Posts

Mattakokila

35. 34. ఆదుకొందువు అన్నివేళల ఆదిశక్తిగ భక్తులన్ సాదుపుంగవ సేవితా భవ సాగరమ్మును దాటగా నీదుసన్నిధిచేరగా శివ నిర్మలా నిను వేడుదున్ నాదుజీవన గమ్యమా శరణమ్ము సార్దక దాయకీ 33. శ్రీసరస్వతి శారదా తవ శ్రీపదమ్ములు గొల్తు నే శ్రీసుధామయి భారతీ శుభ శ్రీప్రదా నిను వేడెదన్ శ్రీసురాగమ రంజితా మమ శ్రీసుఖాభివివర్ధినీ శ్రీసుమార్చితరాగపూజిత శ్రీశుభంకరి పాహిమాం 32. ఆదిశక్తివి తల్లి నీవెగ ఆర్తబాంధవి వేడుదున్ నీదు బిడ్డలమమ్మ నువ్విల నీడయై మము బ్రోవుమా ఆదుకొందువు అన్నివేళల ఆత్మకారకశక్తివై శ్రీదయామయి సన్నుతాంగి అశేషభక్తసుపూజిత 31. శ్రీద శ్రీవరదా ఘనా వర శ్రీగణేశ్వర పాహిమాం శ్రీదయాకర  శూర్పకర్ణ విశేష బుద్ధిబలప్రదా నాదబిందుకళాధరా గణ నాయకా ప్రణమామిత్వం మోదకప్రియ సిద్దివర్ధక మోక్షదాయక రక్షమాం 30. శ్రీమహామహిమాన్వితా శుభ శ్రీప్రభాకరదీపికా వామదేవ శివా శుభంకర భక్త పూజిత శ్రీపదా కామితార్ధ ఫలప్రదా మమ కర్మ సంకట వారణా ఓమునీశ్వర సేవితా బహు ఉన్నతోన్నత న్యాయమా 29. నిన్నునమ్మితినాగభూషణ నిత్యపూజిత ఈశ్వరా ఉన్నతోన్నతదైవమా నువు ఊహకందని తేజమా సన్నుతింతుననంతతత్వ అసాధ్యసాధకహేతువా సన్నిధిన్ ననుచేరనిమ్ము శశాంకశేఖరమూర్తివై 28. భక్తిగా...

Nithya Deva 6

100 నూరుపద్యములను నుడివితి భక్తిగ చదువువారికీయ చలువ శ్రద్ద దయగనీవుగాంచి తామసమునడచి శుభమునీయితండ్రి శోభనాంగ 99 చరణ వందనములు చంద్రశేఖరునికి పదసుమాంజలులివి పాదములకు నయనదీపకునికి నమములు అజ్ఞాన ధ్వంసునికి పదసుమదళములివియె 98 నిత్యదర్శనమ్మునిజముగ నాకిచ్చె నాదుగురువుతానునందముగను దర్శనమ్ముసర్వదారిద్ర్య దుఃఖహ రణముసర్వభవహ రణము వరము 97 యిష్టములనుకష్ట నిష్ఠూరములను నే నర్పనమునుసేతు నాగభూషు పదములకడ ; శివుని పదపద్మములు సర్వ తాపహరణములవి దయకుపేరు 96 కష్టములనుగూల్చ కాలభైరవుడుండు నష్టములనుపూడ్చ నందివాహు నిజమిదనిమరచుచు నిష్ఠూర బడనేను మనసునందునెపుడు మదనవడను 95 నమమునీకుతండ్రి నాదుహృదయనాద అనితర కృప కరుణ ఆత్మనిలయ వందనమ్ము ప్రాణ వల్లభా శరణము శాంత మూర్తి శరణు సాంబ సదయ 94 నిస్సహాయతలను నిజకోపతాపము అర్పనమునుసేతు అభవునికడ దుర్బలతను అన్ని దుర్బుద్ధులనునేను అర్పనమునుసేతు అభవునికడ 94 లోనిశత్రువులను లోభమాత్సర్యము లనుదునమవలెనిల అనుదినమ్ము యుద్దములనుసేయు యోగికావలెనేను విజయమొంద ధరన వినయముగను 92 చూడ దగును శివుని చోద్యము వడకుండ ప్రతి అణువున  మరియు ప్రతి క్షణమున సర్వ కాల స్థితుడు సర్వేశ్వరుడు తానె సర్వ కర్త భోక్త సత్...