శ్రీరామకథామృతము(Sri Rama Kathaamrutamu)


https://youtu.be/Sl9oLFE3qJc( Audio File)


   శ్రీరామకథామృతము


హరి వందనము

పరమ పురుషా ప్రణామము

కరివరదా నీకుకోటికై దండములున్

వరదా వినయముగ వినతి

సరసిజనాభా, హరీ ప్రసన్నముగగనూ



హరి కీర్తనా మృతమునే

నిరతము గ్రోలు తపసుడు, మునీంద్రుడు, మహతిన్

కరముల మీటెడి నారదు

నరయును వాల్మీకి ఋషి తన గృహ మునిటులన్


నారద వాల్మికీ సంవాదము


వాల్మికీ:

ఆర్యా! తెలుపుము ధరలో

కార్యంబుల దృఢ వ్రతంబు కల వాడెవరున్?

వీర్యము సత్యము ధర్మము

ధైర్యము దాలుచు కృతజ్ఙతా నెలవెవరున్?



కలడే లోకములకు హిత

ముల నీయు యనఘుడు, కోపము జయించి నిలన్

అలవోకగ ప్రియవాక్కుల

నలరెడి సచ్చరితగల రణధురంధురుడున్?


నారద:

కాన బడవుగద నిలలో

మానవ మాత్రులకు యిన్ని మంచిగుణములున్

ఆనతి తండ్రిది నిలుపగ

కానల కేగెను నృపాలు, కరుణా మూర్తీ


కౌసల్య ముద్దుల సుతుడు,

దాశరధి, దయగను గాచు  దానవ వైరిన్

నాశము కాది తని యశము

కేశవుడె నరునిగ నలరె కీడుల నడచన్


నిఖిలము దెలిసిన వేలుపు

సఖుడై గాచు జనులనిల, సహృదయుడితడున్

సుఖశాంతులనిడి యండ ని

లు ఖలవిదారిగ, సుగుణములుమెరయు నృపుడున్


శ్రీరామభద్రు శోభను

ఆరాజేంద్రుని ప్రతిభను ఆనందముగా

శ్రీరామాయణము తెలుపు

ఈరామచరితయెముక్తి ఎల్లరికిసుమీ


తెలిపెద రాముని గాధను

కలుగునుగ సకల శుభములు కల్యాణంబౌ

తొలిపుత్రుడు దశరధునికి

కలిమినితడును తనతల్లి కౌసల్యకిలన్


సాగెను బాల్యము క్రీడగ

ఆగని వేగమున కదుల యానందముగన్

వేగిర పడెను దశరధుడు

"నేగన వలెనింక రాముని నృపాలునిగన్"


రాముడె రాజని చాటగ

ఆమోదము కాకకైక అడిగెను వరముల్

"రాముని కానల కంపుము

నాముద్దులసుతునిసేయునరపాలునిగన్"



ఆటలు కైకవు సాగెను

నోటపలుకురానిదుగ్దనుదశర ధొండెన్

కోటను వీడెను రాముడు

మాటను నిలుపుట కొరకును, మౌని వలువలన్!


నర్తించిన విధినిటులన

వర్తనము  పవిత్రమౌ యువతి జనకసుతా

కర్తవ్యమ్మిదని దలచి 

భర్త యడుగు జాడల జనె, బంగరు తల్లీ!


అన్నయె నతనికి ప్రాణము

అన్ని మరచి సేయు సేవ ఆప్యా యముగన్

అన్నకు తోడుగ వెడలెను

వెన్నౌ లక్ష్మణుడు విధిగ, వినయము తోడన్



ఆసర సుమంత్రు రధముగ

కోసల దేశమును దాటి, గుహుని పడవలో

ఆసీనులై వడిగ గం

గాసింధువు దాటి , జనిరి కానల బాటన్


చాల దినమ్ములు గడిపిరి

ఆలంబము లేక వారు అడవుల లోనా!

ఆలియు, తమ్ముడు తోడుగ 

కాలి నడకనే ఋషులను గనె రఘువరుడున్




కృపగ భరద్వాజ ఋషుడు

ఉపదేశించెను" సలపుము ఉనికి నృపాలా

తపసుగను చిత్రకూటము

న, పరీక్షా కాలమందు న దగును మీకున్"


ఆమాటల కనుగుణముగ

రాముడు వర్తించె , గడిపె రమణీయముగన్

ప్రేమకు పేరై , కుటికన

సౌమిత్రీ సీతల యెడ సౌజన్యముతో


కానల కేగిన సుతుకై

తాను వగచి విగతుడాయె దశరధ ఱేడున్

ఆనతి యన్నది గైకొన

కానల కేగెను భరతుడు గంభీరముగన్



కాదనిరి రాజ్యలక్ష్మిని

సోదరు లిరువురును ధర్మసూత్రముగ సుమీ

ఆదుకొనవలె ప్రజలనని

పాదుకల నిడిభరతుడిని ప్రతినిధి జేసెన్


రాముని సేవగ భరతుడు

వ్యామోహమ్ముకు నెడముగ పాలన జేసెన్

రామ ప్రతినిధిగ నంది

గ్రామమున వసించి వేచె రామునికొరకై


కోదండ పాణి వెడెలను

తా దండక వనము, క్రొత్త తావు వెదకుచున్

పూదండలు సామికిల, వి

రాధునిగూల్చె, మునులపరిరక్షణ బూనెన్


శరభంగ సుతీక్షణ ముని

వరులను గొలిచెను యగస్త్య భట్టారునికిన్

పరిచారములను జేసెను

దరినిడె రక్కసుల దునిమి తపసులకు సుమీ


రక్కసిశూర్పణకచెవులు

ముక్కుయుఖండించె, యుద్దమునకు దిగిరిగా

యిక్కటునెరింగిసోదరు

లక్కసుజూప, పగతోడ, రామునితోనూ



ఖర ధూషణ త్రిశిరస్సులు

మరణించిరి దారుణ రణమందున, తీరెన్

ధరణి బరువు గూల యసుర

పరివారము గూడ, విజయ ప్రభ రామునిదే


తెలిసెను లంకేశుకి నసు

రలు తనవారు మరణించిరని, రోషమునన్

గలిగించ నమిత దుఖమును

కులసతి సీతాపహరణకు వలలు బన్నెన్


మాయా బంగరు లేడిగ

కాయము దాల్చి తను సీతకన్నుల బడెగా

ఓయాతువు: మారీచిడు,

ఆయోచనెరుగక సీత ఆపేక్షించెన్


కామితము దీర్చ కదిలెగ

రాముడు, బంగరు మృగము వెరచి పరుగెట్టెన్

స్వామి విలంబన సేయగ

సౌమిత్రియు జనె వెదుకుచు, సాయము సేయన్


ఓంటరిగ యుండె జానకి

యింటికి యతిగానువచ్చి, ఇంతిని మాయన్

వెంటగొని బోయె రావణు

మింటినెగురుచును, వగచెనమితముగ సీతా 




సీతా దేవిని వెదకుచు

నాతురముగ రాముడొలయె నడవుల లోనా

పాతకుడు కబంధు నడచె

మాత శబరికి నిడె ముక్తి మార్గమవనిలో


కలిసిరి సుగ్రీవు నపుడు

నలరిరి స్నేహము నవారు నగ్నియె సాక్షీ

తెలిసి యతనికథ రాముడు

కలహమున వధించెచాటుగనువాలినిలన్



సుగ్రీవుడాయెరాజు, య

నుగ్రహముగ రామునిది, తను కపుల బంపెన్

ఉగ్రముగ వెతకవలె మీ

రగ్ర ము దాక భువిలోన, రాముని సతికై


దక్షిణమున గల సంద్రమొ

కక్షణ మాగకను దాటెగ పవన సుతుడున్

వృక్షము క్రిందన, లంకన్

చక్షువుల దుఖాగ్ని రగులు జానకిని గనెన్


రామాం గుళీయకము సీ

తామాతకు నిచ్చి బాపె తాపము, పొందెన్

ఆమోదముగా రత్నము

రామునికీయగ, దునిమెను రాక్షసుల సుమీ



వంచెను కొమ్మలు వనమున

పంచెను ధుఖమును వధించి మంత్రి కుమరులన్

త్రుంచెను యక్షుని రణమున

మంచిగ బ్రహ్మాస్త్రమునకె మారుతి లొంగెన్


రక్కసులు కట్టిరి హనుమ

నక్కసుతో, సలిపెరావణాసురు తోడన్ 

గ్రక్కున సంవాదమ్మును

నొక్కడె లంకా నగరమును దహించెసుమీ


ఇచ్చెను రాముని కి హనుమ

తెచ్చిన రత్నమును, పొందె దీవెనలెన్నో

కచ్చితము రామబాణము

మచ్చిక జూపెను సముద్ర మతి తేలికగా


ఆయస బడ లేదు కపులు

వ్రాయగ భక్తిగ నిటుకల రామా యనుచున్

మాయగ నవి తేలెనుగా

సాయము చేసెను యుడుతలు శక్తి కొలదిగా



వారధి గట్టెను నలుడు ప

యోరాశిని దాటిరి కపియోధులు, పోరున్

వీరులుగ నిలువ, రాముడు

తా రణమున సంహరించె దశకంఠుడినిన్


చేసె విభీషణు రాజుగ

ఆసురు తోమెలిగి తివనె అవనిజ తోడన్

కాసంత దయను జూపక,

ఆసతి యగ్గిన దుమికెను యాహుతి నవగా


నిలువెత్తు మంట సహితము

కలికికి హాని దలవెట్టగబెదిరెనుగదా

నిలిచె పతీవ్ర తల సరస

నిలలోజానకి, రఘువరునికిదగు సతిగన్


అందాలజంటవెడలెను

నందిగ్రామముకులక్ష్మణసమేతముగా

సందడిసీతాదేవిదె

సందోహమెనికభరతుకిసన్నిహితులతో


వనవాసముపరిపూర్ణమ

యను జటలను కత్తిరించె యశము మిగులగన్ 

జనులనునడిపెనురాముడు       

తనురాజుగనుపదకొండు దశశతి శకముల్   


రామాచాలునుగానీ

నామము అశుభములు, గూలి నాశన మౌగా

కామితములు దీర్చుదొరవు  

స్వామీ దయతో గనుమము వరదా రామా 








Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3