొలుతుమో భక్తిగమ్య
మహిమాన్వితాతల్లి మహిషాసురాంతకీ
అమ్మా శివానీ ఉమా భవాని
చంద్రశేఖరురాణి చండీ శచీ మాత
చిద్రూపిణీ దేవి చిత్ప్రకాశ
లోకమ్ములనుగాచు లోకేశ్వరీ దేవి
సదయా కృపాశీలి శక్తిరూప
గౌరీత్రయంబికేగావుమమ్మ
పాపసంహారిణీ పద్మాక్షిషోడశీ
శాంభవీపాహిపాశాంకుశధరి
కల్మషదూరాదుఖహరీసుజనపాలి
సద్గతిదాయినిసత్యవాణి
ప్రణవస్వరూపిణీప్రణతులునీకమ్మ
పతితపావనమునీపాదధూళి
కొలుతుమెపుడు నిన్ను కూర్మితోడ
భక్తిగ బ్రతికెదము భారము నీదేను
మమ్ము బ్రోవు మమ్మ మంగళాంగి
ఓం నమో వర ఙ్ఞానదాయిని ఓం నమో హితపోషిణీ
ఓం నమో శుభ శోభనాంగిని ఓం నమో పరదేవతా
ఓం నమో కరుణావరప్రద ఓం నమో లలితాంబికా
వరదాపాహిశుభానమమ్ముసిరిసంపత్కారిణీపాహిమాం
శరణమ్మోహరురాణి శ్రీవిభవదాశక్తీదయాసాంద్రమా
అరవిందాక్షిభవాద్బితారిణిసదాఆనందనృత్యేశ్వరీ
కావ్యలహరి
తేది. 29-10-2021
శుక్రవారం
అంశం : దీపావళి
శీర్షిక : దీపావళి వెలుగులు
పేరు: హిరణ్మయి ములుకుట్ల
ఊరు: టొరొంటొ కెనడ
చరవాణి : 6474013077
హామీపత్రం : ఇది నా స్వీయ రచన.
దీపకాంతులలరారు దీపావళి
దివ్యతేజోమయమీ దీపావళి
దానవాంతకమైన దీపావళి
సీఆపన్నులార్తిదీరెగ దీపావళి
మాధవజయకేతనమీ దీపావళి
పీతాంబరురాణికీర్తి దీపావళి
ఆపతితపావనురాక దీపావళి
అయోధ్యలోసంబరమీ దీపావళి
ఆనందలాహిరిలన దీపావళి
అమావాస్యతొలగించు దీపావళి
అందాలువిరబూయు దీపావళి
శ్రీదేవిపూజావైభవమీ దీపావళి
బాణాసంచామోత దీపావళి
తారాజువ్వలపొంగు దీపావళి
మతాబులవెలుగు దీపావళి
భూచక్రములెతిరుగు దీపావళి
ఆత్మీయులుగూడు దీపావళి
పేణీలమాధుర్యమీ దీపావళి
పెద్దపండుగమనకు దీపావళి
సేదదీర్చునుమదిని దీపావళి
song 41
రామదూత హనుమ:
రాముడే సకలమై రాజిల్లు మారుతి
సీతారమణునికి సేవకుడిల
రామునిబంటుగ రాయబారముసేసె
అవనిపుత్రికజాడ యలవిజేసె
రామునిప్రేమను రణకుశలతనిల
తేరుకొనగసీత తెలియ జేసె
రామునికాప్తుడు రణరంగధీరుడు
జానకీమాతకు సన్నిహితుడు
రామసేవాతత్పరాయణుండితడుగ
ధరణిజకాపాడు దనుజవైరి
అంజనాసుతా మమ్ముల ఆదుకొనుము
పవనకుమరుడవుగ మాకు పాహినిడుము
సూర్యునికిశిష్యుడవునీవు శుభమునిమ్ము
రామదూతవుమము సఫలమునుచేయు
పేరు: హిరణ్మయి ములుకుట్ల
నివాసము: టొరొంటొ కెనడ
శీర్షిక: రాఘవా గావుమా
హామీ: యిది నా స్వీయ రచన
song42
పరంధామా హరీ పావనానిధానా
పశుపాశమోచనా పరమాత్మా స్వామీ
రఘుకులతిలకాఓ రావణాంతక ఘనా
పాపనాశకవిభో పాలించుమామమ్ము
సీతాప్రాణపతీ శ్రీకళ్యాణమూర్తి
చేతనాకారకా చిద్రూపా సుగుణా
రామాకృపావరా రాజీవలోచనా
కారుణ్యసింధువా కాపాడుమామమ్ము
ఆత్మబాంధవా ఓ ఆపన్నరక్షకా
శ్రీదయాసాగరా శ్రీశ్రేయోవరదా
నారాయణా పద్మ నాభా శ్రీరక్షా
రామారమణగుణా రాఘవాగావుమా
song43
అలసితిని నేను అంబాసుత
పలుకరించని దొరవెనువు..
రయముగ బ్రోవుము
నయముగ పలుకుము
నియమముగనేసేవించెదా
దయనుజూపుము ధర్మము కాదిది
ప్రియముగ గావలె దర్శనము (అల)
శరణము హేరంబ
శరణము గణేశ
శరణు శరణు శ్రీవిఘ్ణేశ్వరా
పరుడను గాను నే భక్తుడ నైతిని
నిరతము చేయుదు నీ ధ్యానమే (అల)
నమో శివపుత్ర
నమో శక్తీకర
నమహ మోదకప్రియా
అమిత శ్రీవిఘ్ణాధిప యినా
శ్రమ ఎల్లను నీ సేవార్ధమే (అల)
song44
స్తోత్రమ్ముజేసేము శోభనాంగీనిను
దురితనివారిణీ దుఃఖ హారి
పూజలందుమునీవు పుణ్యప్ర దాఉమా
భోగప్రదాయినీ ముక్తి దాయి
తత్వమునేర్పేవు దరినిజేర్చేవు మా
తప్పిదములకోర్చు తల్లివినువు
ధ్యానమ్ము నీదయే దాక్షాయ ణీ మాత
కల్పవల్లీదేవికరుణనేలు
పతితపావనీఅపర్ణపాహినిడుము
ఇహపరములనొసగె ఈశ్వరినువు
పసిడిహృదయముగలపాశాంకుశధరివి
పాహినిడుముమాకుపద్మ నేత్రి
మనరాగభావశోభలు
కనబడునాయవినొరులకుకవనము లేకన్?
వినబడునవిమనకలముకు
మనసదిమౌనమునువీడిమనతో పలుకన్
పదములవమరినకులుకుగ
మదులాడునుసంతసముగమైమర చిసదా
యెదలవతిసున్నితమ్మ్మై
కదులునునయగారముగనుకవితా ఝరిలో
పదివేల యూసులు దెలుప
నెదలకు నొకపద్యమదియె నిజముగ చాలున్
చదువరులకు కవనమ్ములు
పదరస సారములు ఙ్ఞానపధ సాధనముల్
రాజులకోటలుగూలును
రోజులుగడచినపిదపనరోతగ మారున్
పూజలుబొందుమహాకవి
రాజులమాటలెపుడునువిరాజిల విద్యల్
song45
ఆదుకోవయ్యామమ్మో ఆపన్నరక్షకా
సాదు పుంగవ ఘన సేవితా సర్వేశ్వరా సదా (2)
తిరుమలరాయా దైవమా తిమిరాంతకా
దరిజేర్చుమమ్ము బాంధవా దయాసాంద్రా
చరణమ్ములకడ తావునీయి శాంతానీదు
శరణమ్ముకోరుదు శ్రీపతీ సారసాక్షా (ఆ)
కీర్తన ప్రియా గోవిందా క్లేశనాశా
ఆర్తజనపోషకా శ్రియా అనంతకృపా
ధూర్త కైవారా ధరణీ దురితవారా
స్పూర్తిప్రదాయకా సకల శుభవరప్రదా (ఆ)
శ్రీవేంకటేశ్వరా హరీ శ్రీకారుణ్యా
పావనమూర్తీ మాంపాహి పరంధామా
వేవేలభక్తులార్తిగా వేడేరునిను
గావుతండ్రీవేగముగా గరుడగామీ(ఆ)
song46
సీ
ఏడుకొండలసామిఏలుమయ్యామమ్ము
శ్రీచిద్విలాసాపరిజనపోష
పంకజనేత్రా అపరిమితా శ్రీవరా
నీకృపజూపుమానీరజాక్ష
ధన్యులమయ్యేముదర్శించినినువిభో
దుఃఖాంతకాప్రభూదురితదూర
పరమపావనమూర్తిపాపనాశకహరీ
సర్వశుభప్రదాసన్నుతాంగ
తే
వేంకటాచలాధీశుడావిధివిదాత
వేయినామములస్వామివేదవినుత
వందనములాశ్రితవరదావజ్రమకుట
వరవితరణాతిరుమలాద్రివాససదయ
కావ్యనాయికవేచెకానబడుదువనీ
నెలరాయరమ్మోయినీవువేగ
ఏలరాకున్నావుఎక్కడున్నావోయి
కోమలాంగిమనసెకోరెనిన్ను
వంగకోకనుగట్టి వలపుతలపులతో
వేగెనీకొరకుగా వేయి మార్లు
నీలిముంగురులాడెనీకొరకాశగా
నీలవేణివిరహిణినినెదలచు
కంటినీరుతానుకడవలోదాచెనా?
వెంటలేవునీవు వేదనాప
జంటరమ్మువడిగ జవరాలి వెతబాప
ఒంటరాయెచెలియ ఊరడించు
song 47
సీ:
బిడదిపురీశ్వరాప్రీతిగనర్చింతు
శ్రీపదములునీవిశివపరేశ
ఆనందగంధేశఆరాధ్యదైవమా
ఆశ్రితరక్షకాఆదిపూజ్య
పరమశివనిజరూపపరాత్పరాహరా
లోకనాయకిపుత్రశోకనాశ
ఆరోగ్య వరదాయ ఐశ్వర్య దాయకా
ఆప్తబంధువునీవు అండనీవు
ఆ:
శక్తిపాతమిచ్చుశంకరాభైరవా
శరణు స్వామి శరణు సత్యదేవ
కరుణకునువురూపుకైవల్యవితరణా
మానససుమములివిమాతృమూర్తి
నిదురపోమాతండ్రినీవుసల్లంగా
నిదురపోమాబాబునీవుహాయిగా
ఆటలాడినావు అలసిసొలసినావు
నేటికికచాలించి నీవుశయనించు
గోరుముద్దలారంగించాకగోముగానీవు
గారాబుసేయకోకన్నయ్యపవళించననీ
నీలాలనింగిలోమెరిసేనాతారకలు
జాలమదేలనీకుజామురాతిరిలోన
పండువెన్నెలనీకు పట్టుపానుపుగా
కొండగాలివీచె కొలనుదరిలోన
నిదురించుమా అదమరచి నిండుగా నీవు
నిదురలోనెదిగేవుబంగారుకొండా
శ్రీరామాచంద్రుడేనిన్నుగాచేను
మారామదియేలమాకంటిపాప
Song 48
వేయివందనములు విఘ్ణరాజానీకు(2)
మూషిక వాహనా మునిజన సేవితా
పరమపదమునీదు పదముతండ్రి
పతితపావనమూర్తి పరిజన పోషకా
నీయండ మాకీయి నీరజాక్ష(వేయి)
గౌరీప్రియతనయా కలికల్మషపునాశ
గరిమ నీయుముమాకు ఘనముగాను
భానుకోటిశతప్రభాభక్తబాంధవా
పరమదయగగను పాహిపాహి (వేయి)
Song 49
సీ:
వందే ముకుందా భవతరీ హరీ పాహి
ఆనందదాయి అవ్యాజ కరుణ
నంద గోపాలుడా నయన మనోహరా
ఘన మేఘ శ్యామా అగణిత సుగుణ
భక్త మందారా అభయవరదా నమో
శ్రీపతీ సర్వేశ శ్రీవిలాస
దామోదరా ముక్తి దాతా సకలశుభా
రాధికా వల్లభా రంగ నాధ
ఆ:
మాధవా శరణము మదనాంతకా త్రాహి
నిన్ను నమ్మి నాను నియతి తోడ
పాప పుణ్య రాశి పాదార్పితము సేతు
దర్శనమ్ము నీయి దయగనీవు
paaTa:
ఉరుకులు తీయుము ముందుకు మున్ముందుకు
వడివడిగా అలుపేలేక జడువక విడువక ఓ మనసా(2)
వరములు కురిపించు తెగువ సుమీ
పరుగున పోవు అశుభములవియే
పండుగె నీదౌ విజయమె నీదౌ
ధరలో పడకుము భయమను చెరలో
ఘనుడవునీవే చింతలు యేలా? (ఉరు)
పరమార్ధమున్న చాలును గా
సరుగున నీకొచ్చు కొత్త శక్తుల్ యుక్తుల్
పొరబడకుమా అశక్తుడనని
హరుడవు నీవే శివుడవు నీవే (ఉరు)
ఉల్లాసమేహాయిగాఉయ్యాలయైఊగేనులే
అట్ట్లారగించేరులేఆటలేపాటలై
వెన్నలమ్మతానేవన్నయై
జలతారుపావడాగట్టేనులే
అమ్మయిజడలోనపూవులే
అందమైఒదిగేనులే
భాగ్యమేపండంగగోరంటయై
నోములేనోచేరులే
ఇంతులేపూబంతులై యింపుయై మురిసేరులే
song 50
సీ
ఏడుకొండలసామిఏలుమయ్యామమ్ము
శ్రీచిద్విలాసాపరిజనపోష
పంకజనేత్రా అపరిమితా మాపైన
నీకృపజూపుమానీరజాక్ష
ధన్యులమయ్యేముదర్శించినినువిభో
దుఃఖాంతకాప్రభూదురితవార
పరమపావనమూర్తిపాపనాశకహరీ
సర్వశుభప్రదాసన్నుతాంగ
తే
వేంకటాచలాధీశుడావిధివిదాత
వేయినామములతండ్రివేదవినుత
వందనములాశ్రితవరదావజ్రమకుట
వరవితరణాతిరుమలాద్రివాసపాహి
song 51
సీ
రఘుకుల తిలకా వరా లోక శుభకరా
రామా వరప్రదా రాక్షసారి
పరమదయాకరా వరసుగుణప్రభా
అరవిందదళనేత్ర ఆర్తరక్ష
భువనేశ్వరాప్రభోభూరికృపాంబుధీ
భక్తహృదయవాస భయవిదారి
దశరధతనయా చిదానందదాయకా
ధర్మవ్రతాహరీ త్రాహి త్రాహి
ఆ:
కరుణకు నువుపేరు కౌసల్య ప్రియసుతా
గాంచుమమ్ముతండ్రి కనికరముగ
ముక్తిపదమునజను మోదము గోరేము
శరణము నిడు స్వామి సార సాక్ష
Comments
Post a Comment